• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అవ‌మానం: స్టార్ క‌పుల్‌ని...

అవ‌మానం: స్టార్ క‌పుల్‌ని గుర్తించ‌ని సామాన్య జ‌నం

| సెల‌బ్రిటీల‌కు ప‌బ్లిక్ లో ఉండే ఇమేజ్ వేరు. త‌మ ఫేవ‌రెట్ స్టార్లు క‌నిపిస్తే చాలు.. మీద ప‌డ‌తారు.

By - Tupaki Desk
Update: 2024-11-22 12:20 GMT

సెల‌బ్రిటీల‌కు ప‌బ్లిక్ లో ఉండే ఇమేజ్ వేరు. త‌మ ఫేవ‌రెట్ స్టార్లు క‌నిపిస్తే చాలు.. మీద ప‌డ‌తారు. సెల్ఫీలు, ఫోటోలు అంటూ నానా ర‌చ్చ చేస్తారు అభిమానులు. కానీ అక్క‌డ ఆ సీన్ ఏదీ క‌నిపించ‌లేదు. పైగా వాళ్లు ఆరాంగా తింటూ ఉంటే, అటువైపు చూసేవాళ్లు కానీ, ప‌ట్టించుకున్న వాళ్లు కానీ లేరు. ఎవ‌రి తిండిలో వారు బిజీబిజీగా ఉన్నారు త‌ప్ప ప‌క్క‌నే పెద్ద స్టార్ హీరోయిన్ ఉంద‌ని కానీ, స్టార్ డైరెక్ట‌ర్ స‌ఖితో డైనింగ్ చేస్తున్నాడ‌ని కానీ ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు.

నిజంగా ఇది ఆ సెల‌బ్రిటీ జంట‌కు అవ‌మానం. అయితే ఈ అవ‌మానాన్ని కూడా వాళ్లు ప‌ట్టించుకునే ప‌రిస్థితి అక్క‌డ క‌నిపించ‌లేదు. ఢిల్లీ హోటల్‌లో నయనతార - విఘ్నేష్ శివన్ ఇద్ద‌రూ తినుబండారాలు తింటూ క‌నిపించారు. కానీ వారిని ఎవరూ గుర్తించక‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. న‌య‌న్ ఇటీవ‌లే బాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ జ‌వాన్ లో న‌టించింది. అయినా దిల్లీ ప్ర‌జ‌ల‌కు త‌న‌ను గుర్తు ప‌ట్ట‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు అంత‌ర్జాలంలో వైరల్‌గా మారింది. పూర్తి వివ‌రాల్లోకి వెళితే.....

బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్ లో భాగంగా న‌య‌న్- విఘ్నేష్ జంట‌ చాలా సింపుల్ గా దిల్లీలో హోట‌ల్ కి వెళ్లి తినొచ్చారు. అంద‌రిలానే వారు కూడా క్యూలో నించుని త‌మ ప్లేట్ అందుకున్నారు. అక్క‌డ టేబుల్ పై కూచుని స‌ర‌దాగా మాట్లాడుకుంటూ ఆర‌గిస్తూ క‌నిపించారు. కానీ ఆ అర‌గంట స‌మ‌యంలో వారిని ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. క‌నీసం న‌య‌న‌తార స్టార్ హీరోయిన్ అనేది కూడా అక్క‌డ ఉన్న ప్ర‌జ‌ల‌కు అర్థం కాలేదు. అయితే న‌య‌న్ కానీ, విఘ్నేష్ కానీ వారి డ్రెస్సింగ్ సెన్స్ లో ఎక్క‌డా ఆర్భాటం చూపించ‌లేదు. పైగా అక్క‌డికి వ‌చ్చిన విధానం ఒక సాధాసీదా క‌పుల్ లాగా మాత్ర‌మే ఉంది. అందువ‌ల్ల‌నే ప్ర‌జ‌లు వారిని గుర్తించ‌లేదు.

నిజానికి బ‌ర్త్ డే పార్టీల పేరుతో విదేశాల్లో చిల్ అవ్వాల‌న్న ఆలోచ‌న చేయ‌కుండా ఇంత సింపుల్ గా పార్టీని కానిచ్చేయ‌డం న‌య‌న్- విఘ్నేష్ అభిమానుల హృద‌యాల‌ను ట‌చ్ చేసింది. నిజానికి విఘ్నేష్- న‌య‌న్ సొంత విమానంలో ఎగ్జోటిక్ లొకేష‌న్ల‌కు వెళ్లి పార్టీలు చేసుకోవ‌డం కొత్తేమీ కాదు. అలాగే విదేశీ విహార‌యాత్ర‌లు కూడా కొత్త కాదు. అందువ‌ల్ల చాలా సింపుల్ గా బ‌ర్త్ డే ఈవెంట్ ని ప్లాన్ చేసార‌ని అర్థం చేసుకోవాలి.

నయనతార ఇటీవల తన నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ `నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్` ప్ర‌చారంలో బిజీ అయింది. అయితే తన చిత్రం `నానుమ్ రౌడీ థాన్` నుండి క్లిప్‌ను ఉపయోగించినందుకు ధనుష్‌ ప్రొడక్షన్ హౌస్ నుండి లీగల్ నోటీసు అందింది. ప్ర‌స్తుతం ధ‌నుష్ వ‌ర్సెస్ న‌య‌న్ వివాదం త‌మిళ‌నాడు స‌హా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది.

#Nayanthara and #VigneshShivan waited in line for 30 minutes at a #Delhi restaurant, remaining unnoticed by the people around them.#WikkiNayan #Kollywood #Tupaki pic.twitter.com/Se6ptTPPdm

— Tupaki (@tupaki_official) November 22, 2024
Tags:    
  • Nayanthara 
  • Vigneshshivan 
  • Delhirestaurent 
  • Nayantharabeyondthefairytale 
  • Dhanush 
  • Filmindustry 
  • Nayantharavignesh 

Similar News

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

Copyright @2026

Powered by Blink CMS