సైన్స్ ఫిక్షన్ కథతో యువహీరో ప్రయోగం
నిజానికి విఐ ఆనంద్ ఎలాంటి కథలో నితిన్ ని చూపిస్తారు? అంటే దానికి రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. ఈసారి ఆనంద్ తన శైలికి భిన్నమైన కథాంశాన్ని రాసుకున్నాడు.;
మంచి కథ- స్క్రిప్టు, దాంతో పాటే దర్శకుడి ఎంపిక కూడా చాలా ముఖ్యం. ఈరోజుల్లో వేక్ గా ఏ నిర్ణయం తీసుకున్నా దాని ప్రభావం కెరీర్ ఆద్యంతం వెంటాడుతుంది. సరైన హిట్లు ఇవ్వలేని దర్శకులు ఎంత గొప్పవారైనా ప్రయోజనం శూన్యం. నిజానికి చాలా మంది టాలీవుడ్ దర్శకులు ఇదే బాపతు. కొందరు మహా మేధావులు అనుకున్నవారు కూడా స్క్రీన్ ప్లేని నీరసంగా చూపించి నీరసం తేవడంలో ముందున్నారు.
ఇప్పుడు విలక్షణ కథా శైలితో అందరి దృష్టిని ఆకర్షించిన విఐ ఆనంద్ దర్శకత్వంలో నితిన్ ఓ ప్రాజెక్టుకు కమిటయ్యారు. చిట్టూరి శ్రీను నిర్మాత. నితిన్ చాలా ఆచితూచి ఆలోచించి తీసుకున్న నిర్ణయమిది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని తెలిసింది.
నిజానికి విఐ ఆనంద్ ఎలాంటి కథలో నితిన్ ని చూపిస్తారు? అంటే దానికి రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. ఈసారి ఆనంద్ తన శైలికి భిన్నమైన కథాంశాన్ని రాసుకున్నాడు. అతడు హారర్ జానర్ ని టచ్ చేయడం లేదు. తన జానర్ ని మార్చేసాడు. సైన్స్ ఫిక్షన్ కథాంశంలో నితిన్ ని చూపించాలనుకుంటున్నట్టు తెలిసింది. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇటీవల విజయం కోసం ఆచితూచి అడుగులు వేస్తున్న నితిన్ తన `యల్లమ్మ` చిత్రాన్ని వదులుకున్నాడని కూడా గుసగుసలు వినిపించాయి.