• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ధనుష్ 10 కోట్ల డిమాండ్.....

ధనుష్ 10 కోట్ల డిమాండ్.. దీనికోసమేనా..

| సౌత్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు పొందిన నయనతార ప్రస్తుతం ఓ వివాదంలో చిక్కుకున్నారు.

By - Tupaki Desk
Update: 2024-11-17 08:35 GMT

సౌత్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు పొందిన నయనతార ప్రస్తుతం ఓ వివాదంలో చిక్కుకున్నారు. నెట్‌ఫ్లిక్స్ ఆమె జీవితంపై తీసిన డాక్యుమెంటరీ కారణంగా ఈ వివాదం మొదలైంది. నిజానికి నయనతార పెద్దగా బ్యాక్ గ్రౌండ్ లేకుండానే తన కష్టంతో, తన ప్రతిభతో ఈ స్థాయికి చేరుకుంది. ఆమె జీవిత ప్రయాణాన్ని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో నెట్‌ఫ్లిక్స్ ఈ డాక్యుమెంటరీని రూపొందించిందని హైలెట్ చేశారు.

అయితే, ఈ డాక్యుమెంటరీకి సంబంధించి విడుదల చేసిన ట్రైలర్‌లోని కొన్ని సన్నివేశాలు పెద్ద సమస్యగా మారాయి. 2015లో విజయ్ సేతుపతి, నయనతార జంటగా నటించిన 'నానుమ్ రౌడీ దాన్' సినిమా షూటింగ్ సమయంలో చిత్రీకరించిన ఒక క్లిప్పు డాక్యుమెంటరీలో ఉపయోగించారు. ఈ సినిమా నిర్మాత ధనుష్, ఆయన అనుమతి లేకుండా ఈ సన్నివేశాలను డాక్యుమెంటరీలో వాడారని ఆరోపిస్తూ నయనతారకు రూ.10 కోట్లు పరిగణించాలంటూ లీగల్ నోటీసులు పంపించారు.

ధనుష్ తీసుకున్న ఈ చర్యపై నయనతార తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇది కేవలం కక్ష సాధింపు చర్యగా భావిస్తున్నట్లు అన్నారు. నయనతార తన సోషల్ మీడియా ద్వారా ధనుష్‌పై తీవ్ర విమర్శలు చేశారు. "మీరు మీ కుటుంబ సహాయంతో ఈ స్థాయికి చేరుకున్నారు. కానీ నేను నా కష్టంతో ఈ స్థాయికి వచ్చాను. నన్ను అణగదొక్కాలని ప్రయత్నం చేయడం సరికాదు," అని నయనతార పేర్కొన్నారు.

అంతేకాకుండా, "నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కోసం రెండు సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ, ధనుష్ నుంచి సహకారం అందలేదు" అని కూడా తెలిపారు. ఇక నెటిజన్లు ఈ వివాదంపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. "మూడు సెకన్ల క్లిప్పు కోసం రూ.10 కోట్లు డిమాండ్ చేస్తారా?" అంటూ ధనుష్‌ను ప్రశ్నిస్తున్నారు. ట్రైలర్‌లో ఉన్న బార్ సన్నివేశం నెగటివ్ ట్రోలింగ్‌కు కారణమవుతోంది. ఈ వివాదంతో ధనుష్‌పై ప్రతికూలత పెరుగుతోందని చెప్పవచ్చు.

ఈ వివాదం ఎంత దూరం వెళ్తుందో, దీని పరిష్కారం ఎలా ఉంటుందో వేచి చూడాలి. కానీ నయనతార జీవితంపై తీసిన ఈ డాక్యుమెంటరీ ఆమె ప్రయాణాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంలో ప్రధాన పాత్ర పోషించనుందని అర్ధమవుతుంది. ఇక ఆమె కోలీవుడ్ లో ప్రస్తుతం అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్. తెలుగులో కూడా నయన్ కు మంచి క్రేజ్ ఉంది. ఇటీవల బాలీవుడ్ లో జవాన్ సినిమాతో బిగ్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.

These 3 seconds are worth 10 crs😭💸#Dhanush #Nayanthara pic.twitter.com/24TJBj14M8

— Logaanz (@reallogan007) November 16, 2024
Tags:    
  • Dhanush 
  • Nayanthara 
  • Kollywood 
  • Naanumrowdydhaan 
  • FIlmindustry 
  • Parvathy 
  • Vijaysethupathi 
  • Naanumrowdydhaanmovie 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS