బికినీ లుక్‌తో నేహా శెట్టి అందాల మాయ

మాల్దీవుల్లో నేహా ఎంచుకున్న స్టైల్ కూడా విశేషం. మొదట బ్లూ ఫ్లోయింగ్ డ్రెస్‌లో కనిపించిన ఆమె, తరువాత బికినీ లుక్‌లో స్విమ్మింగ్ పూల్, సముద్ర జలాల్లో పోజులిచ్చింది.;

Update: 2025-08-20 16:47 GMT

2022లో వచ్చిన డీజే టిల్లూ సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన నేహా శెట్టి, అప్పటి నుండి పెద్ద హిట్స్ అందుకోకపోయినా, తన గ్లామర్‌తో ఎప్పటికప్పుడు ట్రెండ్‌లో నిలుస్తోంది. తాజాగా మాల్దీవుల్లో సెలవులు ఎంజాయ్ చేస్తున్న నేహా, అక్కడి సముద్రతీరంలో తీసుకున్న ఫోటోలు షేర్ చేసుకుంది. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో మంచి క్రేజ్‌ను సంపాదించాయి. నీలి సముద్ర జలాల్లో ఈదుతూ, పచ్చటి బికినీ లుక్‌లో కనిపించిన నేహా, తన హాలిడే ఫ్యాషన్‌తో అందరినీ ఆకట్టుకుంది.

 

2016లో ముంగారు మాలే 2 ద్వారా కన్నడలో సినీప్రవేశం చేసిన నేహా శెట్టి, తరువాత తెలుగు సినిమాల్లో కూడా అడుగుపెట్టింది. మెహబూబా, గల్లీ రౌడీ వంటి సినిమాల్లో నటించినా, ఆమెకు అసలు బ్రేక్‌ డీజే టిల్లూ ద్వారానే వచ్చింది. ఆ సినిమాలో యూత్‌ని బాగా ఆకట్టుకున్న నేహా, ఒక్కసారిగా స్టార్‌ క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత మరో హిట్ దక్కకపోయినా, గ్లామర్ రోల్స్‌లో, ఫ్యాషన్ ఫోటోషూట్లలో మాత్రం ఆమె ఎప్పుడూ హైలైట్ అవుతూనే ఉంది.

 

మాల్దీవుల్లో నేహా ఎంచుకున్న స్టైల్ కూడా విశేషం. మొదట బ్లూ ఫ్లోయింగ్ డ్రెస్‌లో కనిపించిన ఆమె, తరువాత బికినీ లుక్‌లో స్విమ్మింగ్ పూల్, సముద్ర జలాల్లో పోజులిచ్చింది. వేకేషన్ లుక్‌కి సరిపోయేలా గాగుల్స్, లైట్ జ్యువెలరీ, ఫ్రీ హెయిర్‌స్టైల్‌ను ఎంచుకోవడం ఆమె స్టైల్ సెన్స్‌ని చూపిస్తోంది. ఈ లుక్స్‌లో నేహా సింపుల్‌గా, అలాగే గ్లామరస్‌గా ఉండటంతో అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.

 

సినిమాల పరంగా ప్రస్తుతం కొన్ని ప్రాజెక్టులు చర్చల్లో ఉన్నప్పటికీ, అధికారికంగా కొత్త సినిమాల గురించి ఇంకా ప్రకటన రాలేదు. అయితే, సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటూ, తన వ్యక్తిగత క్షణాలను పంచుకుంటూ నేహా, ఫ్యాన్ ఫాలోయింగ్‌ను బలంగా కొనసాగిస్తోంది. ముఖ్యంగా యూత్‌లో ఆమెకు ఉన్న ఫాలోయింగ్ సో స్పెషల్. గ్లామర్‌తో పాటు ఎంచుకున్న ప్రాజెక్టులపై మంచి జాగ్రత్త తీసుకుంటే, మరిన్ని మంచి అవకాశాలు రావచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Tags:    

Similar News