నాని, నితిన్ ప్రోత్సాహంతో దర్శకురాలిగా!
నీరజ కోన తెర వెనుక పెర్పార్మర్. ఇండస్ట్రీలో స్టైలిస్ట్ గా ప్రయాణం మొదలుపెట్టారు. వందల సినిమాలకు స్టైలిస్ట్ గా పని చేసారు. అటుపై రైటర్ గానూ కొన్ని సినిమాలకు పాటలు రాశారు.;
నీరజ కోన తెర వెనుక పెర్పార్మర్. ఇండస్ట్రీలో స్టైలిస్ట్ గా ప్రయాణం మొదలుపెట్టారు. వందల సినిమాలకు స్టైలిస్ట్ గా పని చేసారు. అటుపై రైటర్ గానూ కొన్ని సినిమాలకు పాటలు రాశారు. ఇలా రెండు శాఖల్లో పట్టు సాధించిన నీరజ ఇప్పుడు ` తెలుసు కదా` సినిమాతో దర్శకురాలిగానూ కొత్త ప్రయాణం మొదలు పెట్టారు. మరి ఈ ప్రయాణానికి స్పూర్తి ఎవరు? అంటే చాలా సంగతులే ఉన్నాయి. పాఠశాల రోజుల్లో నుంచే మ్యాగజైన్లు చదవడం అలవాటు చేసుకున్నారు.
కథలు, వ్యాసాలు రాయడం మొదలు పెట్టారు. అయితే ఇండస్ట్రీకి వచ్చే వరకూ గానూ సినిమాలకు దర్శకత్వం చేయాలనే ఆలోచన లేదన్నారు. పరిశ్రమకు వచ్చిన తర్వాత రకరకాల శాఖలతో కలిసి ప్రయాణం చేయడంతో? ఆ రకంగానూ కొంత అనుభవాన్ని సంపాదించారు. ఈ క్రమంలో తనకొచ్చిన ఐడియాలన్నింటినీ కథలు మార్చి స్నేహితులైన నాని, నితిన్ తో షేర్ చేసుకునే దాన్ని అన్నారు. ఆ సమయంలో ఇవే కథల్ని మరింతగా విస్తృతం చేసి నువ్వే ఎందుకు? దర్శకత్వం వహించకూడదని వాళ్లిద్దరు ప్రోత్సహించడంతో? తన ఆలోచనలు కూడా మారినట్లు తెలిపారు.
సినిమా రచనపై మరింత అవగాహన పెంచుకుంటూ కొన్ని స్క్రిప్ట్ లు రాసుకున్నట్లు తెలిపారు. రచయితగా, దర్శకురాలిగా తనదైన గుర్తింపుతో బయటకు వచ్చే తొలి సినిమాకు `తెలుసు కదా` కథ అయితేనే బాగుంటుందని భావించి ముందుకెళ్లినట్లు తెలిపారు. నితిన్ `ఎక్స్ ట్రా` సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు సిద్దు జొన్నలగడ్డకు ఈ కథ బాగుంటుందని అతడి పేరును సూచించినట్లు నీరజ తెలిపారు. అలా సిద్దు ప్రాజెక్ట్ లో భాగమైనట్లు తెలుస్తోంది. పాత్రలకు తగ్గ నటులు దొరికినప్పుడే సినిమా సగం విజయం అక్కడే సాధించినట్లు అవుతుందన్నది తాను బలంగా నమ్ముతానన్నారు.
దర్శకురాలిగా ప్రతిభ, సృజనాత్మకత ఒకటైతే? అన్ని విభాగాల్ని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లడం మరో ఎత్తు అన్నారు. దర్శకురాలిగా తెరపై తన పేరు కనిపించినా? వెనుక ఎంతో మంది కష్టం ఉందన్నారు. అలాగే నీరజ రెండవ సినిమా కూడా కచ్చితంగా ప్రేమ కథే అవుతుందన్నారు. అంటే రెండవ సినిమాకి సంబంధించి కథ రెడీగా ఉందని క్లారిటీ వచ్చింది. మరి అందులో హీరో ఎవరవుతారో చూడాలి.