ఇడ్లీ, దోశెలు మానేసి చద్దన్నం తింటోన్న నటుడు!
అతడి ఉదయం పూట తీసుకునే ఆహారం తెలిస్తే షాక్ అవుతారు. ఇంతకీ ఎవరా నటుడు అంటే నవీన్ చంద్ర.;
సెలబ్రిటీ లైఫ్ ఎలా ఉంటుందన్నది చెప్పాల్సిన పనిలేదు. ఉదయం మొదలు రాత్రి పడుకునే వరకూ డే అంతా ఎంతో లగ్జరీగా ముగిస్తారు. నచ్చిన రెస్టారెంట్ లో టిఫిన్..మెచ్చిన స్టార్ హోటల్స్ లో లంచ్, డిన్నర్ వంటివి ముగిస్తారు .ఇదంతా బయట ఉంటే. షూటింగ్ లో ఉన్నా? తాము కోరిన ఆహారాన్ని నిర్మాత అందిం చాల్సి ఉంటుంది. ఇంట్లో ఉన్నా? చెఫ్ తో కావాల్సినవి వండించుకుని ఆరగిస్తారు. కానీ ఓ పేరున్న నటుడు ఇవేవి చేయడు. అతడి ఉదయం పూట తీసుకునే ఆహారం తెలిస్తే షాక్ అవుతారు. ఇంతకీ ఎవరా నటుడు అంటే నవీన్ చంద్ర.
అవును నవీన్ ఉదయం అందరిలా బ్రేక్ ఫాస్ట్ అంటే ఇడ్లీ, దోశెలు, వడలు, పూరి, బజ్జీలు తినడు. ఇప్పుడు అవన్నీ మానేసి చద్దాన్నం తింటున్నాడుట. రాత్రి మిగిలిన అన్నంలో పాలు పోసి తోడు పెట్టి పొద్దునే పెరుగన్నంగా తీసుకుంటున్నాడు. మధ్య మధ్యలో ఉట్టి గంజి అన్నమే తింటున్నాడుట. అందులో మంచించ్ గా పచ్చి మిర్చి, అవకాయ లాంటివి తీసుకుంటూ చాలా సింపుల్ గా బ్రేక్ ఫాస్ట్ ముగిస్తున్నట్లు తెలిపాడు. కడుపుకు ఈ ఆహారం ఎంతో హాయిగా ఉంటుందన్నాడు. అంతే కాదు ఆరోగ్యంగానూ ఉంటుందన్నాడు. మంచి నిద్ర పడుతుందన్నాడు.
చాలా కాలంగా ఉదయం పూట ఇడ్లీ, దోశెలు తినడం మానేసానన్నాడు. చద్దాన్నం మొదలు పెట్టిన తర్వాత ఇంత కాలం ఇంత రుచికరమైన ఆహారం మిస్ అయ్యానా? అన్న ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసాడు. మరి ఇలా ఇంకెంత మంది చద్దాన్నం తినే స్టార్లు బయటకు వస్తారో చూద్దాం. హీరోగా ఎంట్రీ ఇచ్చిన నవీన్ చంద్ర ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయిన సంగతి తెలిసిందే. హీరో కటౌట్ అయినా? సరైన అవకాశాలు రాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. ఇక్కడ మాత్రం మంచి సక్సస్ అయ్యాడు.
స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రలు, నెగిటివ్ పాత్రలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన `మాస్ జాతర`లో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కన్నడలో `మార్క్` అనే చిత్రంతో ఎంటర్ అవుతున్నాడు. మరో రెండు శాండిల్ వుడ్ చిత్రాల్లో ఛాన్సులు అందుకున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే వీటిపై ఎలాంటి క్లారిటీ లేదు. నవీన్ చంద్ర కూడా ఈ ప్రచారాన్ని ధృవీకరించలేదు. అలాగే తమిళ్లో కూడా కొన్ని సినిమాలు చేసాడు.