3 ని.ల వీడియోలో 'రామాయణం' జాతకం?
తాజా అప్ డేట్ ప్రకారం.. టైటిల్ ప్రకటన వీడియోను తిరిగి సెన్సార్ చేశారు. ఇప్పుడు పూర్తిగా 3 నిమిషాలకు పొడిగించారని సమాచారం.;
భారీ సినిమాలను తెరకెక్కించాలనే దర్శకుల తపనను మెచ్చకుండా ఉండలేం. విజువల్ గ్రాండియారిటీ లేని సినిమాలను చూసేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. ఓటీటీ డిజిటల్‌లో సినిమాలతో పోలిస్తే లార్జర్ దేన్ లైఫ్ పాత్రలతో తెరకెక్కే సినిమాలను థియేటర్లలో చూడాలనుకుంటున్నారు. విద్యాధికులు థియేటర్లలో సినిమాలు చూసేది గగనంగా మారింది.
ఇలాంటి సమయంలో పురాణేతిహాసాల నుంచి రామాయణం లాంటి అద్భుతమైన టాపిక్ ని ఎంపిక చేసుకుని నితీష్ తివారీ చేస్తున్న ప్రయత్నం సర్వత్రా ఆసక్తిని పెంచుతోంది. దంగల్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాని రూపొందించిన నితీష్ పై చాలా అంచనాలున్నాయి. భారతీయ సినిమా హిస్టరీలో నిలిచిపోయేలా అత్యంత భారీ బడ్జెట్ తో `రామాయణం` చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. రాకింగ్ స్టార్ యష్ రావణుడిగా నటిస్తున్నాడు.
తాజా అప్ డేట్ ప్రకారం.. టైటిల్ ప్రకటన వీడియోను తిరిగి సెన్సార్ చేశారు. ఇప్పుడు పూర్తిగా 3 నిమిషాలకు పొడిగించారని సమాచారం. అయితే ఈ ప్రకటన ఎప్పుడు? అనేది ఇంకా టీమ్ వెల్లడించలేదు.అధికారిక విడుదల తేదీ ని ప్రకటించాల్సి ఉంది. సన్నీ డియోల్, యష్, కాజల్ అగర్వాల్, రవి దూబే, అరుణ్ గోవిల్, లారా దత్తా తదితరులు ఇందులో ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. నమిత్ మల్హోత్రా, యష్ ఈ చిత్రానికి నిర్మాతలు. రామాయణం రెండు భాగాలను వరస సంవత్సరాల్లో రిలీజ్ చేయాలనేది ప్లాన్. 2026 దీపావళి, 2027 దీపావళి కానుకగా గ్రాండ్ గా థియేట్రికల్ విడుదల చేయాలనేది ప్లాన్.