డ్రాగ‌న్ గ్లింప్స్ ర‌న్‌టైమ్ తోనే మ‌తి పోగొడుతున్న నీల్

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ. ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ ప్ర‌శాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై మొదటి రోజు నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

Update: 2026-05-16 18:06 GMT

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ. ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ ప్ర‌శాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై మొదటి రోజు నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటివరకు #NTRNeel అనే వర్కింగ్ టైటిల్‌తో పిలుస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఇప్పుడు మే 20న రిలీజ్ కాబోతున్న స్పెషల్ గ్లింప్స్ గురించిన వార్త అభిమానుల్లో నెక్ట్స్ లెవెల్ హైప్‌ను తీసుకొచ్చింది.




 


ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయబోతున్న ఈ గ్లింప్స్‌కు సంబంధించిన సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తవగా, ఇప్పుడు దాని రన్‌టైమ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఏకంగా 4 నిమిషాల 35 సెకన్ల నిడివితో ఈ గ్లింప్స్ రాబోతున్నట్లు సమాచారం. సాధారణంగా గ్లింప్స్ లేదా టీజర్స్ ఒకటి లేదా రెండు నిమిషాల నిడివిలో ఉండటం కామన్. కానీ ప్రశాంత్ నీల్ మాత్రం ఈసారి పూర్తిస్థాయి మాస్ విజువల్ ఫీస్ట్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. గ‌తంలో స‌లార్ టీజర్‌ను 1నిమిషం 47 సెకన్లతో సంచలనం సృష్టించగా, ఇప్పుడు డ్రాగన్ గ్లింప్స్ దానిని దాదాపు మూడు రెట్లు మించే రన్‌టైమ్‌తో రావడం అభిమానుల్లో భారీ ఆసక్తిని పెంచుతోంది.

ఇక ఈ గ్లింప్స్‌కు సంబంధించిన సెన్సార్ సర్టిఫికేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అందులో కనిపించిన డ్రాగ‌న్ పేరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు మేకర్స్ అధికారికంగా టైటిల్ ప్రకటించకపోయినా, మొదటి నుంచీ ప్రచారంలో ఉన్న డ్రాగన్ టైటిల్‌నే ఫైనల్ చేసినట్లు గ్లింప్స్ సెన్సార్ స‌ర్టిఫికేట్ చూస్తుంటే అర్థ‌మైపోతుంది. టైటిల్‌కు తగ్గట్టుగానే ఈ సినిమా కూడా అగ్ని పర్వతంలా పేలిపోతుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

ముఖ్యంగా ఎన్టీఆర్‌ను ప్రశాంత్ నీల్ పూర్తిస్థాయి మాస్ అవతార్‌లో చూపించబోతున్నార‌న్న టాక్ ఇప్పటికే అభిమానుల్లో అంచనాలను రెట్టింపు చేసింది. కెజిఎఫ్, స‌లార్ సినిమాల్లో తన మేకింగ్‌తో మాస్ ఆడియన్స్‌ను ఊపేసిన ప్రశాంత్ నీల్, ఈసారి ఎన్టీఆర్ ఎనర్జీకి తగ్గట్టుగా మరింత వైలెంట్ మరియు పవర్‌ఫుల్ వ‌ర‌ల్డ్ ను సృష్టిస్తున్నార‌ని సమాచారం. గ్లింప్స్‌లో ఎన్టీఆర్ ప్రెజెన్స్, యాక్షన్ ఎలివేషన్స్, బీజీఎం అన్నీ కలిసి ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ గ్యారెంటీ అని తెలుస్తోంది.

ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న ర‌వి బ‌స్రూర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గ్లింప్స్‌కు ప్రధాన బలం కానుందని చెబుతున్నారు. ఇప్పటికే ప్రశాంత్ నీల్ సినిమాల్లో బీజీఎం ఎంత కీలక పాత్ర పోషిస్తుందో ప్రేక్షకులు చూశారు. ఇప్పుడు డ్రాగన్ గ్లింప్స్‌లో కూడా రవి బస్రూర్ ఇచ్చిన మ్యూజిక్ ఫ్యాన్స్ కు పిచ్చెక్కిస్తుంద‌ని సమాచారం. ఈ భారీ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేక‌ర్స్ మ‌రియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. మొత్తానికి మే 20న రిలీజ్ కాబోయే డ్రాగ‌న్ మూవీ గ్లింప్స్ కేవలం ఓ గ్లింప్స్ గా మాత్రమే కాకుండా, ఇండియన్ సినిమాకు మరో భారీ మాస్ ఈవెంట్‌కు ప్రారంభ సంకేతంగా మారబోతుందన్న భావన అభిమానుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News