పెద్ద బ్యాన‌ర్ సపోర్ట్‌తో నితిన్ భారీ ప్లాన్

టాలీవుడ్‌లో యువ నటుల మధ్య పోటీ రోజురోజుకు పెరుగుతున్న వేళ, నార్నె నితిన్ తన కెరీర్‌లో కీలకమైన దశను ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్నారు.;

Update: 2026-04-10 13:30 GMT

టాలీవుడ్‌లో యువ నటుల మధ్య పోటీ రోజురోజుకు పెరుగుతున్న వేళ, నార్నె నితిన్ తన కెరీర్‌లో కీలకమైన దశను ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్నారు. కొంత గ్యాప్ తర్వాత ఆయన మళ్లీ యాక్ష‌న్ లోకి వ‌చ్చి, కొత్త ప్రాజెక్ట్‌ను మొద‌లుపెట్ట‌నుండ‌టం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఈ కంబ్యాక్ మూవీ ఆయనకు కేవలం మరో సినిమా కాకుండా, కెరీర్‌ను మళ్లీ నిర్వచించే అవకాశంగా కనిపిస్తోంది.

ఈ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించనున్న రాధా కృష్ణ రెడ్డి రీసెంట్ గా రిలీజైన జూనియ‌ర్ మూవీతో త‌న ప్రత్యేకమైన కథనశైలితో గుర్తింపు పొందారు. భావోద్వేగాలను సహజంగా చూపించడం, కథలో కొత్తదనం తీసుకురావడం ఆయన స్టైల్‌గా భావిస్తారు. అలాంటి డైరెక్ట‌ర్ తో నితిన్ క‌ల‌వ‌డం ఇప్పుడు అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో కంటెంట్ పరంగా కొత్తదనం ఆశిస్తున్నారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇక ఈ సినిమాకు KVN ప్రొడ‌క్ష‌న్స్ లాంటి బలమైన బ్యానర్ మద్దతు ఉండటం మరొక ముఖ్య అంశం. నిర్మాణ విలువలు, టెక్నికల్ స్టాండర్డ్స్ విషయంలో ఈ బ్యానర్‌కు మంచి పేరుంది. అందువల్ల ఈ ప్రాజెక్ట్‌పై మొదటి నుంచే మంచి అంచనాలు నెలకొన్నాయి. థియేట్రికల్ రైట్స్, ఓటిటి డీల్స్ పరంగా కూడా ఈ సినిమా మార్కెట్‌లో మంచి స్థానం సంపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నితిన్- రాధా కృష్ణ రెడ్డి కాంబినేషన్ పూర్తిగా కొత్తదిగా ఉండటం కూడా ఆసక్తిని పెంచుతోంది. ఇండస్ట్రీలో కొత్త కాంబినేషన్స్ ఎప్పుడూ ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతాయి. ముఖ్యంగా యంగ్ హీరోలు, నూతన దర్శకులు కలిసి పని చేసే ప్రాజెక్ట్స్ ప్రస్తుతం ట్రెండ్‌గా మారుతున్నాయి. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రేక్షకులు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న ఈ సమయంలో, ఈ సినిమా కూడా అదే దిశగా సాగుతుందా అన్న ఆసక్తి నెలకొంది.

ఇక ఈ సినిమా కథ, జానర్ విషయానికి వస్తే, మేకర్స్ ఇప్పటివరకు ఇంకా ఏ స్ప‌ష్ట‌తా రాలేదు. ఇదే ఈ ప్రాజెక్ట్‌కు అదనపు హైప్‌ను తీసుకువస్తోంది. యాక్షన్, లవ్ స్టోరీ లేదా థ్రిల్లర్.. ఏ జానర్‌లో సినిమా ఉండబోతుందన్నది ఇప్పటికీ సస్పెన్స్‌గా ఉంది. ఈ అనిశ్చితి కూడా ప్రేక్షకుల్లో ఊహాగానాలను పెంచుతోంది. యంగ్ హీరోల రేస్‌లో తన స్థానం బలపర్చుకోవాలంటే, ఈ సినిమా స‌క్సెస్ కూడా నితిన్ కు కీలకమని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి, సరైన టైంలో సరైన టీమ్‌తో ముందుకు వస్తున్న నితిన్, ఈ ప్రాజెక్ట్ తో తన కెరీర్‌లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. రిలీజ్‌కు ముందే మంచి బజ్‌ను సృష్టించిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద ఎలా నిలుస్తుందో చూడాలి.

Tags:    

Similar News