ప్రభాస్ పెళ్లితో ముడిపడ్డ నవీన్ పోలిశెట్టి పెళ్లి.. ఇదెక్కడి విడ్డూరం!

అలా ప్రభాస్ పెళ్లి ఇప్పట్లో లేదు కాబట్టే ఇకపై తనను కూడా ఎవరు పెళ్లి అంటూ విసిగించకండి అని ఇన్ డైరెక్ట్ గా కామెంట్లు చేశారు నవీన్ పోలిశెట్టి.;

Update: 2025-12-31 08:40 GMT

ప్రభాస్ పెళ్లితో నవీన్ పోలిశెట్టి పెళ్లి ముడిపడడం ఏంటి? అని ఆలోచిస్తున్నారా?.. అయితే తాజాగా నవీన్ పోలీ శెట్టి స్వయంగా చేసిన కామెంట్లు ఇవి. అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రభాస్, మెగాస్టార్ చిరంజీవి వంటి హీరోలతో పాటు తన చిత్రాన్ని కూడా విడుదలకు సిద్ధం చేశారు నవీన్ పోలిశెట్టి. అదే అనగనగా ఒక రాజు. విభిన్నమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈయన జనవరి 14న మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. ప్రముఖ హీరోయిన్ మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా "అనగనగా ఒక రాజు పెళ్లి రిసెప్షన్" పేరుతో ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్. ఇందులో మీడియా అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానం ఇచ్చి అసలైన స్టాండ్ అప్ కమెడియన్ అని నిరూపించుకున్నారు.

మీడియా సమావేశంలో భాగంగా..

ఎప్పటినుంచో పెళ్లి వార్తలు వస్తున్నాయి? మరి వాటిని ఎప్పుడు నిజం చేస్తారు? అని ప్రశ్నించగా నవీన్ పోలిశెట్టి మాట్లాడుతూ.. ప్రభాస్ ఏ రోజైతే పెళ్లి చేసుకుంటారో ఆ మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు నేను వివాహం చేసుకుంటాను అని సరదాగా సమాధానం ఇచ్చి అందరిని నవ్వించారు. వాస్తవానికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నాలుగు పదుల వయసు దాటినా ఇంకా వివాహం చేసుకోకుండా అభిమానులను నిరాశ పరుస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆయన సినిమా లైనప్ చూస్తే ఇప్పట్లో ఆయనకు వివాహం చేసుకునే ఆలోచనలు కూడా లేవనే వార్తలు స్పష్టమవుతున్నాయి.

అలా ప్రభాస్ పెళ్లి ఇప్పట్లో లేదు కాబట్టే ఇకపై తనను కూడా ఎవరు పెళ్లి అంటూ విసిగించకండి అని ఇన్ డైరెక్ట్ గా కామెంట్లు చేశారు నవీన్ పోలిశెట్టి.

అలాగే ప్రభాస్తో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది అని చెప్పిన ఈయన.. ప్రభాస్ అన్న స్విగ్గిలో ఆర్డర్ పెడితే.. ఓటీపీ నాకు వస్తుంది అంటూ అభిమానులను ఆశ్చర్యపరిచారు

ఎలాంటి అమ్మాయి మీకు భార్యగా రావాలి?

ఆ అమ్మాయికి ఉండాల్సిన మొదటి లక్షణం నన్ను ప్రశ్నలు అడగకూడదు..తను ఎలా ఉన్నా సరే ఆ అమ్మాయి కోసం నేనే మారుతాను అంటూ తనకు కాబోయే అమ్మాయికి ఉండాల్సిన లక్షణాల గురించి బయటపెట్టారు నవీన్.

పెళ్లెప్పుడు చేసుకుంటారు?

నాకు సినిమాల్లోనే పెళ్లి చేసుకోవాలని రాసి ఉన్నట్లుంది మీరు ఇలాగే ఆదరిస్తూ వస్తే..నా ప్రతి సినిమాలో కూడా పెళ్లి సీను ఉండేలా చూసుకుంటాను అంటూ తెలిపారు.

మెగాస్టార్ చిరంజీవితో పోటీకి వస్తున్నారు.. మీకు భయం వేయడం లేదా?

సామాన్య కుటుంబంలో పుట్టినా స్టార్ గా ఎదగవచ్చు అని చిరంజీవి ఎంతోమందికి స్ఫూర్తినిచ్చారు. ఈరోజు నాలాగా ఎంతోమంది ఇండస్ట్రీకి వచ్చి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారంటే దానికి మెగాస్టార్ కారణం.. ఆయన నటించిన మన శంకర్ వరప్రసాద్ గారు చూసి ఆడియన్స్ అంతా మా చిత్రానికి వస్తారని అనుకుంటున్నాను. నేను ఆయనకు పెద్ద వీరాభిమానిని అంటూ తెలిపారు నవీన్.

Tags:    

Similar News