పొలిటికల్ ఎంట్రీపై నారా రోహిత్ ఊహించని కామెంట్స్!

ఇందులో భాగంగా.. నారా రోహిత్ పొలిటికల్ ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. "పెదనాన్న చంద్రబాబు నాయుడు గారు.. అన్న లోకేష్ గారు.. ఇలా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుండే సినిమాల్లోకి వచ్చాను.;

Update: 2025-08-23 14:51 GMT

నారా వారి ఫ్యామిలీ అంటేనే రాజకీయాలకు పెట్టింది పేరు..ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా.. ఎమ్మెల్యేగా.. పలు పదవుల్లో కొనసాగారు. అలాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే అలాంటి నారా ఫ్యామిలీ నుండి ఇప్పటికే చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన కొడుకు లోకేష్ కూడా రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యారు. తాజాగా చంద్రబాబు నాయుడు తమ్ముడి కొడుకు, నటుడు నారా రోహిత్ రాజకీయాల్లోకి రావడం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. మరి నారా రోహిత్ కూడా రాజకీయాల్లోకి రాబోతున్నారా.. ? ఆయన మాట్లాడిన మాటల వెనుక ఉన్న అర్థం ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

నారా రోహిత్ నటించిన తాజా మూవీ సుందరకాండ.. ఈ సినిమాలో ఒకప్పటి నటి శ్రీదేవి విజయ్ కుమార్, అలాగే విర్తి వాఘని హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా ఈ నెల 27న విడుదల కాబోతుండడంతో సినిమా ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు చిత్ర యూనిట్. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నారా రోహిత్ ఇప్పటికే ఎన్నో ఇంటర్వ్యూలో పాల్గొని ఇంట్రెస్టింగ్ కామెంట్లు కూడా చేశారు. అలా తాజాగా సుందరకాండ చిత్ర యూనిట్ రాజమండ్రిలో సందడి చేశారు. అయితే రాజమండ్రిలో సందడి చేసిన సుందరకాండ మూవీ యూనిట్ ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు.

పొలిటికల్ ఎంట్రీ పై నారా రోహిత్ క్లారిటీ..

ఇందులో భాగంగా.. నారా రోహిత్ పొలిటికల్ ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. "పెదనాన్న చంద్రబాబు నాయుడు గారు.. అన్న లోకేష్ గారు.. ఇలా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుండే సినిమాల్లోకి వచ్చాను. ఒకవేళ నేను రాజకీయాల్లోకి వస్తే మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ పవర్ ఫుల్ డైలాగ్ కొట్టారు.. అంతేకాదు రాజకీయాల్లోకి వస్తే ఖచ్చితంగా అభిమానులకి ముందుగానే ఈ విషయాన్ని చెబుతాను" అంటూ కూడా చెప్పుకొచ్చారు.అలా మొత్తానికి నారా రోహిత్ తన పొలిటికల్ ఎంట్రీ గురించి చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్లు మీడియాలో వైరల్ గా మారాయి. మరి నారా రోహిత్ భవిష్యత్తులో పెదనాన్న బాటలో రాజకీయాల్లోకి పూర్తిగా వస్తారా..?లేక సినిమాల్లో రాణిస్తూనే రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇస్తారా? అనేది తెలియాల్సి ఉంది.

సక్సెస్ అవుతారా?

అయితే సినిమా ఇండస్ట్రీ నుండి ఇప్పటికే చాలామంది హీరోలు, హీరోయిన్లు , మిగతావాళ్లు రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయిన వారు ఉన్నారు.అలా రాజకీయ నేపథ్యం నుండి వచ్చిన నారా రోహిత్ సినిమాలు చేస్తూ రాజకీయాల్లోకి వస్తే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే నారా ఫ్యామిలీ సపోర్ట్ తో ఆయన రాజకీయాల్లో కూడా సక్సెస్ అవుతారని పలువురు భావిస్తున్నారు. మరి నారా రోహిత్ ఫ్యామిలీ సపోర్టుతో రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు అభిమానులు.

నారా రోహిత్ సినిమాలు, వ్యక్తిగత జీవితం..

నారా రోహిత్ సినిమాల విషయానికి వస్తే.. బాణం, సోలో, ప్రతినిధి, రౌడీ ఫెలో, అసుర, జ్యో అచ్యుతానంద ఇలా పలు చిత్రాలలో నటుడుగా నటించారు. అంతేకాదు ఆరన్ మీడియా వర్క్స్ సంస్థ అధినేతగా కూడా పనిచేస్తున్నారు. ఈయన వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. ప్రతినిధి 2 హీరోయిన్ శిరీష లెల్లా తో 2024 అక్టోబర్ 13న హైదరాబాదులోని హైటెక్స్ నోవాటెల్ లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇంకా వివాహ గడియలు ప్రకటించలేదు.

Tags:    

Similar News