30ఏళ్ల సీనియర్ శివాజీ మాట్లాడితే నేనెలా ఆపుతా?: నవదీప్

అయితే శివాజీ వ్యాఖ్యలు చేసే సమయంలో అదే వేదికపై నటుడు నవదీప్‌ కూడా ఉన్నారు.;

Update: 2025-12-31 06:20 GMT

టాలీవుడ్ నటుడు శివాజీ దండోరా మూవీ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలు ఎలాంటి దుమారాన్ని రేపాయో అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఆ విషయం చర్చనీయాంశంగానే ఉంది. అనేక మంది సినీ సెలబ్రిటీలు రెస్పాండ్ అవుతున్నారు. కొందరు శివాజీకి మద్దతు పలుకుతున్నారు. మరికొందరు ఆయన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడుతున్నారు.

అయితే శివాజీ వ్యాఖ్యలు చేసే సమయంలో అదే వేదికపై నటుడు నవదీప్‌ కూడా ఉన్నారు. తాజాగా దండోరా మూవీ టీమ్ విద్యార్థులతో చిట్‌చాట్‌ నిర్వహించగా... శివాజీ మాట్లాడుతున్నప్పుడు మీరెందుకు ఆపలేదనే ప్రశ్న నవదీప్ కు ఎదురైంది. దీంతో ఆయన.. అలా ఆపడం కరెక్ట్ కాదంటూ పూర్తిగా వివరణ ఇచ్చారు.

"ఒక మనిషి స్టేజ్ పై మాట్లాడుతుంటే.. అది కూడా 30 ఏళ్ల సీనియర్.. వాళ్లకు అనిపించింది వాళ్లు చెబుతున్నప్పుడు.. అది తప్పో రైటో వాళ్లకు తెలియాలి.. వినే మనకు తెలియాలి.. వాళ్ల అభిప్రాయం వాళ్లకు ఉంటుంది.. వినే వాళ్లకు ఉంటుంది.. మాట్లాడుతుంటే నీవు ఆపు.. తప్పు అని అనడానికి నేనెవరిని" అని అన్నారు.

"ఓ క్లాస్ లో ఉన్నాం.. టీచర్ ఏదో చెప్తుంటారు.. పక్కన స్టూడెంట్ ఏదో ఎక్కువ మాట్లాడారు.. నువ్వెళ్లి ఆపుతామా.. విని నీ పాయింట్ ఏదో నీవు చూస్తామా అనేది ఉంటుంది.. ఇప్పుడు షాకింగ్ విషయం విన్నప్పుడు అంతా ఎలా ఫీల్ అయ్యావో నేను కూడా ఫీల్ అవుతా.. సమయం బట్టి సందర్భం బట్టి సరిగ్గా మాట్లాడాలనేది సమాజంలో ఒక నిబంధన. అది ఫాలో అయితే మంచిది. కానీ ఎంత వరకు పరిస్థితి ఉందో తెలుసు" అని చెప్పారు.

"కానీ పక్కనోడు మాట్లాడేది మనం ఖండించాలనే పరిస్థితిలో ఉంటే ఖండించాలి. అప్పటికప్పుడు బయలుదేరుతావో.. లేదా ఆలోచించి ఎందుకలా అన్నారని తర్వాత అంటావో.. లేదా అక్కడి నుంచి వెళ్లిపోతావో అన్నది తోచిన బట్టి చేస్తాం.. తర్వాత ఎప్పుడో ఎందుకలా చేశారని అంటాం.. సమాజంలో రెస్పాన్సిబిలిటీ అనేది యాక్టర్ కు మాత్రమేనా" అని నవదీప్ ప్రశ్నించారు.

"కీ బోర్డు పట్టుకుని ఇష్టమొచ్చినట్లు కామెంట్లు పెడుతున్నారు. ఇవన్నీ మేం పడుతున్నాం. అందుకే పబ్లిక్ లో ఉన్నా లేకపోయినా ఇష్టమొచ్చినట్లు ఎవరూ కూడా మాట్లాడకూడదు. ఎవరైనా జాగ్రత్తగా మాట్లాడాలి. బాధ్యత అందరిదీ. శివాజీ గారు అలా మాట్లాడితే.. విజిల్స్, చప్పట్లు కూడా కొట్టారు. మరి వాళ్లను ఏం చేయాలి" అని అడిగారు.

"సామాన్లు బాగుండాలి అనే పదం ఎవరన్నారో తెలియదు. ఆ పదం కంటస్ట్ బూతు. ఇప్పుడు అమ్మాయిలు కూడా వాళ్లలో వాళ్లు ఆ పదం మాట్లాడుకుంటున్నారు. ప్రతి దానికి ఒక సందర్భం ఉంటుంది. అనేక మంది ఆ పదం వాడారు. వైరాలటీలో మీనింగ్ తెలియడం లేదు. అలాంటి సిట్యువేషన్ లో మనం ఉన్నాం" అని చెప్పారు నవదీప్.

Tags:    

Similar News