ఆ నెపో కిడ్స్‌కు అయినా డెబ్యూ కలిసొస్తుందా?
సైయారాతో సక్సెస్ అందుకున్న అహాన్ పాండే బాలీవుడ్ లో ఇప్పటికే పలువురు స్టార్ల కిడ్స్ ఇండస్ట్రీలోకి రాగా, ఈ ఏడాదిలో మరికొందరు నెపో కిడ్స్ అరంగేట్రం చేశారు.;
ఏ ఇండస్ట్రీలో అయినా సరే నెపోటిజం ఉంటుందని ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్లు తరచూ కామెంట్స్ చేస్తూ ఉంటారు. అయితే ఈ నెపోటిజం బాలీవుడ్ లో కాస్త ఎక్కువగా ఉంటుంది. ఈ విషయంలో ఎప్పటికప్పుడు విమర్శలు వస్తున్నప్పటికీ నెపో కిడ్స్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు.
సైయారాతో సక్సెస్ అందుకున్న అహాన్ పాండే బాలీవుడ్ లో ఇప్పటికే పలువురు స్టార్ల కిడ్స్ ఇండస్ట్రీలోకి రాగా, ఈ ఏడాదిలో మరికొందరు నెపో కిడ్స్ అరంగేట్రం చేశారు. కేవలం సిల్వర్ స్క్రీన్ పైనే కాకుండా ఓటీటీలోకి కూడా ఎంటరై తమ లక్ ను టెస్ట్ చేసుకున్నారు. అయితే ఈ ఇయర్ అరడజనుకు పైగా నెపో కిడ్స్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంటరవగా, వారిలో అహాన్ పాండే మినహా మరెవరికీ సక్సెస్ దక్కలేదు.
సైయారా సినిమాతో అహాన్ పాండే సూపర్ హిట్ ను అందుకోగా, బాలీవుడ్ సీనియర్ నటుడు అజయ్ దేవగణ్ మేనల్లు అమన్ దేవగన్, రషా తదానీ ఆజాద్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చి ఆ సినిమాతో ఫ్లాపు ను అందుకున్నారు. ఇక ఇప్పటికే డిజిటల్ స్క్రీన్ పై లాంచ్ అయిన ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్, జాన్వీ కపూర్ చెల్లి ఖుషీ కపూర్ లవ్ టుడే సినిమాకు రీమేక్ గా లవ్ యాపాను చేయగా ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.
వీరు కాకుండా షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ డైరెక్టర్ గా, సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ ఓటీటీ ఎంట్రీతో సరిపెట్టారు. ఆల్రెడీ వచ్చిన నెపో కిడ్స్ సిట్యుయేషన్స్ ఇలా ఉంటే మరికొందరు నెపో కిడ్స్ తమ లక్ ను టెస్ట్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. వారిలో అమితాబ్ మనవడు అగస్త్యా నంద, అక్షయ్ కుమార్ మేన కోడలు సిమర్ భాటియా ఉన్నారు. మరి వీరి డెబ్యూ ఎలా జరుగుతుందో చూడాలి.