• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఎన్టీఆర్-నీల్.. ఈ...

ఎన్టీఆర్-నీల్.. ఈ టార్గెట్ సాధ్యమేనా?

| మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

By - Tupaki Desk
Update: 2025-01-29 02:45 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందనున్న పాన్ ఇండియా మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్ట్ ప్రీప్రొడక్షన్ పనులు పూర్తి కావచ్చాయి, ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూట్ ప్రారంభం కానుంది.

మేకర్స్ ముందుగా 2026 సంక్రాంతి విడుదలను లక్ష్యంగా పెట్టుకున్నారు. సాధారణంగా పాన్ ఇండియా సినిమాలకు చాలా సమయం అవసరం ఉంటుంది, కానీ ఈ ప్రాజెక్ట్‌ను కేవలం 10 నెలల వ్యవధిలో పూర్తిచేయాలని దర్శక నిర్మాతలు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ షెడ్యూల్‌ ప్లాన్‌ను ఎలాంటి జాప్యం లేకుండా అమలు చేయగలరా అనేది సినిమా పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.

మరోవైపు ఎన్టీఆర్ ప్రస్తుతం ‘వార్ 2’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం షూటింగ్ త్వరలో పూర్తి కానుంది, తదుపరి ప్రశాంత్ నీల్ సినిమాపై పూర్తి ఫోకస్ పెట్టనున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ ఈ సినిమాతో తన కెరీర్‌లో మరో లెవెల్లో క్రేజ్ అందుకోవాలని భావిస్తున్నారు. ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిగణలో ఉన్నట్లు సమాచారం. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎలిమెంట్లతో కూడిన పాన్ ఇండియా స్థాయి సినిమా కావడంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

షూటింగ్ సమయంలో ఏ చిన్న జాప్యం జరిగినా, రిలీజ్ డేట్ వాయిదా పడే అవకాశం ఉన్నప్పటికీ, మేకర్స్ ముందుగా ఉన్న ప్లాన్‌ను అమలు చేసే దిశగా కష్టపడుతున్నారు. అదేవిధంగా, ఈ సినిమాకు రుక్మిణి వసంత్‌ని హీరోయిన్‌గా ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే, ఆమె పాత్ర నిడివి పరిమితంగా ఉండబోతుందనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. ‘సలార్’ లో శృతి హాసన్ పాత్ర తరహాలోనే ఈ సినిమాలో రుక్మిణి పాత్రను కూడా డిజైన్ చేసినట్లు సమాచారం.

మొత్తానికి ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ టాలీవుడ్‌తో పాటు భారతీయ సినిమా అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఫిబ్రవరిలో ప్రారంభమవుతున్న ఈ సినిమా నిజంగా 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాగలదా లేదా అనేది ఆసక్తిగా మారింది.

Tags:    
  • Tollywood 
  • Filmindustry 
  • NtrPrashanthNeel 
  • Ntr 
  • Prashanthneel 
  • PanIndiafilm 
  • 2026Sankrantirelease 
  • MythriMovieMakers 
  • NtrNewmovie 
  • PrashanthNeelfilm 
  • NtrDragonmovie 
  • NtrRukminivasantheroine 
  • NtrWar2 
  • TelugumovieshootFebruary 
  • NtrNeelmovie 
  • NtrNeelshooting 

Similar News

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS