• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నాని నెట్ ఫ్లిక్స్...

నాని నెట్ ఫ్లిక్స్ డీల్స్.. ఇది మామూలు క్రేజ్ కాదు

| అలాగే కూతురి సెంటిమెంట్ కూడా సినిమాకి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యింది

By - Tupaki Desk
Update: 2024-01-30 09:02 GMT

నేచురల్ స్టార్ నాని గత ఏడాది దసరాతో బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకున్నాడు. ఈ మూవీ ఏకంగా వంద కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు చేసింది. నాని కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ సొంతం చేసుకున్న మూవీగా దసరా నిలిచింది. తరువాత హాయ్ నాన్న మూవీతో క్లాసిక్ హిట్ అందుకున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమాబాగా కనెక్ట్ అయ్యింది. మృణాల్ ఠాకూర్, నాని ఆన్ స్క్రీన్ లవ్ స్టోరీ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యింది.

అలాగే కూతురి సెంటిమెంట్ కూడా సినిమాకి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యింది. ఈ కారణంగా ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత కూడా హాయ్ నాన్న సినిమాకి అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్సీ ధరకి సొంతం చేసుకుంది. ప్రస్తుతం హాయ్ నాన్న మూవీ టాప్ టెన్ లో ట్రెండింగ్ అవుతోంది. దసరా సినిమాని కూడా నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకొని భారీ ఆదరణ సొంతం చేసుకుంది.

ఇవి మాత్రమే కాకుండా ఈ మధ్యకాలంలో తెలుగులో రిలీజ్ అయ్యే పెద్ద పెద్ద సినిమాలు అన్ని కూడా ఓటీటీ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ భారీ ధరలు చెల్లించి సొంతం చేసుకుంటుంది. సలార్, యానిమల్ సినిమాల డిజిటల్ రిలీజ్ రైట్స్ ని కూడా నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ రెండు సినిమాలు వరల్డ్ వైడ్ గా ప్రస్తుతం టాప్ ట్రెండింగ్ చిత్రాలుగా ఉన్నాయి.

కొత్తదనం ఉన్న కంటెంట్ కనిపిస్తే నెట్ ఫ్లిక్స్ వెంటనే ఆ మూవీ హక్కులని ఎంత రేటు అయిన చెల్లించి కొనుగోలు చేసేస్తుంది. ఇప్పుడు నేచురల్ స్టార్ నాని కొత్త మూవీ సరిపోదా శనివారం డిజిటల్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ఏకంగా 45 కోట్లు పెట్టి ఈ సినిమా హక్కులని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. నాని సినిమాలకి ఓటీటీలో మంచి ఆదరణ వస్తోన్న నేపథ్యంలో ఈ స్థాయిలో నెట్ ఫ్లిక్స్ చెల్లించడానికి ముందుకొచ్చినట్లు తెలుస్తోంది.

అంటే సరిపోదా శనివారం సినిమాకి డిజిటల్ రైట్స్ ద్వారానే 70 శాతం రికవరీ వచ్చేసినట్లు తెలుస్తోంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఎస్ జె సూర్య ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్ లో ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు.


Tags:    
  • Ott 
  • Netflix 
  • Animal 
  • Ranbirkapoor 
  • Sandeepreddyvanga 
  • Srk 
  • Jawan 
  • Salaar 
  • Prabhas 
  • Shyamsingharoy 
  • Nani 
  • Hinanna 
  • Saripodhasanivaaram 

Similar News

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS