• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నిహారిక స్టన్నింగ్ లుక్.....

నిహారిక స్టన్నింగ్ లుక్.. వాట్ ది ఫిష్!

| కానీ మళ్లీ వెండితెరపై నటిగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది నిహారిక. నేడు ఆమె పుట్టిన రోజు కావడంతో నిహారిక నటిస్తున్న కొత్త సినిమా ప్రకటన విడుదలైంది.

By - Tupaki Desk
Update: 2023-12-18 09:11 GMT

ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేశారు మెగా డాటర్ నిహారిక కొణిదెల. ఇప్పటి వరకు ఐదు సినిమాల్లో నటించినా ఒక్క సక్సెస్ కూడా అందుకోలేకపోయింది. దీంతో హీరోయిన్ పాత్రలను పక్కనపెట్టి నిర్మాతగా బిజీ అయ్యే ప్రయత్నాలు చేసింది. ఇటీవలే ప్రొడక్షన్ హౌస్ కూడా ఓపెన్ చేసింది. క్యాస్టింగ్తో పాటు టెక్నీషియన్స్ అందరూ కొత్తవాళ్లతోనే ఓ మూవీ తెరకెక్కించనున్నట్లు వార్తలు వచ్చాయి.


కానీ మళ్లీ వెండితెరపై నటిగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది నిహారిక. నేడు ఆమె పుట్టిన రోజు కావడంతో నిహారిక నటిస్తున్న కొత్త సినిమా ప్రకటన విడుదలైంది. వాట్ ది ఫిష్ మూవీలో ఆమె నటిస్తున్నట్టు ప్రకటించి నిహారిక ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఆ పోస్టర్లో ఓ షైనింగ్ షార్ట్ డ్రెస్లో నిహారిక అదరగొట్టింది. మూవీలో అష్టలక్ష్మి క్యారెక్టర్లో కనిపించనుంది. అయితే ఈ సినిమాతో వరుణ్ కోరుకుండ టాలీవుడ్కు దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

6ix సినిమాస్‌ బ్యానర్పై విశాల్ బెజవాడ, సూర్య బెజవాడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీని హై-క్వాలిటీ విజువల్స్, టాప్ టెక్నికల్ స్టాండర్డ్స్తో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. కొన్నినెలల క్రితం.. వాట్ ది ఫిష్ అనే సరికొత్త టైటిల్తో మూవీని ప్రకటించారు వరుణ్ కోరుకుండ. మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిస్తున్నట్లు హీరో ఫస్ట్ లుక్స్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.

రెండు నెలల క్రితం తన సినిమాలో హాస్య నటుడు వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు నిహారిక బర్త్డే సందర్భంగా ఆమె పోస్టర్ను రిలీజ్ చేశారు. అయితే ఆమె హీరోయిన్ పాత్ర లేదా ఇంకేదైనా కీలక పాత్ర చేస్తుందా అనేది క్లారిటీ రావాలి. ఒక కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా రాబోతుందని సమాచారం. మెగా డాటర్గా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది నిహారిక కొణిదెల. ముందుగా బుల్లితెరలో సత్తా చాటుకుంది.

ఈటీవీలో ఢీ జూనియర్స్లో యాంకర్గా చేసింది. అనంతరం ఆమె సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఒక మనసు సినిమాతో నాగశౌర్యతో కలిసి నటించింది. ఈ సినిమా ప్రేకక్షులను అంతగా మెప్పించలేకపోయింది. కానీ ఆ మూవీ పాటలు అందరినీ బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా కంటే ముందు యూట్యూబ్లో కొన్ని సిరీస్లు చేసింది. తండ్రి నాగబాబుతో కలిసి నాన్నకూచి సిరీస్ చేసింది. దానికంటే ముందు ముద్దపప్పు ఆవకాయ్ సిరీస్ చేసింది. హ్యాపీ వెడ్డింగ్, సూర్యాకాంతం వంటి సినిమాలు ఆమెకు బాగానే గుర్తింపు తెచ్చిపెట్టాయి.

Tags:    
  • Niharikakonidela 
  • whatthefish 
  • varunkorukonda 
  • Astalakshmi 
  • Vishalbezwada 
  • Karthick 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS