హిట్ ఇచ్చిన వారితో నాని బ్యాక్ టు బ్యాక్ సినిమాలు
వరుస ప్రాజెక్టులు చేస్తూ సినిమా సినిమాకీ తన మార్కెట్ ను పెంచుకుంటూ వెళ్తున్నారు నేచురల్ స్టార్ నాని. పక్కింటబ్బాయిలా అనిపించే నాని నుంచి కొత్త సినిమా ఎప్పుడొస్తుందా అని అందరూ వెయిట్ చేసే స్థాయికి నాని ఎదిగారు.;
వరుస ప్రాజెక్టులు చేస్తూ సినిమా సినిమాకీ తన మార్కెట్ ను పెంచుకుంటూ వెళ్తున్నారు నేచురల్ స్టార్ నాని. పక్కింటబ్బాయిలా అనిపించే నాని నుంచి కొత్త సినిమా ఎప్పుడొస్తుందా అని అందరూ వెయిట్ చేసే స్థాయికి నాని ఎదిగారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు సొంతంగా సినిమాలు నిర్మించే పొజిషన్ కు వెళ్లిన నాని ప్రస్తుతం ది ప్యారడైజ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ది ప్యారడైజ్ పై భారీ అంచనాలు
ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ది ప్యారడైజ్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అనౌన్స్‌మెంట్ వీడియోతోనే ఈ సినిమాపై మేకర్స్ ఆడియన్స్ కు విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే నాని, శ్రీకాంత్ కలిసి దసరా సినిమా చేయగా ఇప్పుడు మరోసారి వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో ది ప్యారడైజ్ పై మంచి అంచనాలున్నాయి.
సుజీత్ సినిమా వాయిదా
ది ప్యారడైజ్ సినిమా తర్వాత నాని తనకు హాయ్ నాన్న లాంటి మెమొరబుల్ సినిమాను ఇచ్చిన శౌర్యువ్ తో సినిమా చేయనున్నారు. వాస్తవానికి నాని దానికంటే ముందే యంగ్ డైరెక్టర్ సుజీత్ తో సినిమా చేయాల్సింది కానీ ఆ సినిమా పోస్ట్ పోన్ అయినట్టు తెలుస్తోంది. సుజీత్ సినిమా వాయిదా పడటంతో నాని, శౌర్యువ్ సినిమాను లైన్ లో పెట్టినట్టు సమాచారం.
అవన్నీ రూమర్లే..
అంటే నాని తన బ్యాక్ టు బ్యాక్ సినిమాలను తనకు సూపర్‌హిట్లు అందించిన డైరెక్టర్లతో చేస్తున్నారన్నమాట. హిట్3తో అనుకున్న స్థాయి విజయాన్ని అందుకోలేక పోయిన నేచురల్ స్టార్ ఈ రెండు సినిమాలతో మంచి విజయాలను అందుకుని కెరీర్ లో నెక్ట్స్ లెవెల్ కు వెళ్లాలని చూస్తున్నారు. మరి ఈ డైరెక్టర్ నానికి ఎలాంటి ఫలితాన్ని మిగులుస్తారో చూడాలి. అయితే మధ్యలో శౌర్యువ్, ఎన్టీఆర్ హీరోగా సినిమా చేస్తారని అన్నారు. కానీ అవన్నీ రూమర్లేనని తర్వాత తేలిన విషయం తెలిసిందే.