• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జాతిరత్నాలు, మ్యాడ్.....

జాతిరత్నాలు, మ్యాడ్.. ఇప్పుడు జింఖానా!

| ఇక మలయాళంలో ఘన విజయం సాధించిన అలప్పుఝ జింఖానా ఇప్పుడు తెలుగులో జింఖానాగా విడుదలై, ప్రేక్షకులను థియేటర్‌లో ఆకట్టుకుంటోంది.

By - Tupaki Desk
Update: 2025-04-26 09:28 GMT

యూత్‌ను మెప్పించే కామెడీ ఎంటర్టైనర్‌లు ఎప్పుడు వచ్చినా కూడా ఆ బజ్ వేరేలా ఉంటుంది. జాతిరత్నాలు, మ్యాడ్ ఏ స్థాయిలో హిట్టయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక మలయాళంలో ఘన విజయం సాధించిన అలప్పుఝ జింఖానా ఇప్పుడు తెలుగులో జింఖానాగా విడుదలై, ప్రేక్షకులను థియేటర్‌లో ఆకట్టుకుంటోంది. ‘ప్రేమలు’ ఫేం నస్లేన్ కె. గపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మలయాళంలోనే హిట్ టాక్ అందుకోగా, ఇప్పుడు తెలుగులోనూ అదే బజ్ ను రిపీట్ చేస్తోంది.


ఇటీవలే రిలీజైన ఈ సినిమా మొదటి రోజే సూపర్ రెస్పాన్స్ అందుకుంది. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ఈ సినిమాను తమతో అనుసంధానించుకున్నారు. కథలోని సింప్లిసిటీ, పాత్రలలోని అమాయకత్వం, మరియు బాక్సింగ్ అకాడమీ నేపథ్యంలో నడిచే సంఘటనలు వారిలో నిజంగా జరిగేవిగా అనిపించడంతో మంచి కనెక్షన్ ఏర్పడింది.

దర్శకుడు ఖలీద్ రెహమాన్ కథను ఎక్కువ మలుపులు లేకుండా, స్ట్రైట్ ఫార్వర్డ్ గా చూపించి నవ్విస్తూ, ఏదో మెసేజ్ పాస్ చేసే ప్రయత్నం చేశారు. ఒకరకంగా చూస్తే ఇది ఓ యూత్ గ్యాంగ్ తన అసలైన టాలెంట్‌ను గుర్తించుకుంటూ ఎదిగే జర్నీ. జాతిరత్నాలు, మ్యాడ్ తరహాలో తెలుగు ఆడియన్స్‌ను టార్గెట్ చేసే సినిమాల్లో ఇది మరో హిట్‌గా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

ఒకే రోజులో ఫస్ట్ షో తర్వాతే మూవీపై బజ్ క్రియేట్ కావడం, సెకండ్ షోకి హౌస్‌ఫుల్ స్టేటస్ రావడం చూస్తుంటే, థియేటర్ వేదికగా ఈ సినిమా హిట్ ట్రాక్‌లోకి ప్రవేశించినట్టే. రెండవ రోజు ఉదయాన్నే బుకింగ్స్ పెరిగిపోయి, పలు కేంద్రాల్లో వేగంగా అడ్వాన్స్ బుకింగ్స్ నిండిపోతున్నాయి. వేసవిలో వినోదాన్ని కోరే ప్రేక్షకులకు ఇది సరైన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్ ప్యాకేజీగా మారుతోంది.

ఈ సినిమాను తెలుగులో అపర్ణ సినిమాస్ అధ్బుతంగా డబ్ చేసింది. మలయాళ టోన్‌ను కోల్పోకుండా, తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా ట్రాన్స్లేట్ చేయడంలో వారు బాగా కష్టపడ్డారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేయడం సినిమాపై అంచనాలు పెంచింది. ముఖ్యంగా ట్రైలర్ లో నస్లేన్ బాలకృష్ణ స్టైల్ లో డైలాగ్ చెప్పడం, థియేటర్ లో సందడి పెంచుతోంది.

ఇక లేటెస్ట్ యూత్ జీవితాన్ని సరదాగా చూపిస్తూ, బాక్సింగ్ లాంటి పవర్ఫుల్ స్పోర్ట్‌కు అర్థవంతమైన కాన్వాస్ ఇచ్చిన జింఖానా.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఓ మినీ సెన్సేషన్ అవుతోంది. లైట్ హార్ట్ కామెడీతో పాటు, సరైన ఎమోషన్ కూడా అందించగలిగే ఈ సినిమా.. ఈ వేసవి బాక్స్ ఆఫీస్‌కి మంచి బూస్ట్ ఇచ్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Tags:    
  • Gymkhana 
  • Naslen 
  • TeluguCinema 
  • AparnaCinemas 
  • MythriMovieMakers 
  • KhalidRahman 
  • PremaluFame 
  • BoxOfficeHit 
  • Tollywood 
  • Filmindustry 

Similar News

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

Copyright @2026

Powered by Blink CMS