నటుల మధ్య విబేధాలతో ఆగిన ప్రాజెక్ట్!
`నో ఎంట్రీ 2` టైటిల్ తో చిత్రాన్ని పట్టాలెక్కిస్తామని వెల్లడించారు. కానీ ఈ సినిమా ఇంత వరకూ మొదలైంది లేదు.;
రెండు దశాబ్దాల క్రితం రిలీజ్ అయిన బాలీవుడ్ చిత్రం `నో ఎంట్రీ` అప్పట్లో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. రొమాంటిక్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో అనీస్ బజ్మీ తెరకెక్కించిన సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. అనీల్ కపూర్, సల్మాన్ ఖాన్, ఫర్దీన్ ఖాన్, బిపాసా బసు, ఈషా డియోల్, లారా దత్, సెలీనా జెట్లీ లాంటి నటీనటులుతో తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించింది. 20 కోట్ల బడ్జెట్ లో నిర్మించిన సినిమా 40 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈసినిమాకు సీక్వెల్ తెరకెక్కించాలని చాలా కాలంగా అభిమానులు కోరుతున్నా అనీస్ బజ్మీ మాత్రం సైలెంట్ గా ఉండి చివరిగా గత ఏడాదే సీక్వెల్ ప్రకటించి అందరీలో ఆశలు నింపాడు.
`నో ఎంట్రీ 2` టైటిల్ తో చిత్రాన్ని పట్టాలెక్కిస్తామని వెల్లడించారు. కానీ ఈ సినిమా ఇంత వరకూ మొదలైంది లేదు. ప్రకటన వరకే పరిమితమైంది. ఆ తర్వాత ఏ సందర్భంలోనూ అనీస్ బజ్మీ ఈ ప్రాజెక్ట్ గురించి ఎక్కడా మాట్లాడింది లేదు. కానీ నెట్టింట మాత్రం సినిమా ఎప్పుడొస్తుంది? అన చర్చ జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా `నో ఎంట్రీ 2` వెనుక అసలేం జరుగుతుందో వెల్లడించారు బజ్మీ. ప్రాజెక్ట్ ఆగిపోలేదని..కచ్చితంగా పట్టాలెక్కిస్తామని తెలిపారు.
సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి చివరి నిమిషంలో నటీనటుల మధ్య తలెత్తిన కొన్ని సమస్యల కారణంగా ప్రాజెక్ట్ నిలిచిపోయిందన్నారు. స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయిందన్నారు. విన్నవారందరూ దానిని మెచ్చుకున్నారని స్పష్టం చేశారు. ఈ ఆలస్యానికి క్రియేటివ్ పరమైన ఇబ్బందులు కారణం కాదని, కేవలం నటీనటుల ఎంపిక సమస్యలే కారణమని వెల్లడించారు. వారిలో వారికే తగాదాలు తలెత్తుతున్నట్లు అభిప్రాయపడ్డారు.
అలాగే సల్మాన్ ఖాన్ ఇందులో నటిస్తారా? అంటే ఆయనతో అందుకు ఎంత మాత్రం ఛాన్సు లేదున్నారు. పూర్తిగా కొత్త వారితోనే ముందుకెళ్లే ఆలోచనతో ఉన్నట్లు ఆయన మాటల్లో అర్దమవుతుంది. కానీ సల్మాన్ తో మాత్రం మరో సినిమా కచ్చితంగా చేస్తానన్నారు. సల్మాన్ ఖాన్ ప్లాప్ ల్లో ఉన్న సమయంలో `నో ఎంట్రీ` చేసాను. అదే సమయంలో `వాంటెండ్ `కూడా హిట్ అయింది. ఈ రెండు సినిమాలు సల్మాన్ ఖాన్ కు బౌన్స్ బ్యాక్ లా నిలిచాయన్నారు.
ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ప్లాప్ ల్లో ఉన్నా? ఆయన స్టార్ ఇమేజ్ ఎంత మాత్రం తగ్గిపోదన్నారు. ఒక బలమైన సినిమా పడితే సల్మాన్ రేంజ్ మళ్ళీ మారుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు. అలాగే సోషల్ మీడియాలో కొంత మంది పాత నటులతోనే సీక్వెల్ చేయాలని కోరుతుండగా, మరికొంత మంది కొత్త వారితే చేస్తే ప్రెష్ ఫీలింగ్ ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.