మ‌ళ్లీ ముంబైకి తార‌క్ ఎప్పుడంటే?

అయితే ఈ సినిమా షూటింగ్ మొద‌లైన నాటి నుంచి తార‌క్ మ‌ళ్లీ ముంబై వెళ్ల‌లేదు. 'వార్ 2' డ‌బ్బింగ్ ప‌నులు పూర్తి చేసాడా? లేదా? అన్న‌ది క్లారిటీ లేదు.;

Update: 2025-06-08 12:30 GMT

'వార్ 2' ముగించుకుని తార‌క్ వెంట‌నే 'డ్రాగ‌న్' షూటింగ్ లో జాయిన్ అయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతోన్న డ్రాగ‌న్ ప‌నుల్లోనే తార‌క్ బిజీగా ఉన్నాడు. అప్ప‌టి నుంచి నిర్విరా మంగా డ్రాగన్ షూటింగ్ జ‌రుగుతుంది. భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపొందుతున్న చిత్రంపై అంచనాలు అదే స్థాయిలో ఉన్నాయి. ఇందులో తార‌క్ పాత్ర ఎలా ఉండ‌బోతుంది? అన్న దానిపై ఆస‌క్తి రెట్టింపు అవుతుంది.

ఈ సినిమా కోసం ప్ర‌త్యేకంగా తార‌క్ మ‌రింత వెయిట్ లాస్ అయ్యాడు. లుక్ ప‌రంగా చాలా మార్పులు తీసు కొచ్చాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు హైద‌రాబాద్ లోనే జ‌రుగుతుంది. భారీ సెట్లు నిర్మించి చేస్తు న్నారు. ప్ర‌శాంత్ నీల్ సినిమాలంటే హీరోయిన్ల‌తో రొమాన్స్ ఉండ‌దు. పాట‌లు కూడా ఉండ‌వు. హీరోయిన్ పేరుకే క‌నిపిస్తుంది. మ‌రి డ్రాగ‌న్ లో అయినా హీరోయిన్ పాత్ర‌కు ప్రాముఖ్య‌త ఉంటుందేమో చూడాలి.

అయితే ఈ సినిమా షూటింగ్ మొద‌లైన నాటి నుంచి తార‌క్ మ‌ళ్లీ ముంబై వెళ్ల‌లేదు. 'వార్ 2' డ‌బ్బింగ్ ప‌నులు పూర్తి చేసాడా? లేదా? అన్న‌ది క్లారిటీ లేదు. అయితే ఈనెల‌ఖ‌రున తార‌క్ ముంబై వెళ్తున్న‌ట్లు స‌మాచారం. 'వార్ 2' ప్ర‌చారం ప‌నుల్లో భాగంగా ముంబై వెళ్తున్న‌ట్లు తెలుస్తోంది. 'వార్ 2' ఆగ‌స్టు మిడ్ లోనే రిలీజ్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌చారం ప‌నుల‌కు తార‌క్ అవుతున్న‌ట్లు క‌నిపిస్తుంది.

తార‌క్ తో పాటు హృతిక్ కూడా సిద్ద‌మ‌వుతున్నాడు. ముందుగా ఇద్ద‌రు బాలీవుడ్ లో కొన్ని ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌నున్న‌ట్లు స‌మాచారం. అలాగే ఇద్ద‌రు క‌లిసి కొన్ని టీవీ షోల‌కు కూడా హాజ‌ర‌వుతార‌ని తెలుస్తోంది. బాలీవుడ్ సినిమా ప్ర‌చారం అంటే క‌ర‌ణ్ టాక్ త‌ప్ప‌నిస‌రిగా ఉంటుంది. మ‌రి హృతిక్-తార‌క్ ఆ ఛాన్స్ తీసుకుంటారా? అన్న‌ది చూడాలి.

Tags:    

Similar News