తమ్ముడు : పవన్ కళ్యాణ్ వీరాభిమాని రత్న
నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన 'తమ్ముడు' సినిమా జులై 4న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.;
నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన 'తమ్ముడు' సినిమా జులై 4న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో హీరోయిన్స్‌గా సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మలు హీరోయిన్స్‌గా నటించారు. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ లయ కీలక పాత్రలో నటించింది. నితిన్‌కు అక్క పాత్రలో లయ కనిపించబోతున్నట్లు తెలస్తోంది. సినిమా కథ మొత్తం ఒక నైట్‌లో జరుగుతుందని, చాలా విభిన్ంనగా ఉంటుంది అంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించిన నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా మేకింగ్‌కు దాదాపుగా రెండేళ్ల సమయం పట్టింది. అందుకే ఈ సినిమా బడ్జెట్ భారీగా పెరిగింది.
ఇక ఈ సినిమాలోని పాత్రల విషయమై మొదటి నుంచి ఆసక్తి కనబర్చుతూ వస్తున్న ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేసే విధంగా ఆయా పాత్రలను రివీల్ చేస్తూ వస్తున్నారు. నితిన్ లుక్‌తో పాటు పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని అంతా ఆశిస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన సప్తమి గౌడ పాత్ర గురించి ప్రముఖంగా చర్చ జరుగుతుంది. కాంతార సినిమాలో నటించి మెప్పించిన ఈ అమ్మడు తెలుగులో ఈ సినిమాతో ఎంట్రీ కి సిద్ధం అయింది. అంతకు ముందే ఈమెకు పలు ఆఫర్లు వచ్చినా కూడా వాటిని కాదని తమ్ముడు సినిమాకి ఓకే చెప్పింది. మెయిన్ హీరోయిన్ అయినప్పటికీ నితిన్ తో కాంబో సీన్స్ చాలా తక్కువ ఉంటాయని చెప్పింది.
ట్రైలర్‌లో ఈమె పాత్ర గురించి ప్రముఖంగా ఉంటుందని హింట్ ఇవ్వకనే ఇచ్చారు. సినిమాలో ఈమె రత్న అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించబోతుంది. తెలుగు భాష యాసను కూడా సప్తమి గౌడ వంట బట్టించుకుందని ట్రైలర్‌ను చూస్తే అర్థం అవుతోంది. ట్రైలర్‌లో చూపించని విషయం ఏంటంటే ఈ సినిమాలో ఆమె పవన్ కళ్యాణ్ అభిమానిగా కనిపించబోతుంది. నితిన్ మొదటి నుంచి పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని అనే విషయం తెల్సిందే. తన ప్రతి సినిమాలోనూ పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించిన రిఫరెన్స్‌లు ఉండటం మనం చూస్తూనే ఉంటాం. ఈ సినిమాలో ఏకంగా హీరోయిన్‌ను పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా చూపించబోతున్నారు.
దర్శకుడు వేణు శ్రీరామ్ గత చిత్రం వకీల్ సాబ్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన సినిమా కావడం విశేషం. పవన్ సినిమా తర్వాత నితిన్‌తో వేణు శ్రీరామ్ సినిమాను రూపొందించడం, ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ అభిమానిగా సప్తమి గౌడ కనిపించడం అన్నీ కలిసి వచ్చే అంశాలు అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తమ్ముడు సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందా లేదంటే నితిన్ గత చిత్రాల మాదిరిగా నిరాశ పరుస్తుందా అనేది చూడాలి. ఈ సినిమాతో కన్నడ బ్యూటీ సప్తమి గౌడకు గ్రాండ్ ఎంట్రీ లభిస్తుందా అనేది కూడా చూడాలి.