సినిమాను ఆపేశారు.. డౌన్‌లోడ్స్ మోత
హిందీలో ఎప్పుడో మూడేళ్ల కిందట పూర్తి చేసినా, సెన్సార్ సమస్యల కారణంగా విడుదలకు నోచుకోకుండా ఆగిపోయిన సినిమా.. సత్లజ్.
హిందీలో ఎప్పుడో మూడేళ్ల కిందట పూర్తి చేసినా, సెన్సార్ సమస్యల కారణంగా విడుదలకు నోచుకోకుండా ఆగిపోయిన సినిమా.. సత్లజ్. పంజాబ్‌కు చెందిన మానవ హక్కుల నేత జస్వంత్ సింగ్ ఖల్రా జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రాన్ని ముందు ‘పంజాబ్ 95’ పేరుతో రూపొందించాడు దర్శకుడు హనీ టెహ్రాన్.
పంజాబీ నటుడు దిల్జిత్ దోసాంజ్ ఇందులో లీడ్ రోల్ చేశాడు. పంజాబ్‌లో ఇందిరాగాంధీ మరణానంతరం కొన్నేళ్ల పాటు పోలీసులు జరిపిన దమనకాండలో 25 వేల మంది అన్యాయంగా చచ్చిపోయారనే విషయాన్ని తన పరిశోధన ద్వారా వెలుగులోకి తెచ్చిన జస్వంత్ సింగ్.. 1995లో హత్యకు గురయ్యాడు. అతణ్ని ఆరుగురు పోలీసులే ఎత్తుకెళ్లి చంపేశారని అభియోగాలు ఎదుర్కొన్నారు. ఎన్నో వివాదాలతో ముడిపడ్డ సినిమా కావడంతో సెన్సార్ బోర్డు ఏకంగా 127 కట్స్ సూచించింది. ఆ కట్స్ అన్నీ చేస్తే.. సినిమా ఏమీ మిగలదు కాబట్టి టీం ఓటీటీని ఆశ్రయించింది. జీ5లో మూడు రోజుల కిందటే ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్‌కు పెట్టారు.
డిజిటల్ స్ట్రీమింగ్ గురించి పబ్లిసిటీ చేస్తే.. ఏదో ఒక అడ్డంకి తప్పదని, టీం సైలెంట్‌గా చిత్రాన్ని ఆన్ లైన్లో రిలీజ్ చేసింది. కానీ సినిమా సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేయడం, ఈ సినిమాపై ఒక వర్గం నుంచి తీవ్ర అభ్యంతరాలు కావడం, కోర్టు చిక్కులూ ఎదురవడంతో జీ5 ఇండియాలో ఈ సినిమా స్ట్రీమింగ్ ఆపేసింది. ఐతే ఆల్రెడీ చూసిన వాళ్లు సినిమా గురించి గొప్పగా చెబుతుండడంతో ఇండియన్ ఫిలిం లవర్స్.. ‘సత్లుజ్’ను చూసేందుకు తహతహలాడిపోతున్నారు. కొందరేమో సినిమా సగం చూశాక స్ట్రీమింగ్ ఆగిపోవడంతో మిగతా సినిమా చూసేందుకు తపిస్తున్నారు.
వీళ్లందరూ ఇప్పుడు పైరసీ వెర్షన్ మీద పడ్డారు. డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చిన ప్రతి చిత్రాన్నీ పైరసీ చేసి టెలిగ్రాంలో డౌన్ లోడ్ లింకులు వదిలే హ్యాండిల్స్ పెద్ద సంఖ్యలోనే ఉంటాయి. వాళ్లకు ‘సత్లజ్’ రూపంలో మంచి బేరమే తగిలింది. ఈ సినిమాను పెద్ద ఎత్తున డౌన్ లోడ్ చేసుకుని చూస్తున్నారు. ఎక్స్ సహా వివిధ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్‌లో బోలెడన్ని పైరసీ లింకులు కనిపిస్తున్నాయి. ఎక్స్‌లో నేరుగా ఆ సినిమా వీడియోను కూడా పెడుతున్నారు కొంతమంది. మొత్తానికి జీ5లో స్ట్రీమింగ్ ఆగిపోయినా.. సినిమా అయితే చాలామందికి చేరుతోంది. కానీ జీ5కి మాత్రం ఇది చాలా నష్టం కలిగించే విషయమే.