సమ్మర్ లో ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేయదగ్గ బెస్ట్ ఓటీటీ మూవీస్ ఇవే!

బయట ఎండలు మండిపోతున్నాయి మరి ఈ వేసవి సెలవుల్లో ఎండల తీవ్రతకు బయటకు వెళ్లలేక, ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి టైమ్ స్పెండ్ చేయాలనుకునే వారికి ఓటీటీలు అదిరిపోయే వినోదాన్ని అందిస్తున్నాయి

Update: 2026-05-18 07:36 GMT

బయట ఎండలు మండిపోతున్నాయి మరి ఈ వేసవి సెలవుల్లో ఎండల తీవ్రతకు బయటకు వెళ్లలేక, ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి టైమ్ స్పెండ్ చేయాలనుకునే వారికి ఓటీటీలు అదిరిపోయే వినోదాన్ని అందిస్తున్నాయి. ఈరోజు మే 18న ఆహా, నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో వంటి దిగ్గజ ప్లాట్‌ఫామ్స్ సరికొత్త చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. యాక్షన్, సస్పెన్స్, పల్లెటూరి కథలతో అలరించేందుకు సిద్ధమైన ఈ వారం లేటెస్ట్ డిజిటల్ ప్రీమియర్ల వివరాలు, మీకోసం ప్రత్యేకంగా అందించిన ఓటీటీ మూవీస్ ను చూసేయండి..

అర్ధరాత్రి సర్ప్రైజ్ రిలీజ్‌లు:

సాధారణంగా ఓటీటీలలో అర్ధరాత్రి రిలీజ్ అయ్యే సినిమాలు వీకెండ్, వీక్‌డేస్ అనే తేడా లేకుండా స్ట్రీమింగ్ జోరును పెంచుతాయి. ఈరోజు ప్రైమ్ వీడియో ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఒక క్రేజీ యాక్షన్ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసింది.ఇక కొత్త కంటెంట్ రాగానే చూసేందుకు ఇష్టపడే సినీ ప్రియులు ఈ ఎర్లీ రిలీజ్‌లపై తెగ ఆసక్తి చూపిస్తున్నారు.ఇక ప్రస్తుతం సోషల్ మీడియా లో ఈ సరికొత్త సినిమాల గురించే అందరూ మాట్లాడుకుంటారు.

ప్రాంతీయ కథల 'ఆహా':

మన తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా' ఎప్పటికప్పుడు అద్భుతమైన రీజినల్ కంటెంట్‌తో దూసుకుపోతోంది. ఇందులో భాగంగానే ఈరోజు ఒక చక్కటి రూరల్ డ్రామా విలేజ్ స్టోరీను లాంచ్ చేయగా, దానికి ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇక మన మట్టి వాసన, ప్రాంతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తూ,ఎమోషన్స్ తో కూడిన పాత్రలతో సాగే ఈ సినిమా ఒరిజినల్ తెలుగు కథలను కోరుకునే వారికి ఆహా బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు.

ఇక ఈటీవీ విన్ కూడా ఈ వారం వైవిధ్యమైన కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హారర్, సస్పెన్స్ జోనర్లలో వచ్చిన 'కాలింగ్ బెల్' మరియు 'సతాన్ ది డార్క్' వంటి క్రేజీ డబ్బింగ్ మరియు చిన్న సినిమాలు ప్రస్తుతం ఈటీవీ విన్‌లో సందడి చేస్తున్నాయి.

గ్లోబల్ కంటెంట్.. మన తెలుగులో:

నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్, ప్రైమ్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఇప్పుడు భారీ తెలుగు డబ్బింగ్ ప్రాజెక్టులపై గట్టిగా ఫోకస్ పెడుతున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న గ్లోబల్ షోలను, హాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాలను క్వాలిటీ తగ్గకుండా తెలుగు ఆడియోతో అందిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

టాప్ మూవీస్ :

టామ్ క్లాన్సీస్ పాపులర్ యాక్షన్ పొలిటికల్ సిరీస్ 'జాక్ రాయన్: ఘోస్ట్ వార్' ఇప్పుడు ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. ఇక దీనివల్ల భాషతో సంబంధం లేకుండా వేరే దేశాల సినిమాలను కూడా మనవాళ్లు సొంత భాషలోనే ఫుల్ గా ఎంజాయ్ చేయగలుగుతున్నారు. ఇక బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ మూవీ 'ధురంధర్' ఇక ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

తెలుగు సినిమాల డిజిటల్ మార్కెట్ ఇప్పుడు శరవేగంగా విస్తరిస్తోంది. ఎలాంటి ముందస్తు అనౌన్స్‌మెంట్ లేకుండా వచ్చే సర్ప్రైజ్ డ్రాప్స్ ఆన్‌లైన్ ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ నింపుతున్నాయి. మీకు యాక్షన్ నచ్చినా, సస్పెన్స్ లేదా పల్లెటూరి ఎమోషన్స్ నచ్చినా.. ఈ సమ్మర్‌లో మీ అభిరుచికి తగ్గట్టుగా బోలెడన్ని ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మరి లేట్ చేయకుండా మీ ఫేవరెట్ మూవీని సెలెక్ట్ చేసుకొని ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయండి..

Tags:    

Similar News