యంగ్ టైగ‌ర్ తో సినిమాకు రోహిత్ రెడీ!

నారా వార‌బ్బాయి రోహిత్ కొంత కాలంగా సినిమా రంగంలో కొన‌సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. `బాణం`తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోహిత్ ఇప్ప‌టి వ‌ర‌కూ చాలా సినిమాలు చేసాడు.;

Update: 2025-08-23 08:14 GMT

నారా వార‌బ్బాయి రోహిత్ కొంత కాలంగా సినిమా రంగంలో కొన‌సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. `బాణం`తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోహిత్ ఇప్ప‌టి వ‌ర‌కూ చాలా సినిమాలు చేసాడు. డిఫ‌రెంట్ చిత్రాల‌తో అల‌రించిన న‌టుడిగా రోహిత్ కి ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. రోహిత్ లో ఉన్న ఆ క్వాలిటీ మిగ‌తా హీరోల నుంచి అత‌డి ని స‌ప‌రేట్ చేస్తుంది. తాను హీరోగానే కాకుండా ఇత‌ర న‌టుల‌తో క‌లిసి మ‌రికొన్నిచిత్రాలు చేసాడు. ఇలా న‌టుడిగా హీరో అనే ఇమేజ్ ని దాటొచ్చి ప‌నిచేసిన న‌టుడాయ‌న‌. అయితే స్టార్ లీగ్ లో మాత్రం ఇంకా చేర‌లేదు.

వివాదం వేళ క్లారిటీ:

కెరీర్ ప‌రంగా ఇంకా వెనుక‌బ‌డే ఉన్నాడు. వ‌చ్చిన కొత్త అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకుంటూ ప్ర‌యా ణాన్ని కొన‌సాగుతున్నాడు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో సినిమా చేయ‌డానికి నారా రోహిత్ సిద్దంగా ఉన్నట్లు వెల్ల‌డించాడు. ఎన్టీఆర్ తో సినిమా చేయాల‌ని ఎప్ప‌టి నుంచో త‌న‌కీ ఉంద‌ని. ..కానీ ఇంత వ‌ర‌కూ సాద్య‌ప‌డ‌లేదన్నాడు. మంచి క‌థ కుదిరితో తార‌క్ తో ప‌ని చేయ‌డానికి సిద్దంగా ఉన్న ట్లు తెలిపాడు. దీంతో ఇప్పుడీ వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ గా మారాయి. ఎన్టీఆర్ వ‌ర్సెస్ రోహిత్ అన్న చ‌ర్చ నెట్టింట జ‌రుగుతోన్న వేళ రోహిత్ తాజా వ్యాఖ్య‌ల‌తో అన్ని ర‌కాల ప్ర‌చారానికి పుల్ స్టాప్ ప‌డినట్లు అయింది.

సంబంధం లేని సంగ‌తి:

ప్ర‌స్తుతం నారా రోహిత్ `సుంద‌ర‌కాండ` ప్ర‌మోష‌న్ లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో? రోహిత్ పై ఓ కాంట్ర‌వ‌ర్శీ కూడా తెర‌పైకి వ‌చ్చింది. ఎన్టీఆర్ న‌టించిన `వార్ 2` చిత్రాన్ని తాను చూడొద్ద‌ని ప్రచారం చేసిన‌ట్లు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. తాజాగా ఆ వ్యాఖ్య‌లు త‌న వ‌ర‌కూ వ‌చ్చా యన్నాడు రోహిత్. కానీ దానికి సంబంధించిన వీడియో మాత్రం ఇంత వ‌ర‌కూ చూడ‌లేదన్నాడు. అలాంట ప్పుడు దాని గురించి స్పందించ‌డం దేనిక‌ని ప‌ట్టించుకోన‌ట్లు తెలిపాడు.

ఆశ‌ల‌న్నీ ఆసినిమా పైనే:

దీంతో తార‌క్ -రోహిత్ పై జ‌రిగే ప్ర‌చారమంతా అవాస్త‌వ‌మ‌ని తేలిపోయింది. ఈ క్ర‌మంలోనే తార‌క్ తో క‌లిసి ప‌ని చేస్తాను? అన్న ఆస‌క్తితోనూ ఇద్ద‌రి మ‌ధ్య ఎలాంటి వివాదాలు కూడా లేవ‌ని క్లారిటీ వ‌స్తుంది. ఇక రోహిత్ సుంద‌ర‌కాండ సినిమాపై చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. గ‌త సినిమా `భైర‌వం` ఆశించిన ఫ‌లితాలు సాధించ‌లేదు. అంత‌కు ముందు చేసిన కొన్ని వైవిథ్య‌మైన ప్ర‌య‌త్నాలు క‌మ‌ర్శియ‌ల్ గా వ‌ర్కౌట్ అవ్వ‌లేదు. దీంతో రోహిత్ ఆశ‌ల‌న్నీ `సుంద‌రకాండ‌`పైనే ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది.

Tags:    

Similar News