అటా..ఇటా.. సింహం డిసైడ్ అయ్యేది అప్పుడే!
నటసింహ బాలకృష్ణ పుల్ స్వింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు.;
నటసింహ బాలకృష్ణ పుల్ స్వింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే వరుసగా నాలుగు విజయాలు పడ్డాయి. దీంతో బాలయ్య మనసు డబుల్ హ్యాట్రిక్ కోరుకుంటుంది. ప్రస్తుతం `అఖండ-2` సెట్స్ లో ఉంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో బాలయ్య పాన్ ఇండియా స్టార్ గా మారడం పై అభిమానులు చాలా కాన్పిడెంట్ గా ఉన్నారు.
బాలయ్య సైతం రెట్టించిన నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమా విజయంతో బాలయ్యకు వరుసగా ఐదవ హిట్ పడినట్లే. ఈ నేపథ్యంలో తదుపరి సినిమా డైరెక్టర్ విషయంలో అంతే ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఇప్పటికే బాలయ్యకు చాలా మంది కథలు చెప్పి క్యూలో ఉన్నారు. కానీ ఇంకా ఎవర్నీ ఫైనల్ చేయాలేదు. ఈ లిస్ట్ లో ప్రముఖంగా ఇద్దరు దర్శకుల పేర్లు వినిపిస్తుంది.
వారే హరీష్ శంకర్, గోపీచంద్ మలినేని. ఇద్దరు స్టోరీలు చెప్పి రెడీగా ఉన్నారు. వీళ్లిద్దరిలో బాలయ్య ఎవరికి డేట్లు ఇస్తారు? అన్నది `అఖండ2` తర్వాత గానీ క్లారిటీ రాదు. మరి హరీష్...గోపీల్లో బాలయ్య ఛాయిస్ ఎవరు అవుతారు? అంటే ఇప్పుడే చెప్పలేం. కానీ సక్సస్ పరంగా చూస్తే హరీష్ గోపీచంద్ కంటే వెనుకబడే ఉన్నాడు. హరీష్ శంకర్ సినిమాలు హైప్ తప్ప సక్సస్ అవ్వడం లేదు.
నిర్మాతకు నష్టాలే తప్ప లాభాలు రావడం లేదు. అతడితో పోలిక చేస్తే గోపీచంద్ మలినేని ట్రాక్ రికార్డు బాగుంది. అందులోనూ బాలయ్యను ఎలా చూపించాలో గోపీకి బాగా ఐడియా కూడా ఉంది. ఇద్దరి కాంబి నేషన్ లో ఇప్పటికే సినిమాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బాలయ్య గోపీచంద్ కే ఛాన్స్ ఇస్తాడని ఓ సెక్షన్ ఆడియన్స్ గెస్ చేస్తున్నారు. దీనిపై పూర్తి క్లారిటీ వచ్చేది `అఖండ-2` రిలీజ్ తర్వాతే. అప్పటి వరకూ వెయిటింగ్ తప్పదు.