అనగనగా నవీన్ పోలిశెట్టి.. ఆ తర్వాత ఏంటి..?

శేఖర్ కమ్ముల లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ టైం నుంచి చిన్న చిన్న రోల్స్ చేస్తూ వచ్చిన నవీన్ ఫైనల్ గా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ అనే ప్రయత్నంతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు;

Update: 2025-06-19 05:00 GMT

యువ హీరోల్లో ఫుల్లీ టాలెంటెడ్ అనిపించే వారిలో నవీన్ పొలిశెట్టి ఒకరు. శేఖర్ కమ్ముల లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ టైం నుంచి చిన్న చిన్న రోల్స్ చేస్తూ వచ్చిన నవీన్ ఫైనల్ గా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ అనే ప్రయత్నంతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత జాతిరత్నాలుతో సూపర్ సెన్సేషన్ అయ్యాడు. రెండేళ్ల క్రితం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఐతే ఆ తర్వాత చిన్న యాక్సిడెంట్ వల్ల షూటింగ్ కి బ్రేక్ ఇచ్చాడు నవీన్ పొలిశెట్టి.

ప్రస్తుతం అంగనగా ఒక రాజు సినిమాతో వస్తున్నాడు ఈ హీరో. సితార బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాలో నవీన్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు సినిమా ముందు కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేయాలని అనుకున్నా అతని ప్లేస్ లో మారి వచ్చి చేరాడు. అనగనగా ఒక రాజు సినిమా నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ లాక్ చేశారు. మరి అంత టైం ఎందుకు తీసుకుంటున్నారు అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.

ఐతే నవీన్ మంచి సక్సెస్ ఫాం లో ఉన్న ఈ టైం లో సినిమాల విషయం లో లేట్ చేయడం కెరీర్ మీద ఎఫెక్ట్ పడేలా చేస్తుంది. అనగనగా తర్వాత నవీన్ చేస్తున్న సినిమా ఏంటన్నది కూడా ఇంకా క్లారిటీ రాలేదు. అనగనగా ఒక రాజు సినిమానే ఇంకా మరో ఆరు నెలలు దాకా చేసేలా ఉన్నారు. ఈలోగా నెక్స్ట్ సినిమా ఓకే చేసి సెట్స్ మీదకు తీసుకెళ్తాడా లేదా మళ్లీ ఎప్పటిలానే టైం తీసుకుంటాడా అన్నది చూడాలి.

నవీన్ ఏరి కోరి కథలు ఎంపిక చేసుకోవడం వల్ల ఈ గ్యాప్ వస్తుందని తెలుస్తున్నా మరీ లేట్ అయితే మాత్రం కష్టమే అని చెప్పొచ్చు. నవీన్ స్పీడ్ స్పీడ్ గా సినిమాలు చేస్తే మాత్రం ఆడియన్స్ సూపర్ ఎంజాయ్ చేస్తారు. ఐతే మంచి సినిమా తీయడానికి కాస్త టైం తీసుకున్నా పర్వాలేదు అనేది నవీన్ పొలిశెట్టి పంథా. మరి అనగనగా ఒక రాజు సినిమా నుంచి అయినా నవీన్ తన సినిమాల వేగం పెంచుతాడేమో చూడాలి.

Tags:    

Similar News