నెట్‌ఫ్లిక్స్‌లో కొత్తవాటి కంటే పాతవే ఎక్కువ..!
ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ ఒకవైపు పెద్ద ఎత్తున సినిమాలను స్ట్రీమింగ్ చేస్తూనే మరో వైపు తన ఒరిజినల్ కంటెంట్‌తోనూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది.
ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ ఒకవైపు పెద్ద ఎత్తున సినిమాలను స్ట్రీమింగ్ చేస్తూనే మరో వైపు తన ఒరిజినల్ కంటెంట్‌తోనూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. ఒకప్పుడు ఇంగ్లీష్ సిరీస్ కి మాత్రమే పరిమితం అయిన నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు ఇండియన్ వెబ్ సిరీస్‌లను ఎక్కువగా స్ట్రీమింగ్ చేస్తుంది. హిందీ భాషలో రూపొందిన వెబ్ సిరీస్‌ను ఇండియన్ భాషలు అన్నింటిలోనూ డబ్ చేసి స్ట్రీమింగ్ చేయడం ద్వారా ఎక్కువ రీచ్ ఉంటుందని అంటున్నారు. ప్రైమ్ వీడియోతో పోల్చితే హిందీ వెబ్ సిరీస్‌ల సక్సెస్ రేటు కాస్త తక్కువ ఉందని చెప్పక తప్పదు. అయినా కూడా నెట్‌ఫ్లిక్స్ నుంచి బ్యాక్ టుబ్యాక్ భారీ బడ్జెట్ వెబ్ సిరీస్‌లు వస్తూనే ఉన్నాయి. అయితే నెట్‌ఫ్లిక్స్ లో కొత్తగా వెబ్ సిరీస్‌లు రావడం కంటే గతంలో వచ్చిన వెబ్ సిరీస్‌లకు కొత్త సీజన్‌లను తీసుకు రావడం ఎక్కువగా కనిపిస్తుంది.
నెట్‌ఫ్లిక్స్‌లో వరుసగా వెబ్ సిరీస్...
ఒక వెబ్ సిరీస్ హిట్ అయినా ఫ్లాప్ అయినా, ప్రేక్షకులు పట్టించుకున్నా, పట్టించుకోకున్నా కూడా నెట్‌ఫ్లిక్స్ లో కొన్ని వెబ్ సిరీస్ లు వరుస సీజన్‌లు వస్తున్నాయి. ఇప్పటి వరకు నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ వెబ్ సిరీస్‌ల్లో అత్యధికంగా మిస్ మ్యాచ్ వెబ్ సిరీస్ నాలుగు సీజన్‌లు వచ్చింది. నాల్గవ సీజన్ చివరిది అంటున్నారు కానీ, ముందు ముందు మరో రెండు సీజన్‌లను ఏదో ఒక కథతో తీసుకు వచ్చినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు, ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మిస్ మ్యాచ్ సిరీస్ కు ఉన్న టాక్ కారణంగా నెట్‌ఫ్లిక్స్ దాన్నే మళ్లీ మళ్లీ తీసుకు వచ్చే ప్రయత్నంలో భాగంగా వరుస సీజన్‌లు వస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్ అనగానే హిందీ ప్రేక్షకులకు లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ గుర్తుకు వస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటి వరకు మూడు సీజన్‌లగా లస్ట్ స్టోరీస్ వచ్చింది. మూడు సీజన్‌లు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
లస్ట్ స్టోరీస్ 3 కి మంచి రెస్పాన్స్...
లస్ట్ స్టోరీస్ మాత్రమే కాకుండా మరికొన్ని వెబ్ సిరీస్‌లు కూడా ఇప్పటికే మూడు సీజన్‌లుగా స్ట్రీమింగ్ అవుతున్నాయి. అందులో ప్రధానంగా ఢిల్లీ క్రైమ్ వెబ్ సిరీస్ కూడా ఉంది. ఈ సిరీస్ లో సీజన్ కు సీజన్ కు కథ వేరుగా ఉంటుంది. కానీ క్రైమ్ స్టోరీని తీసుకుని ఆ టైటిల్‌తో రూపొందించడం జరుగుతుంది. ప్రేక్షకులకు ఇప్పటికే నోటెడ్ అయిన టైటిల్‌తో వస్తే ఎక్కువ రీచ్ ఉంటుందనే ఉద్దేశంతో గతంలో వచ్చిన సిరీస్ లకు సీజన్‌లుగా కొత్త కథలను తీసుకు వస్తున్నారు. తాజాగా మరో రెండు కొత్త వెబ్ సిరీస్ లను నెట్ ఫ్లిక్స్ నుంచి ప్రకటించడం జరిగింది. ఆ రెండు వెబ్ సిరీస్‌లు సైతం గతంలో వచ్చిన రెండు వెబ్ సిరీస్‌లకు కొత్త సీజన్‌లే. ఫిల్మ్ మేకర్ సిద్దార్థ్ పి మల్హోత్ర ఇటీవల ఒక చిట్ చాట్‌లో గతంలో వచ్చిన షాక్, ఇక్కా వెబ్ సిరీస్ లకు సంబంధించిన రెండో సీజన్ షూటింగ్ నడుస్తున్నట్లు పేర్కొన్నాడు.
షాక్, ఇక్కా వెబ్ సిరీస్‌లు..
ఈ రెండు వెబ్ సిరీస్ లు గొప్ప విజయాన్ని సొంతం చేసుకోలేదు. అద్భుతమైన స్పందన దక్కించుకున్నాయా అంటే అది లేదు. అయినా కూడా మేకర్ సిద్దార్థ్ పి మల్హోత్ర చాలా నమ్మకంతో ఈ వెబ్ సిరీస్ లకు సీజన్ 2 ను ప్రకటించాడు. షాక్ సీజన్ 2 పూర్తిగా కొత్త కథతో రూపొందిస్తున్నట్లుగా పేర్కొన్నాడు. కొత్త కథ కదా మరి కొత్త టైటిల్ తో ఎందుకు తీయడం లేదు అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్లుగా అప్పటికే ఉన్న వెబ్ సిరీస్ కు కొత్త సీజన్‌గా వచ్చినట్లయితే మంచి పబ్లిసిటీ దక్కడంతో పాటు, ప్రమోషన్ ఈజీగా అవుతుంది. అందుకే కొత్త కథలు అయినా పాత వెబ్ సిరీస్‌లకు కొత్త సీజన్‌లుగా వస్తున్నాయి. అందుకే కొత్త వెబ్ సిరీస్‌ల కంటే పాత వెబ్ సిరీస్‌లకు కొత్త సీజన్‌లు నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్కువ వస్తున్నాయని ప్రేక్షకులు అంటున్నారు. హిట్ అయిన పాత వెబ్ సిరీస్‌లకు కొత్త సీజన్‌లు వస్తే పర్వాలేదు కానీ, ఆకట్టుకోని వెబ్ సిరీస్‌లకు కొత్త సీజన్‌లు అవసరమా అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు. మరి నెట్‌ఫ్లిక్స్ ఇండియా ప్రతినిధులు ఈ విమర్శలకు ఎలా స్పందిస్తారు అనేది చూడాలి.