• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నింగిలోన చందమామ కిందకు...

నింగిలోన చందమామ కిందకు దిగొచ్చిందా..?

| ఇస్మార్ట్ శంకర్ తర్వాత కెరీర్ దూకుడు చూపిస్తుంది అనుకుంటే అమ్మడు సెలెక్టెడ్ సినిమాలు చేస్తూ వస్తుంది.

By - Tupaki Desk
Update: 2024-03-21 13:08 GMT

సవ్యసాచితో తెలుగు తెరకు పరిచయమైన నిధి అగర్వాల్ అంతకుముందే తన సోషల్ మీడియా క్రేజ్ తో సౌత్ లో సూపర్ పాపులారిటీ తెచ్చుకుంది. క్రికెటర్ తో డేటింగ్ వార్తలతో అమ్మడి గురించి మరింత మందికి తెలిసింది. అక్కినేని హీరోతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నిధి ఇస్మార్ట్ శంకర్ హిట్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ సినిమాలో నిధి అందాలను పూరీ పర్ఫెక్ట్ గా వాడుకున్నాడు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత కెరీర్ దూకుడు చూపిస్తుంది అనుకుంటే అమ్మడు సెలెక్టెడ్ సినిమాలు చేస్తూ వస్తుంది.


తెలుగు కన్నా తమిళ పరిశ్రమ మీద ఎక్కువ దృష్టి పెట్టిన నిధి అగర్వాల్ అక్కడ క్రేజీ ఫ్యాన్స్ ని ఏర్పరచుకుంది. నిధి కోసం అక్కడ అభిమాన సంఘాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారంటే కోలీవుడ్ లో అమ్మడి క్రేజ్ ఏంటన్నది అర్ధం చేసుకోవచ్చు. గల్లా అశోక్ లీడ్ రోల్ లో చేసిన హీరో సినిమాలో నటించిన నిధి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబోలో వస్తున్న హరి హర వీరమల్లు సినిమాలో కూడా నటిస్తుంది.


తెలుగులో అవకాశాలు రావట్లేదా లేదా తనే వద్దనుకుందా అన్నది తెలియదు కానీ నిధి ఇన్ స్టా ప్రమోషన్స్ తోనే రెండు చేతులా సంపాదిస్తుందని తెలుస్తుంది. అందుకే సినిమాల కన్నా ఇదే మంచి సోర్స్ అని సోషల్ మీడియా ప్రమోషన్స్ చేస్తూ వస్తుంది. ఇక ప్రొడక్ట్ ప్రమోషన్స్ తో పాటుగా నిధి చేసే గ్లామర్ ఫోటో షూట్ ఫాలోవర్స్ కి మాంచి కిక్ ఇస్తుంది.


ప్రతి హీరోయిన్ ఇన్ స్టాగ్రాం లో ఫోటో షూట్స్ చేస్తుంటారు. కానీ కొందరికి మాత్రమే రెగ్యులర్ ఫాలోవర్స్ ఉంటారు. అలాంటి భామల్లో నిధి అగర్వాల్ ఒకరు. లేటెస్ట్ గా అమ్మడు మూన్ లైట్ కలర్ శారీలో అందాలను వెదచల్లుతుంది. కట్టింది శారీనే అయినా ఆమె చేస్తున్న గ్లామర్ ట్రీట్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇక నిధి చేసిన ఈ ఫోటో షూట్స్ కి నింగిలోన చందమామ భూమీదకు వచ్చిందేంటి అంటూ క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు.

తెలుగు తమిళ భాషల్లో క్రేజీ ఫాలోవర్స్ ఉన్న నిధి ఇలా ఫోటో షూట్స్ తోనే కాదు సినిమాలతో కూడా అలరిస్తే ఇంకాస్త బాగుంటుందని అనుకుంటున్న వారు ఉన్నారు. నిధి కొద్దిగా కాన్సెంట్రేట్ చేస్తే చాలు కానీ అమ్మడు టాప్ ప్లేస్ కి వెళ్లే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.

Tags:    
  • Nidhhiagerwal 
  • Actress 
  • Gorgeouslooks 
  • Stunningclicks 
  • Photoshoot 
  • Phototalk 

Similar News

దీపావ‌ళి లుక్‌తో క‌ట్టి ప‌డేసిన న‌టి కం గాయ‌ని

2026-11-09 22:30 GMT

సీనియ‌ర్ న‌టుడు పోగొట్టుకున్న‌ది స‌రే వార‌స‌త్వ‌ ఆస్తుల విలువ‌?

2026-11-09 19:30 GMT

'DNK' ట్రైలర్ టాక్: బెట్టింగులు.. దొంగతనాలతో మౌళి కామెడీ గోల

2026-11-09 19:16 GMT

'పొలిమేర 3' గ్లింప్స్: ​కొమరయ్య తాంత్రికం.. అర్జున్ సర్జా పవర్ఫుల్ ఎంట్రీ

2026-11-09 19:10 GMT

ఏంటిది? బేబి బంప్‌తో స‌మంత ప్ర‌యోగాలు!

2026-11-09 19:04 GMT

సెల‌బ్రేష‌న్‌లో మ‌హేష్-చ‌ర‌ణ్‌ తో ఆ ప్ర‌ముఖుడు ఎవ‌రు?

2026-11-09 19:03 GMT

పిక్‌టాక్‌ : మెగా ఫ్యాన్స్‌కి బెస్ట్‌ దీపావళి గిఫ్ట్‌

2026-11-09 19:02 GMT

పిక్‌టాక్‌ : స్టైలిష్ అందాల పలక్‌

2026-11-09 19:01 GMT

అలీ భార్య జుబేదా బేగం సోషల్ మీడియా సంపాదన ఎంతో తెలుసా?

2026-11-09 13:30 GMT

డమ్మీ థియేటర్లు.. బల్క్ బుకింగ్స్

2026-11-09 12:56 GMT

కారాల కళ్ళ పిల్లకు ఆది సైట్.. 'ఈగో రాజా' రౌడీ రాకసి

2026-11-09 12:51 GMT

21 ఏళ్ల‌కే వంద సినిమాల‌తో సంచ‌ల‌నం!

2026-11-09 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS