తమ్ముడు సినిమా.. దిల్ రాజు ఇంట్రెస్టింగ్ లీక్స్!

ఇప్పుడీ సినిమా గురించి దిల్ రాజు ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ ఇచ్చారు.;

Update: 2025-07-03 10:16 GMT
తమ్ముడు సినిమా.. దిల్ రాజు ఇంట్రెస్టింగ్ లీక్స్!

యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ సినిమా తమ్ముడు విడుదలకు మరో కొన్ని గంటలే మిగిలివుండగా, మేకర్స్ ప్రమోషన్ల జోరుతో సినిమాపై బజ్ పెంచుతున్నారు. జూలై 4న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ సినిమాకు వకీల్ సాబ్, ఎంసీఏ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు.

ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలు నెలకొల్పాయి. నితిన్ - లయ మధ్య బ్రదర్ సెంటిమెంట్ ఆధారంగా కథ సాగుతుందని తెలుస్తోంది. హీరోయిన్‌గా సప్తమి గౌడ, మరో కీలక పాత్రలో వర్ష బొల్లమ్మ నటిస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌లోనే ఆకట్టుకుంది. ఇప్పుడీ సినిమా గురించి దిల్ రాజు ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ ఇచ్చారు.

ఇటీవల ఇంటర్వ్యూలో దిల్ రాజు మాట్లాడుతూ, "తమ్ముడు సినిమాను థియేటర్ అనుభూతికి తగ్గట్టు డిజైన్ చేశాం. మొదటి 20 నిమిషాల తర్వాత, మిగతా కథ మొత్తం ఒకే రోజు జరుగుతుంది. ఇది సినిమా స్పెషల్ హైలైట్. మేజర్ కథనాన్ని ఓ సింగిల్ డేలో ఎమోషనల్, ఇంటెన్స్ టర్నింగ్ పాయింట్స్‌తో నడిపించే విధంగా డైరెక్టర్ వేణు శ్రీరామ్ నిర్మాణం చేశాడు," అని వివరించారు. ఈ కథా శైలి ప్రేక్షకులకు థ్రిల్ కలిగిస్తుందని ఆయన అన్నారు.

అంతేగాకుండా, ఈ సినిమాలో మొత్తం 6 స్ట్రాంగ్ యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్నాయని, అవన్నీ థియేటర్లోనే చూస్తే పూర్తి అనుభూతి దక్కుతుందని దిల్ రాజు చెప్పారు. సినిమాకు సౌండ్, విజువల్ అనుభవం ప్రత్యేకంగా ఉండేలా డైరెక్టర్ శ్రద్ధ తీసుకున్నారని వెల్లడించారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే సీక్వెన్స్ ప్రేక్షకులను భావోద్వేగంతో కదిలించేలా ఉంటుందని హింట్ ఇచ్చారు.

తమ్ముడు సినిమాలో లయ రీ ఎంట్రీ చాలా ప్రత్యేకమైన అంశం. ఆమె నితిన్ అక్కగా కీలక పాత్రలో కనిపించనుండటం, సినిమా ఎమోషనల్ కోర్‌ను బలోపేతం చేస్తుందని చెబుతున్నారు. అలాగే వర్ష బొల్లమ్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వీరి పాత్రలు కథకు ప్రధాన మలుపులు ఇస్తాయని సమాచారం. కాంతారా ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం కూడా సినిమాకు పెద్ద బలంగా నిలవనుందని మేకర్స్ నమ్మకం.

ఇప్పటికే సినిమా సెన్సార్ పూర్తయి, A సర్టిఫికెట్ తో విడుదలకు సిద్ధంగా ఉంది. వింటేజ్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో సినిమా రూపొందుతుండగా, ఏమోషన్స్ తో పాటు యాక్షన్‌ మిక్స్‌తో థియేటర్‌ ప్రేక్షకులను మెప్పించేలా ఉన్నట్టు ప్రివ్యూ వర్గాల సమాచారం. ఇక సినిమా ఆడియెన్స్ ముందుకు వచ్చాక ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News