రాబిన్ హుడ్ ఎఫెక్ట్.. ఈసారి నితిన్ ఇలా..
వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న నితిన్.. ఇప్పుడు తమ్ముడు మూవీతో మంచి హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు. అందుకు తగ్గట్లే ప్లాన్ తో ముందుకెళ్తున్నారు!;
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్.. సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. కొంతకాలంగా సినిమాలు చేస్తూనే ఉన్నా.. సక్సెస్ ను మాత్రం అందుకోలేకపోతున్నారు. వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న నితిన్.. ఇప్పుడు తమ్ముడు మూవీతో మంచి హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు. అందుకు తగ్గట్లే ప్లాన్ తో ముందుకెళ్తున్నారు!
ముఖ్యంగా నితిన్ చివరగా నటించిన రాబిన్ హుడ్ కచ్చితంగా హిట్ అవుతుందని అంతా అంచనా వేశారు. ఎందుకంటే వెంకీ కుడుముల, నితిన్ కాంబినేషన్ లో ఇప్పటికే వచ్చిన భీష్మ సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో రాబిన్ హుడ్ పై కూడా అంతా హోప్స్ పెట్టుకున్నారు. కానీ సినిమా మాత్రం డిజాస్టర్ గా మారింది.
అయితే డైరెక్టర్ పై నమ్మకంతో నితిన్.. ఫుల్ గా మూవీని ప్రమోట్ చేశారు. కాలేజీలు, సిటీలను సందర్శించారు. పలు ఆలయాలకు వెళ్లారు. పబ్లిక్ ప్రోగ్రామ్స్ లో పాల్గొన్నారు. ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇన్ స్టాగ్రామ్ రీల్స్ లో కూడా సందడి చేశారు. అలా వచ్చిన ఏ ఛాన్స్ ను కూడా నితిన్ వదిలిపెట్టకుండా ప్రమోషన్స్ లో పాల్గొన్నారు.
కానీ సినిమా రిలీజ్ అయ్యాక.. సాలిడ్ ఓపెనింగ్స్ రాబట్టలేకపోయింది. కనీస వసూళ్లు కూడా సాధించలేదని టాక్ వినిపించింది. దీంతో నితిన్ నిరాశ చెందారని ప్రచారం జరిగింది. మనోధైర్యాన్ని గణనీయంగా ప్రభావితం చేసింది. అందుకే ఇప్పుడు తమ్ముడు మూవీకి గాను తక్కువ ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది.
రాబిన్ హుడ్ లా కాకుండా లో ప్రొఫైల్ ప్రమోషన్స్ కే పరిమితమవుతున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే తమ్ముడు మూవీ జులై 4న రిలీజ్ కానున్నట్లు రీసెంట్ గా మేకర్స్ ప్రకటించారు. ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. తాజాగా ఫస్ట్ సింగిల్ భూ అంటూ భూతం వస్తే.. ఆగకే అమ్మాడీ అంటూ సాగే మెలోడీ సాంగ్ ను రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు.
కాగా, వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న తమ్ముడు మూవీలో కాంతార ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్ గా నటిస్తున్నారు. బ్యూటీస్ వర్ష బొల్లమ్మ, స్వసిక విజయన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సీనియర్ నటి లయ.. తమ్ముడు మూవీతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. అక్కా తమ్ముడు సెంటిమెంట్ తో కూడిన కమర్షియల్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఆ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.