హీరోయిన్ల గ్లామర్ వర్సెస్ పర్ఫార్మెన్స్!
ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. దీంతో ఉత్తరాది భామలు దక్షిణాదికి, దక్షిణాది నటీమణులు బాలీవుడ్‌కు క్యూ కడుతున్నారు.;
ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. దీంతో ఉత్తరాది భామలు దక్షిణాదికి, దక్షిణాది నటీమణులు బాలీవుడ్‌కు క్యూ కడుతున్నారు. అయితే ఈ మార్పులో ప్రధానంగా చర్చకు వస్తున్న అంశం గ్లామర్ వర్సెస్ పెర్ఫార్మెన్స్. ముఖ్యంగా బాలీవుడ్ నుండి టాలీవుడ్ కు దిగుమతి అయిన జాన్వీ కపూర్, కియారా అద్వానీ వంటి భామలు తమ గ్లామర్ షోతో ఇక్కడి ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు. `దేవర`తో టాలీవుడ్ లో లాంచ్ అయిన జాన్వీ కపూర్ ఏ రేంజ్లో దూసుకుపోతుందో చెప్పాల్సిన పనిలేదు. బ్యాక్ టూ బ్యాక్ ఛాన్సులందుకుంటూ పోటీగా తయారైంది.
పాన్ ఇండియాలో అమ్మడు నటిస్తోన్న `పెద్ది` సక్సెస్ అయిందంటే? జాన్వీ స్పీడ్ ను తట్టుకోవడం అసాధ్యమే. ఇప్పటికే తెలుగు యువతలో క్రేజీ బ్యూటీగా దూసుకుపోతుంది. మరో నటి కియారా అద్వాణీ గ్యాప్ ఇచ్చి సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. `భరత్ అనే నేను` ,`వినయ విధేయ రామ` లాంటి చిత్రాల్లో నటించిన బ్యూటీ ఐదారేళ్ల గ్యాప్ తర్వాత `గేమ్ ఛేంజర్` లాంటి పెద్ద సినిమాలో ఛాన్స్ అందుకుందంటే? చిన్న విషయం కాదు. ప్రస్తుతం కన్నడలో తెరకెక్కుతోన్న `టాక్సిక్` లోనూ నటిస్తోంది. ఈ సినిమా విజయం సాధిస్తే సౌత్ లో కొత్త అవకాశాలతో మరింత బిజీ అవుతుంది.
ఇలా ఇద్దరూ దక్షిణాది భామలకు మంచి పోటీగా నిలుస్తున్నారు. గ్లామర్ పరంగా భామలిద్దరికీ ఉన్న ఫాలోయింగ్ అసాధారణమైంది. ప్రయివేట్ పిక్స్ తో రెట్టించిన క్రేజ్ ను సొంతం చేసుకుంటున్నారు. కానీ సౌత్ హీరోయిన్లు ఆ స్థాయిలో బాలీవుడ్ లో పోటీ ఇవ్వలేకపోతున్నారనే వాదన వినిపిస్తోంది. దక్షిణాది హీరోయిన్లలో రష్మిక మందన్న మాత్రమే నార్త్ బ్యూటీలకు దీటుగా గ్లామర్ రేసులో నిలుస్తోంది. `పుష్ప` సినిమాతో నేషనల్ క్రష్‌గా మారిన అమ్మడు టాలీవుడ్ తో పాటు, బాలీవుడ్ లో మంచి అవకాశాలు అందుకుంటుంది. అంతే కాదు ఫోటో షూట్లు, పబ్లిక్ అప్పియరెన్స్ లలో రష్మిక కాన్ఫిడెన్స్ బాలీవుడ్ నటీమణులకు ఏమాత్రం తీసిపోదు.
సరైన హిట్లు పడితే? నార్త్ భామల్నే వెనక్కి నెట్టేసే రేంజ్ అమ్మడి సొంతం. సమంత బాలీవుడ్ కి వెళ్లినా? ఇంత వరకూ అమ్మడు ఎక్కడా తన ముద్ర వేయలేదు. ఛాన్సులందుకోవడం సహా గ్లామర్ అప్పిరియన్స్ లో నూ నార్త్ భామలకు పోటీ ఇ్వవలేకపోతుంది. లేడీ సూపర్ స్టార్ నయనతారకు ఆ ఛరిష్మా ఉంది. కానీ అమ్మడు సౌత్ పైనే ఫోకస్ తో పెట్టడంతో? సాధ్యపడలేదు. పైగా భామలిద్దరు ఎక్కడున్నా? నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. కీర్తి సురేష్ కూడా గ్లామర్ కంటే పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రలకే ప్రాధాన్యత ఇస్తోంది. రీసెంట్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల గ్లామర్ డాల్ గా హైలైట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కానీ అమ్మడి ప్లానింగ్ ఎలా ఉంది? అన్నది తెలియాలి. మొత్తంగా ప్యూర్ గ్లామర్ రేసులో బాలీవుడ్ భామలదే పైచేయి అవుతోంది.
కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ డాల్ పాత్రల కోసం మేకర్స్ ఎక్కువగా నార్త్ బ్యూటీల వైపే మొగ్గు చూపుతున్నారు.గ్లామర్ షో విషయంలో బాలీవుడ్ భామలు ఓపెన్‌గా ఉండటం, ప్రమోషన్లలో వారి స్టైలింగ్ సినిమాకు హైప్ తీసుకురావడానికి ప్లస్ అవుతోంది. దక్షిణాది నటీమణులు కొంత వరకు సంప్రదాయబద్ధంగా పరిమి తులకు లోబడి ఉండటాన్ని ఇక్కడి ప్రేక్షకులు ఇష్టపడతారనేది ఓ వాదన. కానీ నేటితరం పాన్ ఇండియా సినిమాల అవసరాల దృష్ట్యా గ్లామర్ కూడా ముఖ్యమైన వ్యాపార సూత్రంగా మారింది. అందుకే గ్లామర్ పరంగా కొత్తగా వస్తోన్న నార్త్ బ్యూటీలు సౌత్ మార్కెట్‌ను వేగంగా ఆక్రమిస్తున్నారు.