నయనతారకు టాలీవుడ్డే ముద్దా?
లేడీ సూపర్ స్టార్ నయనతార మెగాస్టార్ చిరంజీవి 157వ సినిమా కోసం ప్రచార బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.;
లేడీ సూపర్ స్టార్ నయనతార మెగాస్టార్ చిరంజీవి 157వ సినిమా కోసం ప్రచార బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందే అమ్మడు ప్రచారం షురూ చేసింది. నయనతార నుంచి ఇది ఏ మాత్రం ఊహించనది. ఇంతకాలం ప్రచారానికి దూరంగా ఉన్న నయన్ ఒక్కసారిగా ప్రాజెక్ట్ మొదల వ్వడానికి ముందే బరిలోకి దిగడంతో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. అందులోనూ తెలుగు సినిమాకు ప్రచారం చేయడం అన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
దీంతో నయన్ కోలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది. అమ్మడిని టార్గెట్ చేసి మరీ ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. తమిళ సినిమా వదిలేసి తెలుగు సినిమాకు ప్రచారం చేయడం ఏంటి? అనే కశ్చన్ రెయిజ్ అయింది. ప్రతిగా నయన్ కూడా అంతే ధీటుగా బధులిచ్చింది. నిర్ణయాల విషయంలో తనకు మాత్రమే స్వేచ్ఛ ఉంటుందని...తనకు నచ్చిన నిర్మాతలకు మద్దతుగా నిలుస్తానని కుండబద్దలు కొట్టేసింది.
దీంతో టాలీవుడ్ పై నయనతార ప్రేమ హైలైట్ అవ్వడం మొదలైంది. వాస్తవానికి నయన్ చాలా కాలంగా తెలుగు సినిమాలకు దూరంగానే ఉంది. అప్పుడప్పుడు మంచి అవకాశాలు వస్తే నటించడం తప్ప చాలా అవకాశాలు వదులుకుకుంది. ఎక్కువగా తమిళల్లోనే నటించింది. అలాంటి నయన్ తమిళ సినిమా ప్రచారానికి దూరంగా ఉంటూ టాలీవుడ్ సినిమా ప్రచారాని సహకరించడంతో అరవ ఆడియన్స్ నుంచి వ్యతిరేక పవనాలు వీయడం మొదలైంది.
దీంతో నయన్ కేవలం తెలుగు సినిమాలు మాత్రమే ప్రచారం చేస్తుందా? ఆ ప్రచారం 157 వరకే పరిమితం చేస్తుందా? తమిళ సినిమాలు ప్రచారం చేయదా? ఇలా ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో నయనతార క్లారిటీ ఇవ్వాలని సోషల్ మీడియా వేదికగా అడుగుతున్నారు. ఏదీ ఏమైనా నయన్ తెలుగు సినిమా ప్రచారం టాలీవుడ్ ఆడియన్స్ అన్ని రకాలుగా స్వాగతించదగినది.