రాజ‌మౌళిపై గురి పెట్టిన న‌వ నాయిక‌!

టాలీవుడ్ నుంచి మొద‌లు బాలీవుడ్ వ‌ర‌కూ అన్ని ప‌రిశ్ర‌మ‌ల స్టార్ హీరోయిన్లు జ‌క్క‌న్న చిత్రంలో భాగ‌మ‌వ్వాల‌ని ఆశ‌ప‌డుతున్నారు.;

Update: 2026-02-25 14:30 GMT

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి చిత్రంలో హీరోయిన్ గా న‌టించాల‌న్న‌ది ప్ర‌తీ న‌టి క‌ల‌. టాలీవుడ్ నుంచి మొద‌లు బాలీవుడ్ వ‌ర‌కూ అన్ని ప‌రిశ్ర‌మ‌ల స్టార్ హీరోయిన్లు జ‌క్క‌న్న చిత్రంలో భాగ‌మ‌వ్వాల‌ని ఆశ‌ప‌డుతున్నారు. కానీ ఆ అవ‌కాశం అంద‌రికీ ద‌క్క‌దు. కొంద‌రికే సాధ్య‌మ‌వుతుంది. రాజ‌మౌళి సృష్టించిన పాత్ర‌కు ఎవ‌రైతే స‌రితూగుతారో వారినే ఎంపిక చేస్తారు. `మ‌గ‌ధీర‌`లో మిత్ర వింద‌గా అరుదైన అవ‌కాశం కాజ‌ల్ అగ‌ర్వాల్ కు ద‌క్కింది. ఆ త‌ర్వాత `బాహుబ‌లి`లో దేవ‌సేన పాత్ర‌లో క‌నిపించే అవ‌కాశం స్వీటీ అనుష్క‌కు ల‌భించింది.

ఈ రెండు సినిమాలు రాజ‌మౌళి కెరీర్ లో ఐకానిక్ చిత్రాలు కావ‌డంతో? వాటిలో హీరోయిన్ పాత్ర‌లు తెలుగు సినిమా చ‌రిత్ర‌లో చిర‌స్మ‌ర‌ణీయ‌మైన‌వి. రాజ‌మౌళికి పాన్ ఇండియాలో అంత‌టి గుర్తింపునిచ్చినవి ఆ రెండు చిత్రాలు కావ‌డంతోనే సాద్య‌మైంది. ప్ర‌స్తుతం తెర‌కెక్కిస్తోన్న‌ `వార‌ణాసి`లో న‌టించే అవ‌కాశం గ్లోబ‌ల్ బ్యూటీ ప్రియాంక చోప్రాకు ద‌క్కింది. ఆ ర‌కంగా కాజ‌ల్ అగ‌ర్వాల్, అనుష్క, త‌ర్వాత స్థానం ప్రియాంక చోప్రాదే అయింది. రాజ‌మౌళి త‌ర్వాత తెర‌కెక్కించే సినిమాలో హీరోయిన్ అవ‌కాశం ఎవ‌రికి ద‌క్కుతుంది? అన్న‌ది రాజ‌మౌళికి కూడా తెలియ‌దు.

ఆయ‌న క‌థ సిద్దం చేసే వ‌ర‌కూ ఎదురు చూడ‌టం త‌ప్ప చేసేదేం లేదు. కానీ ఆ సినిమాలో తానే హీరోయిన్ అయితే బాగుండ‌ని ఆశ‌ప‌డే హీరోయిన్లు మాత్రం కోకొల్ల‌లు. ఇండియాను దాటి హాలీవుడ్ న‌టిమ‌ణులు సైతం జ‌క్క‌న్న చిత్రంలో భాగ‌మ‌వ్వాలనుకుంటున్నారు? అన్న‌ది కాద‌న‌లేని నిజం. అలాంటి లెజెండ‌రీ డైరెక్ట‌ర్ పైనే గురి పెట్టింది యువ నాయిక న‌య‌న్ సారిక‌. ఈ భామ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. `మిస్టేక్` చిత్రంలో పార్వ‌తి పాత్ర‌తో తెలుగులో లాంచ్ అయింది. అటుపై `గం గం గణేశా` లో ఆనంద్ దేవరకొండ సరసన శృతి పాత్రలో క‌నిపించింది.

ఈ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. అనంత‌రం `ఆయ్` చిత్రంలో ఫంక్ ప‌ల్ల‌వి పాత్ర‌లో అల‌రించింది. ఈ పాత్ర‌తో తెలుగు ఆడియ‌న్స్ కు మ‌రింత ద‌గ్గ‌రైంది. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ `క‌` లోనూ డీసెంట్ పాత్ర‌లో క‌నిపించింది. అల‌రించింది. మాలీవుడ్ లో `వృష‌భ` లాంటి పాన్ ఇండియా చిత్రంలోనూ న‌టించింది. శ్రీవిష్ణు హీరోగా న‌టించినవిష్ణు విన్యాసంలోనూ న‌టించింది. త్వ‌ర‌లోనే ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. `పినాక` అనే చిత్రంతో క‌న్న‌డ‌లోనూ లాంచ్ అవుతుంది. ఇలా కొంత ఐడెంటిటీ సంపాదించిన బ్యూటీ సినిమాల నుంచి రిటైర్మెంట్ తీసుకునో లోపు రాజ‌మౌళి సినిమాలో న‌టించి కెరీర్ ని ప‌రిపూర్ణం చేసుకోవాల‌ని ఆశ‌ప‌డుతుంది. మ‌రి అమ్మ‌డి కోరిక నెర వేరుతుందా? లేదా? అన్న‌ది చూడాలి.

Tags:    

Similar News