• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నాని ఆలా చెబుతున్నాడు...

నాని ఆలా చెబుతున్నాడు అంటే!

| తను అందుకోవడమే కాదు బెస్ట్ డిబట్ డైరెక్టర్ గా తను చేసిన ఇద్దరు దర్శకులకు అవార్డ్ వచ్చేలా చేశాడు నాని

By - Tupaki Desk
Update: 2024-08-05 05:37 GMT

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ ఇప్పుడు పీక్స్ లో ఉందని చెప్పొచ్చు. స్టార్ హీరోలంతా కూడా పాన్ ఇండియా సినిమాలతో హిట్లు సూపర్ హిట్లు కొడుతుంటే నాని ఎంచక్కా తన మార్క్ సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నాడు. లాస్ట్ ఇయర్ దసరా సినిమాతో తనలోని మాస్ యాంగిల్ చూపించి వావ్ అనిపించేశాడు నాని. క్లాస్ హీరో మాస్ సినిమా చేస్తే దాని రిజల్ట్ ఎలా ఉంటుందో దసరా చూస్తే అర్ధమవుతుంది. అందుకే నాని దసరా సినిమాలోని యాక్టింగ్ కి ఈ ఇయర్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నాడు.

తను అందుకోవడమే కాదు బెస్ట్ డిబట్ డైరెక్టర్ గా తను చేసిన ఇద్దరు దర్శకులకు అవార్డ్ వచ్చేలా చేశాడు నాని. దసరా సినిమాను డైరెక్ట్ చేసిన శ్రీకాంత్ ఓదెల, హాయ్ నాన్న సినిమాను డైరెక్ట్ చేసిన శౌర్యువ్ లకు అవార్డులను అందిస్తూ ఒక హీరోగా చాలా గర్వంగా ఫీల్ అయ్యాడు నాని. తన ద్వారా పరిచయం చేయబడిన ఇద్దరు దర్శకులకు అవార్డ్ వస్తే దానికి మించిన సంతోషం ఏముంటుంది.

ఐతే ఈ క్రమంలో శ్రీకాంత్ ఓదెల సినిమా గురించి మరో అదిరిపోయే న్యూస్ చెప్పాడు నాని. శ్రీకాంత్ ను వెనక్కి తిప్పి చూపించి శ్రీకాంత్ వెనకాల ఉన్న కాకిని చూడండి నెక్స్ట్ ఇయర్ ఆ కాకి అవార్డులన్న్ని ఎత్తుకెళ్లిపోతుంది అని అన్నాడు. చేస్తున్న సినిమా మీద కాన్ఫిడెన్స్ ఏ రేంజ్ లో ఉంటే నాని ఆ స్టేట్మెంట్ ఇస్తాడో అర్థం చేసుకోవచ్చు. దసరా తో 100 కోట్లు మార్క్ టచ్ చేసిన నాని అదే కాంబోలో ఈసారి అంతకుమించి అనిపించే సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది.

ఐతే కాకిని చూపిస్తూ శ్రీకాంత్ సినిమా గురించి హైప్ పెంచేశాడు నాని. మామూలుగానే నాని సినిమాల సెలక్షన్స్ పై స్పెషల్ క్రేజ్ ఉంటుంది. నాని మరీ ఇంత కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు అంటే మరోసారి బాక్సాఫీస్ షేక్ అవ్వడం పక్కా అనిపిస్తుంది. ఈ తరం హీరోల్లో ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా వచ్చి సత్తా చాటుతున్న నాని ఎంతోమంది కొత్త వారికి స్పూర్తిగా నిలుస్తున్నాడు. నాని ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమా చేస్తున్నాడు. వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఈ నెల 29న రిలీజ్ అవుతుంది. సరిపోదా శనివారం రిలీజ్ కాగానే తక్కువ టైం లోనే శ్రీకాంత్ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్తారని తెలుస్తుంది. సినిమాను నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లేదా సెకండ్ హాఫ్ లో రిలీజ్ చేసే ప్లాన్ ఉందని తెలుస్తుంది.

Tags:    
  • Naturalstar 
  • Nani 
  • Dasara 
  • Srikanthodela 
  • Filmindustry 
  • HiNanna 
  • Tollywood 
  • Saripodhasanivaram 

Similar News

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS