2026 లో లేడీ సూపర్ స్టార్ లైనప్ ఇలా!
లేడీ సూపర్ స్టార్ నయనతార 2025 లో `టెస్ట్` అనే ఒకే ఒక్క చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించింది. గత ఏడాది కూడా `బియోండ్ ది ఫెయిరీ టేల్ `అనే చిత్రంతోనే ప్రేక్షకుల ముందుకొచ్చింది.;
లేడీ సూపర్ స్టార్ నయనతార 2025 లో `టెస్ట్` అనే ఒకే ఒక్క చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించింది. గత ఏడాది కూడా `బియోండ్ ది ఫెయిరీ టేల్ `అనే చిత్రంతోనే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇలా రెండేళ్ల కాలంలో కేవలం రెండు సినిమాలతోనే థియేటర్లోకి వచ్చింది. దీంతో వెండి తెరపై నయన్ కనిపించి చాలా గ్యాప్ వచ్చినట్లు అభిమానులు భావిస్తున్నారు. కానీ కొత్త ఏడాదిలో మాత్రం 2024-25 లెక్కలన్నింటిని సరిచేయబోతుంది. అమ్మడు 2026లో వరుస సినిమాలతో అలరించడం ఖాయం. `మనాన్ ఘాటీ సిన్స్` 1960 షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసింది.
ఆన్ సెట్స్ లో బిజీ బిజీగా:
ప్రస్తుతం ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. వచ్చే ఏడాది ఆరంభంలోనే ఆసినిమా రిలీజ్ కానుంది. అలాగే తమిళ్, మలయాళంలో తెరకెక్కిన `డియర్ స్టూడెంట్స్` అనే చిత్రం కూడా విడుదలవుతుంది. ఆసినిమా కూడా చిత్రీకరణ ముగించుకుని నిర్మాణానంతర పనుల్లో ఉంది. జనవరిలో సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న `మన శంకర వరప్రసాద్ గారు` చిత్రంతోనూ అలరించనుంది. ఇందులో అమ్మడు మెగాస్టార్ చిరంజీవికి జోడీగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే `టాక్సిక్` అనే పాన్ ఇండియా చిత్రంలోనూ కీలక పాత్ర పోషిస్తోంది. యశ్ హీరోగా నటిస్తోన్న చిత్రమిది.
నయన్ నామ సంవత్సరం
సమ్మర్ కానుకగా చిత్రం రిలీజ్ కానుంది. `పేట్రియేట్` అనే మలయాళం చిత్రంలోనూ నటిస్తోంది. అలాగే తమిళ్ లో `మూకుత్తి అమ్మన్ 2` , `హాయ్`, `రఖియే` అనే మరో మూడు చిత్రాల్లోనూ నటిస్తోంది. ఈ మూడు షూటింగ్ దశలో ఉన్నాయి. వీటిలో రెండు చిత్రాలు 2026 మిడ్ లో, మరో సినిమా ఏడాది ముగింపులో రిలీజ్ కానున్నాయి. తాజాగా నటసింహ బాలకృష్ణ 111వ చిత్రంలోనూ హీరోయిన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. బాలయ్య తో కలిసి నాల్గవ సారి నటిస్తోంది. మొత్తంగా 2026 లో అమ్మడు తొమ్మిది రిలీజ్ లతో ప్రేక్షకుల్ని అలరించడం ఖాయం. చాలా కాలం త ర్వాత నయన్ ఒకే సారి ఇన్ని సినిమాలతో రావడం ఇదే.
2026 లో పుల్ జోష్ తో:
సక్సస్ తో నిలదొక్కుకున్న సమయంలో ఒకే ఏడాది ఆరేడు సినిమాలతో ప్రేక్షకుల మధ్యలో ఉండేది. కాల క్రమంలో అమ్మడు సినిమాల సంఖ్య తగ్గించింది. దీంతో రిలీజ్ లు తగ్గాయి. లేడీ ఓరియేంటెడ్ చిత్రాల్లో నటించాలి అన్న ఆసక్తి కారణంగా చాలా సమయాన్ని వృద్దా చేసింది. కొన్ని కథలు నచ్చినా సరైన దర్శకులు సెట్ కాకపో వడం..మరికొన్ని నచ్చక పోవడంతో పట్టాలెక్కడంలో జాప్యం చోటు చేసుకుంది. కొత్త ఏడాదిలో మాత్రం వరుస రిలజ్ లతో అభిమానుల్లో మళ్లీ జోష్ నింపనుంది.