• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కల్కి సీక్వెల్ లో నాని!...

కల్కి సీక్వెల్ లో నాని! అసలు మ్యాటర్ ఏంటంటే?

| పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2024-08-25 12:05 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఆ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.1200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులను బ్రేక్ చేస్తూ.. మరెన్నో క్రియేట్ చేసింది. ఇప్పుడు ఓటీటీలో కూడా దూసుకుపోతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోతోపాటు నెట్ ఫ్లిక్స్ లో సత్తా చాటుతోంది. భారీ వ్యూస్ అందుకుంటూ కొత్త రికార్డులను సృష్టించేందుకు సిద్ధమవుతోంది.

అయితే కల్కి మూవీలో ఎందరో సెలబ్రిటీలు క్యామియో రోల్స్ లో కనిపించిన విషయం తెలిసిందే. దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, అనుదీప్ సహా అనేక మంది సందడి చేశారు. వీరందరినీ స్క్రీన్ పై చూసి షాక్ అయ్యేలా సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. అదే సమయంలో నేచురల్ స్టార్ నాని కూడా కల్కి మూవీలో కనిపించనున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. కృష్ణుడు లేదా అభిమన్యుడు రోల్ లో సందడి చేయనున్నారని జోరుగా ప్రచారం సాగింది.

ఎందుకంటే.. కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నాని ఎవడే సుబ్రమణ్యం మూవీ చేశారు. దీంతో ఆయనను కూడా నాగ్ అశ్విన్ మూవీ కోసం దించినట్లు టాక్ వినిపించింది. కానీ నాని ఏ రోల్ లో కూడా కనిపించలేదు. అయితే సీక్వెల్ లో నాని నటిస్తారని మళ్లీ వార్తలు వచ్చాయి. ఇప్పుడు వీటిపై ఆయన స్పందించారు. తన అప్ కమింగ్ మూవీ సరిపోదా శనివారం ప్రమోషన్స్ లో భాగంగా.. ముంబైలో బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. కల్కి సీక్వెల్ లో తాను నటించడం లేదని తెలిపారు.

వైజయంతీ మూవీస్ తోపాటు నాగ్ అశ్విన్ తో తనకు ఉన్న రిలేషన్ కారణంగా తాను కల్కిలో యాక్ట్ చేస్తున్నట్లు రూమర్స్ వచ్చాయని నాని చెప్పారు. తాను ఆ ప్రాజెక్ట్ లో భాగం కాదని వెల్లడించారు. అందుకు సంబంధించి ఎలాంటి ప్లాన్స్ లేవని క్లారిటీ ఇచ్చారు. అయితే రీసెంట్ గా నాగ్ అశ్విన్.. నాని రోల్ పై ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. సీక్వెల్ లో సరైన పాత్ర కోసం నానితోపాటు నవీన్ పోలిశెట్టిని సంప్రదించే అవకాశం వస్తే రావొచ్చని నాగీ తెలిపారు.

ప్రస్తుతం కల్కి సీక్వెల్ స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నారు నాగ్ అశ్విన్. ఇటీవల జరిగిన కల్కి 50 డేస్ సెలబ్రేషన్స్ లో పాల్గొని సందడి చేశారు. త్వరలోనే సీక్వెల్ స్క్రిప్ట్ వర్క్ మొత్తాన్ని పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఏడాది స్టార్టింగ్ లో సెట్స్ పై తీసుకెళ్లేందుకు ప్రణాళిక రచిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. 2025 చివర్లో ప్రేక్షకుల ముందుకు సినిమా తీసుకురావాలని భావిస్తున్నారట. మరి సైన్స్ ఫిక్షన్ జోనర్ లో రానున్న కల్కి సీక్వెల్ లో నాని కనిపిస్తారో లేదో వేచి చూడాలి.

Tags:    
  • Naturalstar 
  • Nani 
  • Tollywood 
  • Filmindustry 
  • Saripodhaasanivaaram 
  • Vivekathreya 
  • Kalki 
  • Kalki2898AD 
  • Nagashwin 
  • Prabhas 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS