• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్ర‌భాస్- ఎన్టీఆర్...

ప్ర‌భాస్- ఎన్టీఆర్ ఆక‌తాయిలు.. స్టార్ హీరోయిన్ కామెంట్!

| ఎన్టీఆర్ తో అదుర్స్, ప్ర‌భాస్ తో యోగి చిత్రాల్లో న‌టించింది న‌య‌న్.

By - Tupaki Desk
Update: 2024-10-04 03:15 GMT

అవును .. ఆ ఇద్ద‌రు తెలుగు హీరోలు ఆక‌తాయిలు అని వ్యాఖ్యానించింది ఓ ప్ర‌ముఖ క‌థానాయిక‌. సెట్లో ఇద్ద‌రి అల్ల‌రి గురించి మాట్లాడింది. ఇంత‌కీ ఎవ‌రీ క‌థానాయిక‌? అంటే.. మ‌రెవ‌రో కాదు.. త‌లైవి న‌య‌న‌తార‌. ఈ భామ ఇంత‌కుముందు ఎన్టీఆర్, ప్ర‌భాస్ లాంటి అగ్ర హీరోల స‌ర‌స‌న న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ తో అదుర్స్, ప్ర‌భాస్ తో యోగి చిత్రాల్లో న‌టించింది న‌య‌న్.


ఎన్టీఆర్ - నయనతార 2010లో తమ చిత్రం అదుర్స్‌లో జంట‌గా న‌టించారు. ఈ యాక్షన్ కామెడీ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తెరపై న‌య‌న్‌- తార‌క్ కెమిస్ట్రీకి గొప్ప‌ ప్రశంసలు లభించాయి. అయితే తాజా ఇంట‌ర్వ్యూలో నయనతార తన అదుర్స్ సహనటుడు జూనియర్ ఎన్టీఆర్‌ని టోటల్‌గా ఆక‌తాయి అని వ్యాఖ్యానించింది.

2022లో నయనతార సుమ కనకాలతో ఒక ఇంటర్వ్యూ లో కనిపించినప్పుడు.. జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి పనిచేసిన అనుభవం గురించి ప్ర‌శ్నించ‌గా నిజాయితీగా సంభాషణ సమయంలో..సెట్స్ లో జ‌రిగిన ఒక ఉల్లాసకరమైన సంఘటనను షేర్ చేసింది. నయనతార మాట్లాడుతూ, ``అతడు(ఎన్టీఆర్) కూడా ఒక ఆకతాయి అని నేను అనుకుంటున్నాను.. ఒక రోజు నేను ఏదో టచ్-అప్ లేదా అలాంటిదే చేస్తున్నాను.. కాబట్టి అతడు నిరంతరం నన్ను చూస్తున్నట్లుగా ఉన్నాడు. ఎందుకు అలా చూసాడు? ఏదైనా తప్పుగా ఉందా? అంటే.. అతడు ఈ ట‌చ‌ప్ లు వద్దు అని చెప్పాడు.. మీరు ఎందుకు చాలా టచ్-అప్ చేస్తున్నారు? అని ప్ర‌శ్నించాడు. కాబట్టి నేను వద్దు అని చెప్పినట్లు గుర్తు ..టేక్ కారణంగా ఇప్పుడే చేస్తున్నాను. ఏమైనప్పటికీ ఎవరూ మిమ్మల్ని చూడరు... అందరూ నన్ను చూడబోతున్నారని అతడు నాకు చెప్పాడు`` అని గుర్తు చేసుకుంది.

అదే ఇంటర్వ్యూలో నయనతార ప్రభాస్ గురించి వ్యాఖ్యానించింది. అతడిని కూడా ఆకతాయి అని వ్యాఖ్యానించింది. ప్ర‌భాస్ చాలా స్వీటెస్ట్. పైగా ప‌సి పిల్లవాడి త‌ర‌హా! అని న‌య‌న‌తార అన్నారు. తాను ప్రభాస్‌తో కలిసి పనిచేసినప్పుడు అతడు సెట్స్‌లో అటూ ఇటూ దూకి జోకులు పేల్చేవాడు.. అని గుర్తు చేసుకుంది. ప్రభాస్ ఈరోజు ఇంత పెద్ద స్టార్ అయినందుకు న‌య‌న‌తార‌ ప్రశంసించింది. నయనతార- ప్రభాస్‌లు 2007లో యోగి చిత్రంలో కలిసి పనిచేసిన సంగతి తెలిసిందే.

Tags:    
  • Tollywood 
  • Bollywood 
  • Kollywood 
  • Yogi 
  • Adhurs 
  • Interview 
  • Nayanthara 
  • SumaKanakala 
  • Ntr 
  • Prabhas 
  • Nayantharacomments 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS