అటు వాన.. ఇటు నిహారిక గ్లామర్ జల్లులు

బ్లాక్ కలర్ శారీ.. స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకున్న అమ్మడు.. వర్షంలో తడుస్తూ కనిపించింది. అందాలు ఆరబోస్తూ చిందులేసింది.;

Update: 2025-07-26 14:46 GMT

నిహారిక కొణిదెల తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. మెగా ఫ్యామిలీ నుంచి వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ గా వచ్చిన ఆమె.. స్పెషల్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంది. కొంత కాలం క్రితం.. భర్తతో విడాకులు తీసుకున్న నిహారిక కెరీర్ విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తోంది. ఇండస్ట్రీలో మెల్లమెల్లగా బిజీగా అవుతుంది అమ్మడు.

 

నిహారిక ఇప్పటికే నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరుతో ప్రొడక్షన్ హౌస్ స్థాపించగా.. గత ఏడాది కమిటీ కుర్రోళ్ళు మూవీతో మంచి హిట్ అందుకుంది. ఐదు కోట్ల బ‌డ్జెట్‌ తో రూపొందిన ఆ మూవీ.. రూ.20 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. కామెడీ డ్రామా జోనర్ లో వచ్చిన ఆ సినిమా సాలిడ్ ప్రాఫిట్స్ అందించింది.

 

ఆ తర్వాత ఇప్పుడు పలు సినిమాలు, వెబ్ సిరీస్ లను లైన్ లో పెడుతోంది. యంగ్ హీరో సంగీత్ శోభన్ తో ఓ సినిమాను నిర్మిస్తున్న నిహారిక.. ఆ ప్రాజెక్ట్ లో నటిస్తోంది కూడా. పలు టీవీ షోల్లో నూ నిహారిక ఫుల్ గా సందడి చేస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో బ్యూటీ చాలా యాక్టివ్ అనే చెప్పాలి.

 

ఎప్పటికప్పుడు కొత్త కొత్త పోస్టులు పెట్టే నిహారిక.. క్రేజీ ఔట్ ఫిట్స్ లో ఫిక్స్ షేర్ చేస్తుంటుంది. డైలీ అప్డేట్స్ ఇస్తూ.. ఫాలోవర్స్ ను ఎంటర్టైన్ చేస్తుంటుంది. తాజాగా పోస్ట్ చేసిన వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతూ ఆకట్టుకుంటోంది.

 

బ్లాక్ కలర్ శారీ.. స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకున్న అమ్మడు.. వర్షంలో తడుస్తూ కనిపించింది. గొడుగు పట్టుకుని సందడి చేసిన నిహారిక.. గ్లామర్ షోతో ఫిదా చేసిందనే చెప్పాలి. కుర్రాళ్లను ఫుల్ గా ఆకట్టుకుంది. మ్యూజిక్, మాన్‌సూన్స్, మ్యాజిక్.. నన్ను ఈ వెర్షన్‌లో తయారు చేశాయంటూ రాసుకొచ్చింది.

అయితే వీడియోను చూసిన నెటిజన్లు.. సూపర్ మేడమ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. షాక్ అవుతున్నట్లు చెబుతున్నారు. ఇదెప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదని అంటున్నారు. అలా వీడియోను లైక్స్ చేస్తూ.. షేర్ చేస్తూ.. ట్రెండింగ్ లోకి తీసుకొచ్చేశారు. మరి మీరు కూడా ఆ వీడియో చూసేయండి.

Tags:    

Similar News