సెన్సార్ పూర్తయితేనే ఇలా.. మరి రిలీజ్ అయ్యాక..

తాజాగా నవదీప్.. ఇన్ స్టాలో సెన్సార్ పూర్తయిందని, కొత్త రిలీజ్ డేట్ త్వరలో ప్రకటిస్తామని పోస్ట్ పెట్టారు. దాంతో పాటు వీడియోను కూడా షేర్ చేశారు.

Update: 2024-05-07 15:19 GMT

టాలీవుడ్ నటుడు నవదీప్ చాలా గ్యాప్ తర్వాత హీరోగా లవ్ మౌళి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సరికొత్తగా, నవదీప్ 2.0గా ఆయన ఈ మూవీలో నటిస్తున్నారు. విభిన్నమైన జోనర్ లో రూపొందుతున్న ఈ సినిమాకు దర్శకుడిగా అవనీంద్ర వ్యవహరిస్తున్నారు. నవదీప్ కు జోడీగా మిస్ ఇండియా కంటస్టెంట్ పంఖురి గిద్వానీ నటిస్తోంది.

అయితే లవ్ మౌళి సినిమా ఏప్రిల్ 19వ తేదీన రిలీజ్ కావాల్సి ఉన్నా.. పలు కారణాల వల్ల విడుదలను వాయిదా వేశారు మేకర్స్. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ కాకపోవడం వల్ల ఈ సినిమా పోస్ట్ పోన్ అయిందని వార్తలు వచ్చాయి. కానీ సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి కాకపోవడం వల్లే విడుదల వాయిదా పడిందని తర్వాత తెలిసింది. ఇప్పుడు ఇదే నిజమని పరోక్షంగా సోషల్ మీడియాలో హీరో నవదీప్ తెలిపారు.

తాజాగా నవదీప్.. ఇన్ స్టాలో సెన్సార్ పూర్తయిందని, కొత్త రిలీజ్ డేట్ త్వరలో ప్రకటిస్తామని పోస్ట్ పెట్టారు. దాంతో పాటు వీడియోను కూడా షేర్ చేశారు. అందులో హైదరాబాద్ లోని ఈరోజు సాయంత్రం వాతావరణాన్ని చూపించారు. సెన్సార్ పూర్తైతేనే ఇలా ఉంది, ఇంకా మూవీ రిలీజ్ అయితే ఎలా ఉంటుందో, యాహూ అంటూ అరిచారు నవదీప్. అంటే సెన్సార్ పూర్తయిన రోజే క్రైమేట్ ఫుల్ గా మారింది. ఇంక రిలీజ్ అయ్యాక తుఫానే అన్న కోణంలో తెలిపారు నవదీప్.

Read more!

ఇటీవల నవదీప్ పోస్టర్ ను రిలీజ్ చేసి మూవీపై మరిన్ని అంచనాలు పెంచారు మేకర్స్. అందులో జులపాల జుట్టు, ఎక్కువ గెడ్డంతో రగ్డ్ లుక్ లో కనిపించారు నవదీప్. ఈ సినిమా కోసం ఆయన బాగానే కష్టపడినట్లు తెలుస్తోంది. హార్డ్ వర్కౌట్స్ చేసినట్లు కూడా అర్థమవుతోంది. మూవీలో అదిరిపోయే ఫిజిక్ తో నవదీప్ కనిపించనున్నారని ఈజీగా చెప్పవచ్చు. ఈ మూవీని తన సెకెండ్ ఇన్నింగ్స్ అంటూ ప్రమోట్ చేస్తున్నారు నవదీప్.

ఇక సినిమాలో పెయింటర్ అయిన నవదీప్.. తనకు కావాల్సిన అమ్మాయిని, ప్రేమను వెతుక్కుంటూ పలువురు అమ్మాయిలతో ట్రావెల్ చేస్తాడు. అలా ఒకరి తర్వాత ఒకరిని తన క్రూర మనస్తత్వంతో దూరం చేసుకుంటూ ఉంటాడు. మరి చివరకు అతడికి ప్రేమ దొరికిందా లేదా అనే కాన్సెప్ట్ చుట్టూ ఈ మూవీ తిరుగుతోందని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. మరి ఈ సినిమాతో నవదీప్ ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి.

Tags:    

Similar News