#NTRNEEL : ఇక చాలు ఆపేయండి..!

ఎట్టకేలకు ఎన్టీఆర్‌ ప్రశాంత్‌ నీల్‌ కాంబో మూవీ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ఎన్టీఆర్‌తో ప్రశాంత్‌ నీల్ ఉన్న కొత్త ఫోటో సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చింది.;

Update: 2025-11-06 11:32 GMT

ఎన్టీఆర్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా విషయంలో నిన్న మొన్నటి వరకు పుకార్లు పెద్ద ఎత్తున షికార్లు చేశాయి. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లుగా పుకార్లు వరుసగా హడావిడి చేశాయి. దాంతో సినిమా విషయంలో అభిమానుల్లోనూ ఆందోళన మొదలైంది. ముఖ్యంగా ఎన్టీఆర్‌ కి స్క్రిప్ట్‌ విషయంలో అసంతృప్తి ఉందని, దాంతో దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ సినిమాను పక్కన పెట్టేశాడు అంటూ ప్రచారం మొదలైంది. ఆ విషయం నిజం అయ్యి ఉండదని చాలా మంది ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ మొదటి నుంచి అనుకుంటూ వస్తున్నారు. అయితే సినిమా షూటింగ్‌ జరగక పోవడంతో అది నిజమేనా ఏంటి అనే అనుమానాలను కొందరు వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ లుక్‌ విషయంలోనూ చాలా రకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో ప్రశాంత్‌ నీల్‌ నుంచి క్లారిటీ కావాలని అంతా డిమాండ్‌ చేస్తూ వచ్చారు.



 


#NTRNEEL సినిమా అప్‌డేట్‌

ఎట్టకేలకు ఎన్టీఆర్‌ ప్రశాంత్‌ నీల్‌ కాంబో మూవీ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ఎన్టీఆర్‌తో ప్రశాంత్‌ నీల్ ఉన్న కొత్త ఫోటో సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చింది. దాంతో ఎన్టీఆర్ నీల్‌ మూవీ క్యాన్సల్‌ కాలేదు, పక్కన పెట్టేలేదు సినిమా ఇంకా లైన్‌ లో ఉందని క్లారిటీ వచ్చిందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంత్‌ నీల్‌ గత చిత్రాల ఫలితాల నేపథ్యంలో ఈ సినిమా వెయ్యి కోట్ల ప్రాజెక్ట్‌ అంటూ నందమూరి అభిమానులు చాలా నమ్మకంతో ఉన్నారు. అలాంటి సినిమా ఎక్కడ ఆగి పోతుందో అనే ఆందోళన ఇన్నాళ్లు కొందరు అభిమానుల్లో కనిపించింది. తాజాగా ఈ ఫోటో సోషల్‌ మీడియాలో ప్రత్యక్షం కావడంతో ఫ్యాన్స్ అంతా ఊరిపి పీల్చుకుంటున్నారు. మీడియాలో కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారం కి బ్రేక్ వేసినట్లు అయింది. అంతే కాకుండా సినిమాకు సంబంధించిన క్లారిటీ రావడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. మీడియాలో జరుగుతున్న ప్రచారం ఆపేయండి అంటూ అభిమానులు కోరుతున్నారు.

ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబో మూవీ..

దేవర, వార్ 2 సినిమాల ఫలితాల నేపథ్యంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సహజంగానే ఈ సినిమాపై ఎక్కువ ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఆ ఫలితాలను మరిపించే విధంగా ఈ సినిమా ఉండాలని ఆశ పడుతున్నారు. కానీ సినిమా విషయంలో పుకార్లు ఆందోళన కలిగించడంతో ఫ్యాన్స్ క్లారిటీ కోసం సోషల్‌ మీడియా ద్వారా తెగ కామెంట్స్ చేస్తూ వచ్చారు. ఆ కామెంట్స్ చూశాడా లేదంటే తాను అనుకున్న సమయంకు సినిమాను ముందుకు తీసుకు వెళ్లాలని ఫిక్స్ అయ్యాడో కానీ ప్రశాంత్‌ నీల్‌ వచ్చే నెల నుంచి తిరిగి షూటింగ్‌ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ప్రశాంత్‌ నీల్‌ సలార్ 2 సినిమా కంటే ముందు ఈ సినిమాను తీసుకు వచ్చేందుకు రెడీ అయిన నేపథ్యంలో ప్రభాస్ అభిమానులు ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. కానీ వారు వెయిటింగ్‌కు తగ్గ ఫలితం పొందుతారు అని ఫిల్మ్‌ మేకర్స్ నుంచి సమాచారం అందుతోంది.

ఎన్టీఆర్‌ లుక్ విషయంలో..

ఎన్టీఆర్‌ ఈ సినిమా కోసం చాలా బరువు తగ్గాడు అని తెలుస్తోంది. ఇటీవల ఆయన లుక్‌ విషయంలో కొందరు ఆందోళ వ్యక్తం చేస్తే, కొందరు ఆనందంగా ఉన్నారు. శివ సినిమా రీ రిలీజ్ సందర్భంగా ఎన్టీఆర్‌ వీడియో బైట్ ఇచ్చాడు. అందులో మరీ సన్నగా ఉన్నాడు అంటూ ట్రోల్స్ వస్తున్నాయి. అయితే ప్రశాంత్‌ నీల్‌ ఏం చేసినా కచ్చితంగా బెస్ట్ ఔట్‌ పుట్‌ వచ్చే విధంగానే ప్లాన్‌ చేస్తాడు. కనుక ఆందోళన అక్కర్లేదు అనేది చాలా మంది వాదన. సోషల్‌ మీడియాలో ఎన్టీఆర్‌ లుక్ గురించి ఒక వైపు నెగటివ్‌ ట్రోల్స్ వస్తూ ఉంటే, మరో వైపు ప్రశాంత్‌ నీల్‌ నుంచి ప్రాజెక్ట్‌ ఇన్‌ లైన్ అంటూ క్లారిటీ రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి సినిమా వచ్చే నెల నుంచి ప్రారంభించి, 2026 సమ్మర్‌ వరకు పూర్తి చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. మరి సినిమా వచ్చేది ఎప్పుడు అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

Tags:    

Similar News