నివేదా పేతురాజ్ మళ్లీ సినిమాల్లోకి!
అక్టోబర్‌లో నిశ్చితార్థం.. 2026లో వివాహం చేసుకోవాలని ఈ జంట ప్లాన్ చేసుకుంది అని వార్తలు వినిపించాయి.;
లవ్‌స్టోరీలు, బ్రేకప్‌లు టాలీవుడ్‌లో చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఒక విధంగా చెప్పాలంటే ఈ సంస్కృతి టాలీవుడ్‌లో చాలా అరుదు. బాలీవుడ్‌లో అయితే ప్రతి సినిమాలకు ఇలాంటి కథలు, స్టోరీలు వినిపిస్తూనే ఉంటాయి. డేటింగ్‌లు, బ్రేకప్‌లు అక్కడ సర్వసాధారణం. కానీ సౌత్‌లో మరీ ముఖ్యంగా టాలీవుడ్‌లో మాత్రం ఇలాంటివి చాలా అరుదు. కానీ అవి టాలీవుడ్‌లోనూ ఈ మధ్య ఎక్కువయ్యాయి.
హీరోయిన్‌లు, హీరోల ప్రేమలో పడటం, పెళ్లి వరకు వెళ్లడం జరుగుతోంది. కొన్ని దశాబ్దాల క్రితం ఉన్న ఈ సంస్కృతి టాలీవుడ్‌లో మళ్లీ ఇటీలే మొదలైంది. హీరోలు ఈ మధ్య హీరోయిన్‌లని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. కొంత మంది విడాకుల వరకు వెళితే మరి కొందరు ఆదర్శంగా నిలుస్తూ దేశ వ్యాప్తంగా వారి హ్యుమానిటీతో ట్రెండ్ అవుతున్నారు. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇదిలా ఉంటే టాలీవుడ్ హీరోయిన్‌లలో కొంత మంది ఇండస్ట్రీకి సంబంధం లేని వారిని ప్రేమించి మెహ్రీన్ లాంటి వాళ్లు పెళ్లి దాకా వెళ్లి దాన్ని రద్దుచేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇప్పుడు అదే జాబితాలో హీరోయిన్ నివేదా పేతురాజ్ కూడా చేరింది. దుబాయ్ బేస్డ్ బిజినెస్ మేన్ రజిత్ ఇబ్రాన్‌తో కొంత కాలం ప్రేమలో ఉన్న నివేదా ఈ విషయాన్ని గత ఏడాది ఆగస్టులో సోషల్ మీడియా వేదికగా వెల్లడించి ఆశ్చర్యపరిచింది. అక్టోబర్‌లో నిశ్చితార్థం.. 2026లో వివాహం చేసుకోవాలని ఈ జంట ప్లాన్ చేసుకుంది అని వార్తలు వినిపించాయి. అయితే ఆ తరువాత ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ నివేదా పేతురాజ్ తన ఇన్‌స్టా ఆకౌంట్‌లో రజిత్‌కు సంబంధించిన ఫొటోలని తొలగించింది. దీంతో నిశ్చితార్థం రద్దయిందని స్పష్టమైంది.
ఆ తరువాత దీని నుంచి బయటపడటం కోసం కొంత కాలం పాటు విదేశాలకు వెళ్లింది. తిరిగి వచ్చాక దుబాయ్ నుంచి చెన్నైకి మకాం మార్చింది. తను ప్రేమించిన వ్యక్తి కోసం కెరీర్‌ని కూడా పక్కన పెట్టి సినిమాలకు దూరంగా ఉన్న నివేదా పేతురాజ్ మళ్లీ సినిమాల్లో మునుపటి తరహాలోనే రాణించాలని ప్లాన్ చేసుకుంటోందట. సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్‌లకు సైతం ఓకే చెప్పేయాలనే ఆలోచనతో ఉందని, గత మూడేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చిన నివేదా మళ్లీ సినిమాల్లో బిజీ కావాలని అందరితో టచ్‌లో ఉంటోందట.
ఇందు కోసం తెలుగులోనూ ప్రయత్నాలు మొదలు పెట్టినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె రీఎంట్రీకి అవకాశం ఏ హీరో, డైరెక్టర్ ఇవ్వబోతున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. `మెంటల్ మదిలో` సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన నివేదా పేతురాజ్‌కు చిత్రలహరి, బ్రోచే వారెవరురా, అల వైకుంఠపురములో`, `దాస్ క ధమ్కీ` వంటి సినిమాలు మంచి పేరు తెచ్చి పెట్టాయి.