ఒకవేళ నెమలి గనుక ఒక అందమైన అమ్మాయి రూపం దాలిస్తే.. అది కచ్ఛితంగా నయనతారే అవుతుంది!
సౌత్ ఇండస్ట్రీ లేడీ సూపర్ స్టార్ నయనతార గ్లామర్ పరంగానే కాకుండా తన క్లాసీ స్టైల్‌తోనూ ఎల్లప్పుడూ ట్రెండ్ సెట్ చేస్తూనే ఉంటారు.
సౌత్ ఇండస్ట్రీ లేడీ సూపర్ స్టార్ నయనతార గ్లామర్ పరంగానే కాకుండా తన క్లాసీ స్టైల్‌తోనూ ఎల్లప్పుడూ ట్రెండ్ సెట్ చేస్తూనే ఉంటారు. తాజాగా ఈ సీనియర్ బ్యూటీ తన అధికారిక ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసిన కొన్ని అద్భుతమైన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. నెమలి రంగు శారీ కట్టుకుని.. సాంప్రదాయకమైన లుక్‌లో నయనతార మెరిసిపోతున్న తీరుకు అటు అభిమానులు, ఇటు సినిమా సెలబ్రిటీలు సైతం ఫిదా అయిపోతున్నారు.
చీర కట్టులో నయనతార దేవతలా ఉంటుందని ఈ తాజా చిత్రాలు మరోసారి నిరూపించాయి. ఈ పోస్ట్‌కు ఇండస్ట్రీ నుండి వస్తున్న స్పందన చూస్తే నయన్ క్రేజ్ ఏంటో అర్థమవుతుంది. ప్రముఖ నటి అదితి రావు హైదరి హార్ట్ ఎమోజీలతో తన అభిమానాన్ని చాటుకోగా.. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ కుమార్తె ఖతీజా రెహమాన్ కూడా ఫైర్, హార్ట్ ఎమోజీలతో నయనతార రాయల్ లుక్‌ను తెగ మెచ్చుకున్నారు. సెలబ్రిటీల కామెంట్లతో ఈ పోస్ట్ మరింత వైరల్‌గా మారింది.
మరోవైపు నయన్ తమిళ అభిమానుల కామెంట్లు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. `అళగి` (అందగత్తె), `ఎన్ మయిలే` (నా నెమలి) అంటూ తమిళంలో నెటిజన్లు కవితలు కురిపిస్తున్నారు. ఒకవేళ నెమలి గనుక ఒక అందమైన అమ్మాయి రూపం దాలిస్తే.. అది కచ్చితంగా నయనతారే అవుతుంది! అంటూ కొందరు నెటిజన్లు పోలికలు తీసుకొస్తున్నారు. నయనతార శారీ కడితే అది ఎప్పటికీ అవుట్ ఆఫ్ స్టైల్ అవ్వదు.. ఇక ఈ శారీ లుక్ ట్రెండింగ్ అవ్వడం ఖాయం! అని కామెంట్లు పెడుతున్నారు. ఒక అభిమాని అయితే ఈ అద్భుతమైన గ్లో అంతా నయనతార సొంత కాస్మెటిక్ బ్రాండ్ 9SKIN ప్రొడక్ట్స్ వల్లేనంటూ రాసుకొచ్చారు.
ఇదే కామెంట్ సెక్షన్‌లో సినిమా గాసిప్స్ కూడా సందడి చేశాయి. ఒక నెటిజన్ నయనతార లుక్‌కు స్పందిస్తూ.. మీరు జైలర్ 2 సినిమాలో ఉన్నారని నాకు తెలుసు! అంటూ సరికొత్త గాసిప్ ప్రచారానికి తెరలేపారు. మొత్తానికి ఈ సరికొత్త బ్లూ శారీ లుక్ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రస్తుతం విపరీతంగా ట్రెండ్ అవుతూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది.
కేవలం సోషల్ మీడియా అప్‌డేట్స్‌తోనే కాకుండా.. సినిమాల పరంగానూ నయనతార చేతిలో ప్రస్తుతం వైవిధ్యమైన ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో భారీ అంచనాలున్న `మూకుత్తి అమ్మన్ 2` చిత్రం ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. అలాగే `మన్నంగట్టి సిన్స్ 1960`, `హాయ్` చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటితో పాటు హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న `రాక్కాయి` చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. 2026లో మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్‌లపై సంతకాలు చేసిన నయన్ ఈ వరుస చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద మరోసారి సూపర్‌హవా చూపించడానికి సన్నద్ధమవుతున్నారు.