న‌రేష్ కూడా అలాంటి స‌మ‌స్యే ఫేస్ చేసాడా?

సాధార‌ణంగా సినిమా హీరోలంటేనే చాలు గాళ్స్ లో పిచ్చ ఫాలోయింగ్ ఉంటుంది.

Update: 2024-05-04 03:00 GMT

సినిమా హీరో అంటే అత‌ని జీవితం ఎలా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు కోట్ల‌లో పారితోషికం..ల‌గ్జ‌రీ కార్లు.. విలాస‌వంత‌మైన బంగ‌ళాలు...హైద‌రాబాద్ శివార్ల‌లో ఫామ్ హౌస్ లు...వీకెండ్ పార్టీలు.. సెల‌బ్రిటీ లైఫ్ స్టైల్.. కోట్ల‌లో అభిమానులు. అభిమానం పొంగిపొర్లిందంటే పాలాభిషేకాలు..ఇలా ఒక‌టేంటి సినిమా హీరో అంటే? వ్య‌వ‌హారం ఈ రేంజ్ లోనే ఉంటుంది. అందులోనే పేరున్న హీరో కోడుకో..ద‌ర్శ‌కుడి కొడుకో..నిర్మాత కుమారుడో అయితే ఇంకే ముంది? అంత‌కు మించి పాపులారిటీ జ‌నాల్లో ఉంటుంది.

సాధార‌ణంగా సినిమా హీరోలంటేనే చాలు గాళ్స్ లో పిచ్చ ఫాలోయింగ్ ఉంటుంది. నిత్యం ప్ర‌పోజ‌ల్స్ వ‌స్తూనే ఉంటాయి. ప్రేమించుకుందామా? పెళ్లి చేసుకుంద‌మా? అనే మాట‌లు ఆ హీరోకి ఓ కామ‌న్ గా వినిపిస్తుంటాయి. మ‌రి అంత పేరున్న న‌టుడికి పెళ్లికి పిల్ల దొర‌క్క పోవ‌డ‌మా? అంటే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందేగా. అవును అల్ల‌రి న‌రేష్ జీవితంలోనే ఇదే చోటు చేసుకుంది. అల్ల‌రి న‌రేష్ పెళ్లి చేసుకుంది ప్రేమించిన అమ్మాయిని కాదు.. పెద్ద‌లు పెద్ద‌లు ద్వారా వెతికి ప‌ట్టుకుంది కాదు.

Read more!

ఓ సాధార‌ణ మ్యాట్రిమోనియ‌ల్ సైట్ ద్వారా అల్ల‌రి న‌రేష్ కి పెళ్లి కుదిరింది అన్న సంగ‌తి ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. చాలా మంది న‌రేష్ పెళ్లి ప్రేమ వివాహం అనుకుంటున్నారు. కానీ కాద‌ని న‌రేష్ క్లారిటీ ఇచ్చారు. న‌రేష్ పెళ్లికి ముందే తండ్రి ఈవీవీ సత్య‌న్నారాయ‌ణ క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత కొన్నాళ్ల‌కి న‌రేష్ వివాహం చేసుకున్నాడు. అయితే ఆ వివాహం మ్యాట్రిమోనియ‌ల్ సైట్ ద్వారా కుదిరిన వివాహం.

త‌న‌త‌ల్లితో పాటు త‌న కుటుంబానికి ద‌గ్గ‌ర‌గా మెలిగిన దివంగ‌త న‌టుడు చ‌ల‌ప‌తి రావు ఆ సంబంధం పెళ్లికుమార్తె త‌ల్లిదండ్రుల‌తో మాట్లాడి పెళ్లి చేసిన‌ట్లు చెప్పారు. వివాహ‌మైన ద‌గ్గ‌ర నుంచి భార్య‌భ‌ర్త‌లుగా కాకుండా స్నేహితు లుగా మెలుగుతామ‌ని తెలిపారు. భార్య‌పై పెత్త‌నం చెలాయించ‌డం ఇష్టం ఉండ‌ద‌ని...అలాగ‌ని ఎందుకు ఏమిటి? అని ప్ర‌శ్నించ‌కుండా ఉండ‌ను...ప్ర‌శ్నించ‌డం అన్న‌ది అవ‌స‌రం మేర ఉంటుంద‌న్నారు.

Tags:    

Similar News