• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'డార్లింగ్' కోసం స్టార్...

'డార్లింగ్' కోసం స్టార్ హీరో.. ఇద్దరూ నేచురలే!

| టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి.. అటు హీరోగా.. ఇటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే

By - Tupaki Desk
Update: 2024-07-15 06:54 GMT

టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి.. అటు హీరోగా.. ఇటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. మల్లేశం, బలగం చిత్రాలతో హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రియదర్శి.. మరికొద్ది రోజుల్లో డార్లింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. చిన్న గ్యాప్ తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. డైరెక్టర్ అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు.

హనుమాన్ తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న నిర్మాత నిరంజన్ రెడ్డి.. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై గ్రాండ్ గా రూపొందిస్తున్నారు. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న మూవీ.. రిలీజ్ కు రెడీ అవుతోంది. అయితే విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ.. మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. కొన్ని రోజుల క్రితం రిలీజ్ అయిన ట్రైలర్.. మూవీపై అంచనాలు పెంచింది.

ఇక ప్రమోషన్స్ లో భాగంగా డార్లింగ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు మేకర్స్. అందుకు గాను చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరోను ఆహ్వానించారు. టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని.. ముఖ్య అతిథిగా రానున్నారు. ఈ మేరకు మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. "ప్రత్యేక అతిథితో ప్రత్యేక సాయంత్రం.. నేచురల్ స్టార్ నాని 'మ్యాడ్‌ మాక్స్ మ్యారేజ్ ఎంటర్టైనర్ డార్లింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్‌ కు తన మ్యాజిక్‌ ను తీసుకొస్తారు" అంటూ మేకర్స్ ట్వీట్ చేశారు.

హైదరాబాద్ పార్క్‌ హయత్‌ లో నేడు సాయంత్రం జరగనున్న ఈవెంట్‌ లో నాని సందడి చేయనున్నారు. అయితే నాని నేచురల్ స్టార్ గా పేరు సంపాదించుకోగా.. ప్రియదర్శి తన నేచురల్ కామెడీతో అందరినీ అలరిస్తారు. దీంతో నేచురల్ స్టార్.. నేచురల్ కమెడియన్ కోసం రానున్నారన్నమాట. ఇక డార్లింగ్ సినిమాలో అనన్య నాగళ్ల, మోయిన్, శివా రెడ్డి, మురళీధర్ గౌడ్, కళ్యాణి రాజ్, సునీత మనోహర్ తోపాటు పలువురు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ట్రైలర్ ప్రకారం.. తన భార్యను పారిస్ కు హనీమూన్ కు తీసుకెళ్లాలనుకునే హీరో (ప్రియదర్శి) హీరోయిన్ (నభా నటేష్) ను వివాహం చేసుకుంటాడు. కానీ ఆమెకు స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ ఉంటుంది. దీంతో పెళ్లి అయ్యాక అతను ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? సమస్యల నుంచి ఎలా బయటపడ్డాడు? చివరకు ఏం జరిగిందనేది సినిమాగా తెలుస్తోంది. మరి ఈ మూవీతో ప్రియదర్శి, నభా నటేష్ ఎలాంటి హిట్ కొడతారో చూడాలి.

Tags:    
  • Nani 
  • Darlingprerelease 
  • Naturalstarnani 
  • Priyadarshi 
  • Nabhanatesh 
  • Tollywood 
  • Darlingmovie 

Similar News

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS