• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  యూత్ స్టార్ బ్యాక్ టూ...

యూత్ స్టార్ బ్యాక్ టూ బ్యాక్ ప్లానింగ్!

| యూత్ స్టార్ నితిన్ ఆల‌స్య‌మైనా బ్యాక్ టూ బ్యాక్ రిలీజ్ లతో రాబోతున్నాడా? పది రోజుల వ్య‌వ‌ధిలోనే రెండు సినిమాలు రిలీజ్ చేస్తున్నాడా? అంటే అవున‌నే తెలుస్తోంది.

By - Tupaki Desk
Update: 2025-03-01 10:30 GMT

యూత్ స్టార్ నితిన్ ఆల‌స్య‌మైనా బ్యాక్ టూ బ్యాక్ రిలీజ్ లతో రాబోతున్నాడా? పది రోజుల వ్య‌వ‌ధిలోనే రెండు సినిమాలు రిలీజ్ చేస్తున్నాడా? అంటే అవున‌నే తెలుస్తోంది. నితిన్ హీరోగా `రాబిన్ హుడ్`, `త‌మ్ముడు` చిత్రాలు తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలు సెట్స్ కి వెళ్లిచాలా కాల‌మ‌వుతోంది. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ సినిమాలు ఆన్స్ సెట్స్ లో క‌నిపిస్తున్నాయి. వెంకీ కుడుముల ద‌ర్శ క‌త్వంలో తెర‌కెక్కుతోన్న` రాబిన్ హుడ్` ఇప్ప‌టికే రిలీజ్ కావాలి.


కొన్ని సార్లు రిలీజ్ తేదీలు కూడా ప్ర‌క‌టించారు. కానీ చివ‌రి నిమిషంలో వాయిదా వేసారు. చివ‌రిగా మార్చి 28న వ‌స్తున్నారు. `హ‌రి హ‌ర‌వీర‌మల్లు` అదే తేదీన ప్ర‌క‌టించ‌డంతో `రాబిన్ హుడ్` వాయిదా వేసే అవ‌కాశముంద‌ని ఓ వైపు ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే నితిన్ మాత్రం వాయిదా వేసే ప్ర‌స‌క్తి లేద‌ని..ఆ రోజు ఎంత మంది హీరోలు రిలీజ్ కు ఉన్నా? తాను మాత్రం వెన‌క్కి త‌గ్గేదేలే అంటూ బ‌రిలోకి దిగుతున్నాడు.

ఆ న‌మ్మ‌కంతోనే త‌న అభిమాన స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా వీర‌మ‌ల్లు ఉన్నా వెన‌క్కి త‌గ్గ‌డం లేదంటున్నారు. ఇక `రాబిన్ హుడ్` రిలీజ్ అయిన ప‌ది రోజుల్లోనే మే 9న `త‌మ్ముడు` చిత్రాన్ని కూడా రిలీజ్ చేయాల‌ని స‌న్నాహాలు చేస్తున్నాడు. ఈ రిలీజ్ తేదీపై త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వెలువ‌డ నుందంటున్నారు. దీంతో నితిన్ సినిమాలు రిలీజ్ ఆల‌స్య‌మైనా బ్యాక్ టూ బ్యాక్ అభిమానుల్ని అల‌రించే లా ప్లాన్ చేసిన‌ట్లు క‌నిపిస్తుంది.

నితిన్ చివ‌రి సినిమా `ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్` 2023 లో రిలీజ్ అయింది. ఆ త‌ర్వాత మ‌రో సినిమా రిలీజ్ కాలేదు. గ‌త ఏడాది నుంచి `త‌మ్ముడు`, `రాబిన్ హుడ్` రిలీజ్ అవుతాయ‌ని ప్ర‌చారం త‌ప్ప రిలీజ్ కు నోచుకోలేదు. ఇప్పుడు అన్ని లెక్క‌లు స‌రిచేసేలా రెండు చిత్రాలు ఓకేసారి రిలీజ్ ప్లాన్ చేస్తున్నాడు. నితిన్ కి ఈసినిమాల స‌క్సెస్ కూడా అంతే కీల‌కం.` భీష్మ` త‌ర్వాత చేసిన ఐదు సినిమాలు ఆశించిన ఫ‌లితాలు అందించ‌ని సంగ‌తి తెలిసిందే.

Tags:    
  • Nithiin 
  • RobinHood 
  • Thammudu 
  • BackToBackReleases 
  • TeluguMovies 
  • NithiinMovies 
  • PawanKalyan 
  • MovieRelease 
  • TeluguCinema 
  • UpcomingMovies 

Similar News

సినీ హీరోతో సారా టెండూల్క‌ర్ పెళ్లి కుదిరిందా?

2026-11-23 12:23 GMT

య‌శ్ ని మ‌ళ్లీ లంకేశ్వ‌రుడు లేపాడు!

2026-11-23 12:23 GMT

‘పెద్ది’ స్పెషల్ సాంగ్‌పై శ్రుతిహాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-23 12:23 GMT

రెండేళ్ల నిరీక్షణకు తెర.. టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైన ‘దేవర’!

2026-11-23 12:22 GMT

మ్యూజిక్ సెన్సేష‌న్‌ని పెళ్లాడిన పాపుల‌ర్ గాయ‌ని!

2026-11-23 12:22 GMT

ENE రిపీట్ తో సత్తాచాటిన శ్రీనాథ్ మాగంటి తొలి రెమ్యునరేషన్ ఎంతంటే?

2026-11-23 11:03 GMT

చైతూ బీస్ట్ మోడ్.. 'వృషకర్మ' కోసం ఇంతలా!

2026-11-23 11:03 GMT

'దర్శకుడు' హీరో.. నిర్మాత అయ్యాడు

2026-11-23 11:03 GMT

ఎన్టీఆర్‌తో మూవీ... అనిల్ రావిపూడికి ప్రశాంతత లేదా?

2026-11-23 11:02 GMT

రామాయణం కోసం రెహ‌మాన్ త్యాగం!

2026-11-23 09:21 GMT

కిరణ్ అబ్బవరం నుంచి మరో క్రేజీ మూవీ.. 'రికార్డ్' రెడీ!

2026-11-23 09:20 GMT

కపూర్ ఇంట్లో సండే మస్తీ కజిన్స్ కోసం కిచెన్‌లోకి!

2026-11-23 09:20 GMT

Copyright @2026

Powered by Blink CMS