ఓటీటీలోనే కాదు అవార్డ్‌లోనూ అదే జోరు
గత ఏడాది ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'అడోలెసెన్స్' సూపర్ హిట్‌గా నిలిచింది. నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధిక వ్యూస్‌ను సొంతం చేసుకున్న సిరీస్‌గా నిలిచింది.;
గత ఏడాది ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'అడోలెసెన్స్' సూపర్ హిట్‌గా నిలిచింది. నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధిక వ్యూస్‌ను సొంతం చేసుకున్న సిరీస్‌గా నిలిచింది. ఈ బ్రిటిష్ సైకలాజికల్ క్రైమ్ డ్రామాను నెట్‌ఫ్లిక్స్‌లో 2025, మార్చి 13న స్ట్రీమింగ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సిరీస్ ట్రెండ్ అవుతూనే ఉంది. ఏడాది అంతా కూడా నెట్‌ఫ్లిక్స్‌లో ఇంగ్లీష్ కంటెంట్ జాబితాలో టాప్‌లో కొనసాగింది. అతి తక్కువ సమయంలోనే ఈ వెబ్ సిరీస్ కి ప్రపంచ వ్యాప్తంగా ఆధరణ దక్కింది. పలు భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ పలు అవార్డ్‌లను, రివార్డ్‌లను, రికార్డ్‌లను సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న విషయం తెల్సిందే. తాజాగా మరో అరుదైన రికార్డ్‌ను ఈ వెబ్ సిరీస్ సొంతం చేసుకున్న నేపథ్యంలో వార్తల్లో నిలిచింది. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ ఎమ్మీ పురస్కారాల్లో సత్తా చాటింది. తాజాగా ప్రకటించిన క్రిటిక్స్ ఛాయిస్ లోనూ సత్తా చాటింది.
అడోలెసెన్స్ వెబ్ సిరీస్...
ప్రపంచ వ్యాప్తంగా సినీ ఇండస్ట్రీకి చెందిన మేకర్స్ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్ విషయంలో చాలా ఆసక్తిగా ఉంటారు. ప్రతి విభాగంలోనూ క్రిటిక్స్ ఛాయిస్ ఇచ్చే అవార్డ్‌ను అత్యంత గౌరవంగా గుర్తిస్తారు. అందుకే ఈ వెబ్ సిరీస్ కి సైతం క్రిటిక్స్ ఛాయిస్ నుంచి అవార్డ్‌లు రావడంతో వార్తల్లో నిలిచింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు కేటగిరీల్లో ఈ అవార్డ్‌ను అడోలెసెన్స్ సిరీస్ దక్కించుకుంది. ఆరు నామినేషన్స్‌కి గాను నాలుగు అవార్డ్‌లను సొంతం చేసుకోవడం ద్వారా సత్తా చాటింది. సాధారణంగా క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్‌లు అత్యంత ప్రతిభావంతమైన సాంకేతిక నిపుణులు, అద్భుతమైన కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే దక్కించుకుంటాయి. ఈ సిరీస్ కి నాలుగు అవార్డ్‌లు దక్కడంతో ఏ స్థాయిలో ఈ కంటెంట్ ప్రేక్షకులను అలరించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మధ్య కాలంలో ఈ స్థాయి ఘనత దక్కించుకున్న సిరీస్ ఇదే అంటూ సోషల్ మీడియాలో టాక్.
నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్...
అడోలెసెన్స్ వెబ్ సిరీస్ గత ఏడాది ప్రకటించిన 77వ ఎమ్మీ అవార్డ్‌ల్లోనూ సత్తా చాటింది. 5 కేటగిరీల్లో అవార్డ్‌ను సొంతం చేసుకోవడం ద్వారా ఆ సమయంలో రికార్డ్‌ను నమోదు చేసింది. ఇప్పుడు ఏకంగా క్రిటిక్స్ ఛాయిస్ లో నాలుగు విభాగాల్లో అవార్డ్‌ను సొంతం చేసుకున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ వెబ్ సిరీస్ గురించిన చర్చ జరుగుతోంది. ఉత్తమ నటుడిగా స్టీఫెన్ గ్రాహం, ఉత్తమ సహాయ నటిగా ఎరిన్ డో హెర్టీ లు అవార్డ్ ను సొంతం చేసుకున్నారు. అతి చిన్న వయసులోనే అవార్డ్‌ను సొంతం చేసుకున్న ఓవెన్ కూపర్ రేర్ రికార్డ్‌ను నమోదు చేశాడు. పిల్లలతో పాటు అన్ని వర్గాల వారిని అలరించే విధంగా రూపొందిన ఈ వెబ్ సిరీస్ ను నెట్‌ఫ్లిక్స్ పలు భాషల్లో స్ట్రీమింగ్ చేస్తున్న కారణంగా అత్యధిక ప్రేక్షకులకు చేరువ అవుతోంది. ఇలాంటి మంచి కంటెంట్ కు అవార్డ్‌లు రావడం చాలా సంతోషంగా ఉంది అంటూ పలువురు సోషల్ మీడియా జనాలు మాట్లాడుతున్నారు.
క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్
13 ఏళ్ల పాఠశాల విద్యార్థి జామీ మిల్లర్ చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉంది. అతను పాఠశాలలో ఒక బాలిక హత్య కారణంగా అరెస్ట్ చేయబడుతాడు. దాంతో అతడి చుట్టూ కథ తిరుగుతూ ఎంక్వౌరీకి సంబంధించిన సీన్స్ నడుస్తూ ఉంటాయి. అడోలెసెన్స్ వెబ్ సిరీస్ దర్శకత్వం చాలా బాగుంటుందని, అలాగే స్క్రీన్ ప్లే అద్భుతంగా సాగింది అంటూ రివ్యూలు వచ్చాయి. చాలా కాలంగా ఇలాంటి ఒక మంచి స్క్రిప్ట్ దక్కలేదు అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఏడాది మొత్తం కూడా ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ లో టాప్ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ముందు ముందు మరిన్ని అవార్డ్‌లను ఈ సిరీస్ దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.