• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మ‌రో పాపుల‌ర్ మ‌ల‌యాళ...

మ‌రో పాపుల‌ర్ మ‌ల‌యాళ హీరోపై వేధింపుల కేసు!

| ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌ముఖ హీరోలు, న‌టుల‌పై కొంద‌రు న‌టీమ‌ణులు వేధింపులకు పాల్ప‌డ్డారంటూ పోలీసుల‌ను ఆశ్ర‌యించారు.

By - Tupaki Desk
Update: 2024-09-03 17:36 GMT

జ‌స్టిస్ హేమ క‌మిటీ నివేదిక మాలీవుడ్ ని గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది. ఈ క‌మిటీ సంచ‌ల‌న‌ నివేదిక మ‌హిళ‌ల‌కు కొండంత‌ ధైర్యాన్నిస్తూ అండ‌గా నిలుస్తుండ‌డం.. ప్ర‌భుత్వం నుంచి భ‌రోసా ల‌భించ‌డంతో ఇప్పుడు వేధింపుల‌కు గురైన న‌టీమ‌ణులంతా ఒక‌రొక‌రుగా బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. బ‌హిరంగంగా త‌మ‌కు జ‌రిగిన అన్యాయాల‌పై స్పందించ‌డ‌మే గాక కేసులు ధైర్యంగా ఫైల్ చేస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌ముఖ హీరోలు, న‌టుల‌పై కొంద‌రు న‌టీమ‌ణులు వేధింపులకు పాల్ప‌డ్డారంటూ పోలీసుల‌ను ఆశ్ర‌యించారు.

ఇప్పుడు పాపుల‌ర్ మ‌ల‌యాళ హీరో నివిన్ పౌళీ, అత‌డితో పాటు మ‌రో ఐదుగురిపైనా కేసు న‌మోదైంది అని కొన్ని వార్తలు వచ్చాయి. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఓ మహిళ చేసిన ఫిర్యాదుపై నటుడు నివిన్ పౌలీ, మలయాళ చిత్ర నిర్మాత ఎకె సునీల్, మరో నలుగురిపై కేరళ పోలీసులు సెప్టెంబర్ 3 (మంగళవారం)న‌ కేసు నమోదు చేశారు. సెక్షన్ 376 (అత్యాచారం) సహా భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎర్నాకులంలోని ఊన్నుకల్ పోలీసులు ధృవీక‌రించార‌ని పాపుల‌ర్ `ది న్యూస్ మినిట్‌` వెల్ల‌డించింది.

స‌ద‌రు మీడియా క‌థ‌నం ప్రకారం.. ఈ కేసులో నివిన్ పౌలీని ఆరో నిందితుడిగా చేర్చారు. ఆ మహిళ ఎర్నాకులం రూరల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ), వైభవ్ సక్సేనాకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో తనకు ఒక సినిమాలో పాత్ర ఇస్తానని వాగ్దానం చేశారని, దాని కోసం నవంబర్ 2023లో దుబాయ్ కి రావాలని కోరారని, ఆ తర్వాత దుబాయ్‌లోని హోటల్ గదిలో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆమె పేర్కొంది. ప్రస్తుతానికి పూర్తి వివరాలు అందుబాటులో లేవు అని న్యూస్ మినిట్ తెలిపింది.

నివిన్ పౌళీ 2010 మలయాళ చిత్రం `మలర్‌వాడి ఆర్ట్స్ క్లబ్‌`తో తన నటనా రంగ ప్రవేశం చేసాడు. ఆ తర్వాత ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్స్ లో హీరోగా న‌టించాడు. వీటిలో నేరం, ప్రేమమ్, బెంగుళూరు డేస్, 1983, మూతోన్ , తురముఖం వంటి చిత్రాలు న‌టుడిగాను మంచి పేరు తెచ్చాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న నిర్మాత ఎకె సునీల్ విజయ్ సూపరుం పౌర్ణమియం, మనోహరం వంటి హిట్ చిత్రాలకు నిధులు సమకూర్చారు. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై హేమ కమిటీ నివేదిక విడుదలైన నేపథ్యంలో వ‌రుస‌ ఫిర్యాదులు అందుతున్నాయి. ఇంకా ఎన్ని పేర్లు బ‌య‌ట‌కు వ‌స్తాయోననే టెన్ష‌న్ వాతావ‌ర‌ణం మాలీవుడ్ లో అలుముకుంది. తాజాగా నివిన్ పౌళీపై మహిళ ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు, వారిపై నాన్-బెయిలబుల్ కేసు నమోదు చేసినట్టు టైమ్స్ న‌వ్ క‌థ‌నం పేర్కొంది.

ఈ కధనాల ఫై హీరో స్పందించారు.  ”ఒక మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు నాపై కేసు పెట్టినట్లు తప్పుడు వార్తలు గుర్తించాను . ఇది పూర్తిగా అవాస్తవం. ఇవి తప్పుడు వార్తలు అని అందరు దయచేసి అందరూ తెలుసుకోండి. ఇది పూర్తిగా తప్పుడు ఆరోపణ అని నిరూపించేందుకు నేను కచ్చితంగా ఎక్కడికైనా వెళ్తాను. అలాగే ఇందుకు కారకులు అయిన వారిని వెలుగులోకి తీసుకువస్తాను. అలాగే వారిపై అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాను. నాకు మద్దతు తెలుపుతున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మిగిలినవి చట్ట ప్రకారం పరిష్కరించబడతాయి” అంటూ ఇన్ స్టా నోట్ లో పేర్కొన్నారు. నివిన్ పౌలీ ప్రేమమ్ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈ ఏడాది మలయాళీ ఫ్రమ్ ఇండియా సినిమాలో నటించాడు. ఇటు తెలుగులోనూ ఈ హీరోకు మంచి ఫాలోయింగ్ ఉంది.




Tags:    
  • S*xualassault 
  • Malayalamactor 
  • Nivinpauly 
  • Hemacommittereport 
  • Hemacommitte 
  • Malayalamindustry 
  • Mollywood 

Similar News

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

Copyright @2026

Powered by Blink CMS