మన్మధుడికే నో చెప్పిన హీరోయిన్!
ఒకరు కాదు..ఇద్దరు కాదు ఏకంగా 65 మందిని ఆ పాత్ర కోసం పరిశీలించారు. అలా ఒక రోజు టబు గుర్తు కొచ్చింది. ఆమె అడ్రస్ కనుక్కుని కృష్ణవంశీ ముంబై వెళ్లారు.;
నాగార్జున-టబు జంటగా కృష్ణవంశీ తెరకెక్కించిన రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా `నిన్నే పెళ్లాడతా` అప్పట్లో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. కింగ్ క్లాసిక్ హిట్స్ లో ఇదొకటి. నాగ్-టబుల రొమాంటిక్ లవ్ ట్రాక్ అద్బుతంగా పండింది. కృష్ణవంశీ టేకింగ్, సందీప్ చౌతా సంగీతం సినిమాను విజయ పథంలో నడిపించాయి. సినిమాలో ప్రతీ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోయేదే. ఇక సినిమాలో హీరోయిన్ ఎంపిక విషయంలో పెద్ద కసరత్తులే జరిగాయి. హీరోయిన్ కోసం ముంబై, మద్రాస్ లో ఆడిషన్ నిర్వహించారు.
ఛాన్స్ అలా మిస్ అయింది:
ఒకరు కాదు..ఇద్దరు కాదు ఏకంగా 65 మందిని ఆ పాత్ర కోసం పరిశీలించారు. అలా ఒక రోజు టబు గుర్తు కొచ్చింది. ఆమె అడ్రస్ కనుక్కుని కృష్ణవంశీ ముంబై వెళ్లారు. అప్పటికే టబు బిజీగా ఉంది. దీంతో వంశీ ఆమెకు రోడ్డు మీదనే కథ చెప్పారు. సినిమా థీమ్ ఆమెకు నచ్చడంతో వెంటనే ఒకే చెప్పారు. ఆ తర్వాత మద్రాస్ లో పూర్తి కథను చెప్పి ఒప్పించారు. ఇది అందరికీ తెలిసిన వాస్తవం. కానీ ఈ సినిమాలో టబు పాత్రలో నటించాల్సిందే ఆమె కాదు అందాల మీనా అన్న సంగతి తాజాగా వెలుగులోకి వచ్చింది.
సక్సెస్ తర్వాత ఆలోచనలో:
ముందుగా ఆ పాత్ర కోసం కృష్ణవంశీ మీనాను అడిగారు. కానీ ఆమె నో చెప్పారు. ఆసినిమాకు మీనాను 60 రోజులు డేట్లు అడిగారుట. అన్ని రోజులైతే తాను కేటాయించలేనని చెప్పారు. 15 రోజుల డేట్లు అడ్జస్ట్ చేయగలనని చెప్పారు. అప్పటికే తాను పూర్తి చేయాల్సిన సినిమాలు చాలా ఉండటంతో అప్పుడలా చెప్పక తప్పలేదన్నారు మీనా. లేదంటే ఆ పాత్రలో తానే నటించాలని గుర్తు చేసుకున్నారు. ఏదీ ఏమైనా? ఓ గొప్ప అవకాశాన్ని మీలా కోల్పోయారు. ఈ విషయాన్ని ఆమె కూడా సక్సెస్ తో తర్వాత ఆలోచించినట్లు చెప్పుకొచ్చారు.
లవ్ ట్రాక్ ఓ వండర్:
కొన్ని కొన్ని సినిమాలు కొందరికే రాసి పెట్టి ఉంటాయని..అలా ఆ సినిమా టబుకు రాసి పెట్టి ఉందన్నారు. ఆ పాత్రలో టబు ఎంతో బాగా నటించదని..సహజ నటనతో ఆకట్టుకుందన్నారు. ఇందులో టబు మహా లక్ష్మి పాత్రలో అభినయించింది. శీను పాత్రలో నాగార్జున అంతే అద్భుతంగా నటించారు. శీను అంటే మహాలక్ష్మి వల్లమాలిన ప్రేమ. ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ హైలైట్. ఈ సినిమాతోనే నాగార్జున అమ్మాయిల కలల రాకుమారుడిగా మారారు. గ్రీకు వీరుడు పాట అప్పట్లో ఓ సంచలనం. టబు తన అందచందాలతో యువతను కట్టిపడేసింది. ప్రతీ ప్రేమ్ లోనూ ఈ జంట చూడ ముచ్చటగా ఉంటుంది.