• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  `త‌మ్ముడు` రిలీజ్ డేట్...

`త‌మ్ముడు` రిలీజ్ డేట్ మారింది!

| కొత్త క‌థ‌ల‌ని న‌మ్మి చేసిన సినిమాల‌న్నీ వ‌రుస‌గా ఫ్లాప్ అవుతుండ‌టంతో జాగ్ర‌త్త ప‌డుతున్న నితిన్ ఈ సారి ఎలాగైనా హిట్‌ని ద‌క్కించుకుని బ‌లంగా క‌మ్ బ్యాక్ కావాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడు.

By - Tupaki Desk
Update: 2025-05-14 10:31 GMT

వ‌రుస ఫ్లాప్‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న హీరో నితిన్‌. భీష్మ త‌రువాత ఆ స్థాయి స‌క్స్‌ని సొంతం చేసుకోలేక‌పోతున్నాడు. కొత్త క‌థ‌ల‌ని న‌మ్మి చేసిన సినిమాల‌న్నీ వ‌రుస‌గా ఫ్లాప్ అవుతుండ‌టంతో జాగ్ర‌త్త ప‌డుతున్న నితిన్ ఈ సారి ఎలాగైనా హిట్‌ని ద‌క్కించుకుని బ‌లంగా క‌మ్ బ్యాక్ కావాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడు. ఇందులో భాగంగా దిల్ రాజు నిర్మిస్తున్న `త‌మ్ముడు`పై భారీ ఆశ‌లే పెట్టుకున్నాడు. `వకీల్ సాబ్‌` త‌రువాత స్టార్ హీరోల వెంట ప‌రుగెత్తి ఏ హీరో కుద‌ర‌క‌పోవ‌డంతో నితిన్‌ని ప‌ట్టుకున్నాడు వేణు శ్రీ‌రామ్‌.

త‌ను రూపొందిస్తున్న లేటెస్ట్ మూవీ `త‌మ్ముడు`. ప‌వ‌న్ క‌ల్యాణ్ హిట్ టైటిల్ కావ‌డం, ప‌వ‌న్‌కు నితిన్ వీరాభిమాని కావ‌డంతో ఈ మూవీపై ప‌వ‌న్ అభిమానుల‌తో పాటు నితిన్ ఫ్యాన్స్ భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. నితిన్ కూడా ఈ సినిమాతో భారీ విజ‌యాన్ని ద‌క్కించుకోవాల‌ని చూస్తున్నాడు. `కాంతార‌` ఫేమ్ స‌ప్త‌మిగౌడ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా ఈ మూవీతో హీరోయిన్ ల‌య రీ ఎంట్రీ ఇస్తోంది. త‌ను ఈ మూవీలో ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ క్యారెక్ట‌ర్‌లో నటిస్తోంది.

దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గ‌తంలో నితిన్‌కు `శ్రీ‌నివాస క‌ల్యాణం`తో ఫ్లాప్‌ని అందించిన దిల్‌రాజు ఈ మూవీతో హిట్‌ని అందించాలనే ప‌ట్టుద‌ల‌తో ఉన్నార‌ట‌. అందుకే శ్రీ‌రామ్ వేణుతో ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఫ్యామిలీ యాక్ష‌న్ డ్రామా క‌థ‌ని రెడీ చేయించి ఈ మూవీ చేశార‌ని ఇన్ సైడ్ టాక్‌. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ కొంత కాలంగా వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. యూనిట్ కూడా సినిమా రిలీజ్ ఎప్పుడు అని రీల్స్ చేశారంటే ఈ మూవీ రిలీజ్ కోసం టీమ్ ఎంత‌గా ఎదురు చూస్తుందో అర్థం చేసుకోవ‌చ్చు.

ఫైన‌ల్లీ ఈ మూవీ రిలీజ్ డేట్ క‌న్ష‌ర్మ్ అయింది. ముందు డైరెక్ట‌ర్ శ్రీ‌రామ్‌వేణు పుట్టిన రోజు సంద‌ర్భంగా ఓ వీడియోని విడుద‌ల చేసి అందులో రిలీజ్ డేట్‌ని ప్ర‌క‌టించ‌డం తెలిప‌సిందే. జూలై 4న వ‌స్తున్నాం అంటూ ప్ర‌క‌టించారు. అయితే తాజాగా ఆ డేట్ మారిన‌ట్టుగా తెలుస్తోంది. తాజాగా ఈ మూవీని జూలై 24న రిలీజ్ చేయాల‌ని దిల్ రాజు నిర్ణ‌యించార‌ట‌. ఈ డేట్‌ని టీమ్ అఫీషియ‌ల్‌గా త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌బోతోంది.

Tags:    
  • Nithiin 
  • Thammudu 
  • DilRaju 
  • VenuSriram 
  • SapthamiGowda 
  • Laya 
  • TeluguCinema 
  • PowerfulComeback 
  • ThammuduOnJuly24 

Similar News

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

Copyright @2026

Powered by Blink CMS