అఖండ 2.. OTT లెక్కలు మారనున్నాయా?

బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అఖండకు సీక్వెల్ గా రూపొందిన అఖండ 2: తాండవం మూవీ వాయిదా పడడం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.;

Update: 2025-12-06 11:45 GMT

బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అఖండకు సీక్వెల్ గా రూపొందిన అఖండ 2: తాండవం మూవీ వాయిదా పడడం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడ చూసినా ఆ విషయం కోసమే మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా మళ్లీ ఎప్పుడు రిలీజ్ అవుతుందోనని వెయిట్ చేస్తున్నారు. కొత్త విడుదల తేదీ కోసం అంతా ఎదురుచూస్తున్నారు.

అదే సమయంలో అఖండ-2 ఓటీటీ డీల్ కోసం కూడా డిస్కస్ చేసుకుంటున్నారు. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం ఒప్పందం ఖరారు అయింది. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ నెట్‌ ఫ్లిక్స్‌ ఓటీటీ చేతికి వెళ్లగా.. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకు దక్షిణాది భాషల్లో, 8 వారాలకు హిందీలో స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం జరిగిందని టాక్.

ముందుగా డిసెంబర్ 5వ తేదీన సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉండగా.. అందుకు తగ్గట్లే నెట్ ఫ్లిక్స్ డీల్ కుదుర్చుకుని ఉంటుంది. అంటే సంక్రాంతి టైమ్ లో ఓటీటీలోకి సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురావాలని అనుకుని ఉంటుంది. ఆ టైమ్ లో సినిమాకు మంచి వ్యూస్ వస్తాయి. ఎందుకంటే ఫ్యామిలీ అంతా కలిసి పొంగల్ కు మూవీలు చూస్తారు.

కానీ విడుదల వాయిదా పడడం వల్ల.. దాని ప్రభావం నెట్ ఫ్లిక్స్ షెడ్యూల్ పై పడుతుంది. ఇప్పుడు సినిమా విడుదల తేదీ మారనుంది కనుక ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ కూడా మారుతుంది. కానీ నెట్ ఫ్లిక్స్ మాత్రం తమ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ డేట్ విషయంలో కాస్త స్ట్రిక్ట్ గా ఉంటుంది. చెప్పామంటే.. చేయాలంతే అన్నట్లు ఎప్పుడూ ముందుకెళ్తుంటుంది.

దీంతో అఖండ-2 విషయంలో ఏం చేస్తుంది అనేది చర్చనీయాంశంగా మారింది. ముందు ఒప్పందం చేసుకున్న ప్రకారమే సంక్రాంతికే సినిమాను స్ట్రీమింగ్ చేస్తుందేమోనని కొందరు నెటిజన్లు అనుమానపడుతున్నారు. కానీ అలా జరిగితే థియేట్రికల్ రన్ కు పెద్ద ప్రమాదంగా మారుతుంది. ఎందుకంటే డిసెంబర్ 25న మూవీ రిలీజ్ అవ్వనుందని టాక్ వస్తోంది.

అలా ఒకవేళ జరగకూడదంటే.. స్ట్రీమింగ్ డేట్ మారాలంటే.. నెట్ ఫ్లిక్స్ మరో ప్లాన్ తో ముందుకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అదేంటంటే.. అగ్రిమెంట్ చేసుకున్న డబ్బుల్లో కోత విధిస్తుందని అంటున్నారు. అప్పుడు కూడా నిర్మాతలకు లాసే. మొత్తానికి సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అవ్వడం ఓటీటీ విషయంలో నష్టం తప్పదని స్పష్టంగా అర్థమవుతుంది. ఏదేమైనా చివరకు ఏం జరుగుతుందో అంతా వేచి చూడాలి.

Tags:    

Similar News